ఒకే రోజు 20 వికెట్లు.. గుజరాత్‌ ఘన విజయం | Ranji Trophy: Gujarat register outright win in Group C on penultimate day | Sakshi
Sakshi News home page

ఒకే రోజు 20 వికెట్లు.. గుజరాత్‌ ఘన విజయం

Nov 11 2025 7:44 AM | Updated on Nov 11 2025 7:44 AM

Ranji Trophy: Gujarat register outright win in Group C on penultimate day

రంజీ సీజన్‌ 2025-26 సీజన్‌లో గుజరాత్‌ ఎట్టకేలకు నాలుగో మ్యాచ్‌లో బోణీ కొట్టింది. గ్రూప్‌ ‘సి’లో సరీ్వసెస్‌తో జరిగిన పోరులో గుజరాత్‌ 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఒక్క మూడో రోజే మూడు ఇన్నింగ్స్‌లు జరిగాయి. 20 వికెట్లు కూలాయి. 

మ్యాచ్‌ ఫలితం కూడా ఓ రోజు ముందే వచ్చింది. సోమవారం 171/4 ఓవర్‌నైట్‌ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన గుజరాత్‌ 85.4 ఓవర్లలో 256 పరుగుల వద్ద ఆలౌటైంది. క్రితం రోజు బ్యాటర్లు క్షితిజ్‌ పటేల్‌ (56; 4 ఫోర్లు, 1 సిక్స్‌), ఉర్విల్‌ పటేల్‌ (48; 5 ఫోర్లు, 1 సిక్స్‌) ఆడినంత వరకే ఇన్నింగ్స్‌ సాగింది. 

తర్వాత వాళ్లిద్దరు అవుటయ్యాక మిగతా వికెట్లు కేవలం 20 పరుగుల వ్యవధిలోనే పడ్డాయి. పులకిత్‌ నారంగ్‌ 5, అమిత్‌ శుక్లా 4 వికెట్లు తీశారు. గుజరాత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 8 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. తర్వాత రెండో ఇన్నింగ్స్‌ ఆడిన సర్వీసెస్‌ 37.3 ఓవర్లలో 125 పరుగులకే కుప్పకూలింది. 

మోహిత్‌ అహ్లావత్‌ (56; 5 ఫోర్లు, 1 సిక్స్‌) ఒక్కడే పోరాడాడు. మిగతా బ్యాటర్లెవరూ కనీసం 15 పరుగులను మించి చేయలేకపోయారు. విశాల్‌ 6, సిద్ధార్థ్‌ దేశాయ్‌ 4 వికెట్లు తీశారు. 118 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన గుజరాత్‌ 21.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసి గెలిచింది. క్షితిజ్‌ (36 నాటౌట్‌; 4 ఫోర్లు) మెరుగ్గా ఆడాడు. ఆ 4 వికెట్లు అమిత్‌ శుక్లాకే దక్కాయి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement