నవంబర్ 17 నుంచి పాకిస్తాన్‌లో జరిగే ముక్కోణపు టీ20 సిరీస్ నుంచి జింబాబ్వే స్టార్ బౌలర్ బ్లెస్సింగ్ ముజరబానీ వైదొలిగాడు. వెన్ను గాయం కారణంగా ముజరబానీ ఈ టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ముజరబానీ స్థానాన్ని న్యూమన్ న్యామ్హురితో భర్తీ చేస్తున్నట్లు జింబాబ్వే క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ టోర్నీలో జింబాబ్వే, ఆతిథ్య పాక్‌తో పాటు శ్రీలంక జట్టు పాల్గొంటుంది.

ఈ టోర్నీలో జింబాబ్వే జట్టుకు సికందర్ రజా నాయకత్వం వహిస్తున్నాడు. టోర్నీలో ఓపెనర్‌లో పాకిస్తాన్, జింబాబ్వే తలపడతాయి. రావల్పిండి వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. నవంబర్ 19న జరిగే రెండో మ్యాచ్‌లో శ్రీలంక, జింబాబ్వే పోటీపడతాయి. ఈ మ్యాచ్‌కు కూడా రావాల్పిండేనే ఆతిథ్యమివ్వనుంది.
అనంతరం నవంబర్ 22వ తేదీ పాకిస్తాన్-శ్రీలంక, 23న జింబాబ్వే-పాకిస్తాన్, 27న పాకిస్తాన్-శ్రీలంక పోటీపడతాయి. 29న లాహోర్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరుగనుంది.
పాకిస్తాన్ ట్రై సిరీస్ కోసం జింబాబ్వే జట్టు: సికందర్ రజా (కెప్టెన్), బ్రియాన్ బెన్నెట్, ర్యాన్ బర్ల్, గ్రేమ్ క్రీమర్, బ్రాడ్లీ ఎవాన్స్, క్లైవ్ మదాండే, టినోటెండా మపోసా, వెల్లింగ్టన్ మసకద్జా, తడివానాషే మారుమణి, టోనీ మున్యోంగా, తషింగా ముసెకివా, డియాన్ మేయర్స్, రిచర్డ్ నగరవ, న్యూమన్ న్యామ్హురి, బ్రెండన్ టేలర్


