
22 ఏళ్ల క్రితం ఇంచుమించు ఇదే రోజున అంతరిక్ష ప్రయోగాల్లో సరికొత్త సందర్భం ఎదురైంది. ఒక కొత్త పోకడకు నాంది పలికింది. అంతరిక్షంలో వివాహం అన్న ఊహే వింతగా ఉన్నా..దాన్ని నిజం చేసుకుంది ఓ జంట. సరిగ్గా ఆగస్టు 10ని అంతరిక్షంలో పెళ్లి చేసుకుని అసాధారణమైన మైలురాయిని నమోదు చేసుకుంది ఆ జంట. ఆ దంపతులు ఎవరంటే..
వారే రష్యన్ వ్యోమగామి యూరి మాలెన్‌చెంకో(Yuri Malenchenko), ఎకటెరినా డిమిత్రివ్(Ekaterina Dmitriev) దంపతులు. వ్యోమగామి యూరి మాలెన్ చెంకో అమెరికా టెక్సాస్‌లో ఉండే తన గర్ల్‌ఫ్రెండ్‌ని డిమిత్రివ్‌ని అంతరిక్షంలో పెళ్లి చేసుకుని సరికొత్త మైలురాయిని సృష్టించాడు. డిమిత్రివ్ హుస్టన్‌లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నాసా అంతరిక్ష నియంత్రణ మధ్య ఉపగ్ర హుక్ అప్ ద్వారా తన ప్రియుడు వ్యోమగామి మాలెన్‌చెంకోని వివాహమాడింది.
సరిగ్గా ఆగస్టు 10, 2003న ఈ జంట వివాహం జరిగింది. మాలెన్ చెంకో తన అధికారిక అంతరిక్ష సూట్ బో టైను ధరించగా, హుస్టన్‌లోని నాసా జాన్సన్ స్పేస్ సెంటర్‌లో డిమిత్రివ్ సంప్రదాయ వివాహ దుస్తుల్లో వేచి చూస్తోంది. యూరి దూరంగా ఉన్నందునా ఆమె అక్కడ అతడి కటౌట్ బోర్డుతో దర్శనమిచ్చింది. వారిద్దరిని దగ్గర చేసేది వీడియో కాల్ కమ్యూనికేషన్.
నిజానికి భూమ్మీద 200 మంది అతిధుల సమక్షంలో వివాహ బంధంతో ఒక్కటవ్వాలని భావించారు. అయితే మాలెన్‌చెంకో అంరిక్షకేంద్రంలో గడిపే సమయం పొడిగించడంతో..వారు తమ ప్రేమను పెళ్లిగా మార్చుకోవడానికి మరొక మార్గాన్ని ఎంచుకోక తప్పలేదు. డిమిత్రివ్ మాలెన్‌చెంకో కార్డ్‌బోర్డు కటౌట్‌తో ఫోటోలకు ఫోజులిస్తూ..డేవిడ్ బోవి పాటకు స్టెప్పులేసింది.
ఇక మాలెన్ చెంక్‌తో పాటు ఉన్న మరో వ్యోమగామి కీ బోర్డుపై వివాహ మార్చ్‌ను ప్లే చేశాడు. అంతేగాదు వీడియో కాల్ సాయంతో తన కాబోయే భర్తకు ముద్దుపెట్టి మరి ప్రపోజ్ చేసింది. ఈ సుదూర వివాహం కంటే ముందు నుంచే ఈ జంట సుదూరంగానే రిలేషన్‌లో ఉండటానికి అలవాటుపడ్డారు.
నిజం చెప్పాలంటే ఇలా అంతరిక్షంలో పెళ్లి చేసుకునే అదృష్టం ఈ జంటకే లభించిందని పేర్కొనవచ్చు. ఎందుకంటే ఈ జంటలా మరేవ్వరూ అంతరిక్షంలో వివాహం చేసుకోకుండా నిషేధించినట్లు అధికారులు వెల్లడించారు. ఆగస్టులో వివాహం అనంతరం కొన్ని నెలలకు మాలెన్‌చెంకో భార్యని కలిసేందుకు ఇంటికి తిరిగి వచ్చాడు.
(చదవండి: పది కిలోలు బరువు తగ్గిన భారత్‌పే సహ వ్యవస్థాపకుడు..ఆ రెండు సూత్రాలే కీలకం..!)