
భారతదేశపు అతిపెద్ద ఏకీకృత యూపీఐ క్యూర్ కోడ్ ప్రోవైడర్ భారత్‌పే సహ వ్యవస్థాపకుడు, సీఈవో అష్నీర్ గ్రోవర్(Ashneer Grover) స్లిమ్‌గా మారిపోయారు. ఆయన సోనీ టీవి వ్యాపార రియాలటీ టెలివిజన్ సీరీస్ షార్క్ ట్యాంక్ సీజన్ 1లో న్యాయనిర్ణేతగా కూడా వ్యవహరించారు. ఆ తర్వాత నుంచి ఆయన్ను మోటా వాలా షార్క్‌గా అని పిలుస్తున్నారు. బహుశా ఆ క్రేజ్ అతడిని ఫిట్‌నెస్‌పై దృష్టిసారించేలా చేసి పదికిలోలుమేర బరువు తగ్గేందుకు దారితీసింది. ఆయన ఈ కొత్త లుక్‌లో యంగ్ ఆష్నీర్‌గా ఆకర్షణీయంగా ఉన్నారు. అందుకు రెండే రెండు ప్రిన్స్‌పల్స్ హెల్ప్ అయ్యాయట. మరి అవేంటో తెలుసుకుందామా..!.
'క్రమశిక్షణ', 'సంకల్పం' వంటి రెండు సూత్రాలను గట్టిగా అనుసరిస్తే భారమైన బరువుని సులభంగా వదిలించుకోగలమని చెబుతున్నారు అష్నీర్. ఇవి రెండు ఎప్పుడూ వినే సాధారణ సూత్రాలే అయినా..ఎందులోనైనా పూర్తి స్థాయిలో విజయం సాధించాలంటే ఇవి అత్యంత కీలకం అనే విషయం గ్రహించాలి. ఇక అష్నీర్ బరువు తగ్గడంలో ప్రధాన పాత్ర పోషించింది పోషకాహారం. కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులతో కూడిన సమతుల్య భోజనమేనని చెబుతున్నారు.
దీంతోపాటు వ్యాయమం కూడా బరువు తగ్గేందుకు హెల్ప్ అయ్యిందని చెప్పుకొచ్చారు. దీన్ని బరువు తగ్గడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గాలలో ఒకటిగా పేర్కొన్నారు. కేలరీలు బర్న్ చేయడానికి, లీన్ కండరాలను నిర్మించడానికి, బొడ్డు కొవ్వుని తగ్గించుకోవడానికి, మానసిక స్థితిని మెరుగుపరుచుకోవడానికి, స్థిరమైన ఫలితాలు ఇవ్వడానికి సహాయపడుతుంది. ఈ 43 ఏళ్ల వ్యాపారవేత్త వెయిట్ లాస్ అవ్వడంలో ఆహారం, సుదీర్ఘ నడక, అంగుళం నుంచి కిలో గ్రాముల బరువు తగ్గేందుకు దారితీస్తుందని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నారు.
అంతేగాదు ఆరోగ్యకరమైన ఆహారం బరవు తగ్గడంలో అత్యంత కీలకమైన అంశాలలో ఒకటని న్యూట్రిషన్ జర్నల్ ప్రచురించిన అధ్యయనంలో పేర్కొంది. ప్రోటీన్ , కార్బోహైడ్రేట్ ఆహారాలు కలిగి ఉన్న ఆరోగ్యకరమైన ఆహారం బరువు తగ్గడానికి హెల్ప్ అవ్వడమేగాక, అదుపులో ఉంచుకోగలుగుతామని పలు అధ్యయనాల్లో తేలింది. దీనికి కావల్సిందల్ల క్రమశిక్షతో కూడిన జీవనశైలి, వ్యాయామాలు, మంచి ఆహారపు అలవాట్లేనని ప్రముఖ వ్యాపారవేత్త అష్నీర్ తన స్వీయానుభవంతో వెల్లడించారు.
(చదవండి: హాలీవుడ్ మోడల్‌గా ఈ-రిక్షాడ్రైవర్..!)