
మన కళ్లముందే సాదాసీదాగా కనిపించని వ్యక్తులు ఒక్కసారిగా స్టన్నింగ్ మోడల్ లుక్‌లో కనిపిస్తే..కచ్చితంగా షాకవ్వతాం. నిజంగా మోడల్ రైంజ్ లుక్ ఉందా వీరికి అని విస్తుపోతాం. అందుకు కావాల్సినంత డబ్బు లేకపోవడంతోనే ముఖాకృతికి సంబంధించిన హంగులు, మేకప్ జోలికి వెళ్లే ఛాన్స్ ఉండదు. దాంతో సాధారణ వ్యక్తుల్లా మన మధ్య ఉంటారు.
ఎవరో ఓ టాలెంటెడ్ మేకప్ ఆర్టిస్ట్ లేదా మోడల్‌నో దాన్ని గుర్తించి వారిలో ఉన్న అద్భుత మోడల్‌ని వెలికితీస్తారు. అలానే ఇక్కడొక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఓ రిక్షడ్రైవర్‌ని ఎంత గ్లామరస్‌గా మార్చాడో చూస్తే విస్తుపోతారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది.
ఆ వీడియోలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ మోడల్‌గా తీర్చిదిద్దే మాస్టర్‌పీస్ కోసం వెదుకుతున్నట్లు కనిపిస్తుంది. ఎదురుగా ఈ రిక్షాడ్రైవర్. అతని లుక్స్‌లో ఏదో మోడ్రన్‌ని గుర్తించి మొత్తం అతడి రూపురేఖలనే మార్చేస్తాడు. ఇంట్లో దొరికే పెరుగు, పుదీనా ప్యాక్‌తో స్కిన్ లుక్, విటమిన్ ఈ వంటి ఆయిల్స్ హెయిర్‌ని అందంగా మార్చేస్తాడు. మంచి డ్రెస్సింగ్ వేర్‌తో అతడిలో దాగున్న అద్భుతమైన మరో వ్యక్తిని వెలికితీస్తాడు.
నిజంగా ముందున్న లుక్‌కి ఇప్పుడున్నీ స్టన్నింగ్ లుక్‌కి చాలా వ్యత్యాసం ఉంటుంది. కచ్చితంగా ఈ వ్యక్తి అంతకుముందు చూసి వ్యక్తేనే అని మన కళ్లను మనమే నమ్మలేనంతంగా అతడి మొత్తం ఆహార్యాన్ని అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దుతాడు ఈ ఇన్‌ఫ్లుయెన్సర్. నెటిజన్లు కూడా అంత అందంగా మార్చే వ్యక్తి మాక్కూడా కావాలి. బ్రో నీ చేతుల్లో ఏదో మ్యాజిక్ ఉంది అంటూ కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు.
(చదవండి: తొమ్మిది పదుల వయసులో ఆ తల్లికి ఎంత కష్టం..? పాపం కొడుకు కోసం..)