
సమోసా అంటే ఎవరికి ఇష్టం ఉండదు. వేడివేడి చాయ్‌తో ఆరగించే స్నాక్ ఐటెం అది. ఈ చిరు తిండిని బంగాళ దుంప మసాల, లేదా బఠానీలతో క్రిస్పీగా అందించడం విన్నాం. బంగారు త్రిభుజాకారంలో నోరూరించే ఈ వంటకం భారతీయుల వంటకాలలో అంతర్భాగం. మహా అయితే ఆ సమోసాలో మూడు, నాలుగు రకాల వెరైటీలు చూసుంటాం. కానీ ఏకంగా వందల రకాల వెరైటీ సమోసాలు అందించే ఫుడ్‌స్టాల్ గురించి విన్నారా?. ఔను మీరు వింటుంది నిజమే. నో ఛాన్స్ అనుకోకండి..అన్ని రకాలు అమ్ముతూ నెట్టింట వైరల్ అయ్యాడు ఈవ్యక్తి.
ఎక్కడుందంటే ఆ ఫుడ్ స్టాల్.. పంజాబ్‌లో జలంధర్(Jalandhar)లోని వీధిలో ఈ దుకాణం దర్శనమిస్తుంది. అక్కడ ఇన్ని రకాల సమోసా వెరైటీలను(Samosa Varieties) చూడొచ్చు. పది రకాల సమోసాలు విక్రయిస్తేనే..వామ్మో..! అనేస్తాం. కానీ ఇక్కడ ఏకంగా 200 రకాల సమోసాలను అందిస్తున్నారు ఆహారప్రియులకు. అవేంటో చూద్దామా..ముందుగా లేడిఫింగర్ సమోసాతో మొదలై..బీన్స్ సమోసా, పచ్చి అరటి సమోసా, పనీర్ సమోసా, గోబీ సమోసా, సోయా సమోసా, నూడిల్స్ సమోసా, మాకరోని, పుట్టగొడుగులు ఇలా పలు రకాల సమోసాలు దర్శనమిస్తున్నాయి.
వాటిని చూడగానే..ఆ రకరకాల సమోసాలు టేస్ట్ చేయగలమా అనే సందేహం తప్పక కలుగుతుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు సైతం బ్రో నేను ఆలుతో చేసిన సమోసా తప్ప మరేది ట్రై చేయను అని ఒకరు, బాబోయ్ సమోసాపై ఉన్న ఇష్టాన్ని చంపేశావు కదా అని మరొకరు ఇలా కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు.
(చదవండి: చలి పులి వచ్చేస్తోంది..ఆరోగ్యం జాగ్రత్త! హెచ్చరిస్తున్న నిపుణులు)