అసెంబ్లీకి కేసీఆర్‌ రాకపోతే తప్పు ఒప్పుకున్నట్టే: కోమటిరెడ్డి | Minister Komatireddy Venkat Reddy Comments On KCR | Sakshi
Sakshi News home page

అసెంబ్లీకి కేసీఆర్‌ రాకపోతే తప్పు ఒప్పుకున్నట్టే: కోమటిరెడ్డి

Aug 30 2025 3:53 PM | Updated on Aug 30 2025 4:14 PM

Minister Komatireddy Venkat Reddy Comments On KCR

సాక్షి, హైదరాబాద్‌: రేపటి(ఆదివారం) నుంచి కాళేశ్వరంపై చర్చ జరుగుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీకి కేసీఆర్‌ రాకపోతే తప్పు ఒప్పుకున్నట్టేనంటూ ఆయన వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అన్నీతానేనని గొప్పలు చెప్పుకున్న కేసీఆర్.. అసెంబ్లీకి వచ్చి వివరణ ఇవ్వాలన్నారు. భయపడే కేసీఆర్‌ మళ్లీ కోర్టుకు వెళ్లారని కోమటిరెడ్డి అన్నారు.

కాళేశ్వరం కేసీఆర్‌ హయాంలోనే రికార్డు స్థాయిలో కట్టారు.. ఆయన హయాంలోనే కూలింది. కాళేశ్వరంపై వేసిన కమిషన్‌ జడ్జి.. సుప్రీంకోర్టు జడ్జిగా పని చేశారు. మంచి పేరున్న న్యాయమూర్తి ఆయన. సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దానికి భయపడే కేసీఆర్, హరీష్‌రావు కోర్టుకెళ్లారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక తప్పు అని భావిస్తే.. కేసీఆర్ అసెంబ్లీ వచ్చి చెప్పాలి. ప్రతిపక్ష నేతగా జీత భత్యాలు తీసుకుంటున్నాడు.. బాధ్యత ఆయనపై ఉంటది. కాళేశ్వరంపై చర్చ పెడితే అసెంబ్లీ నుంచి బీఆర్‌ఎస్‌ వాకౌట్ చేయకుండా మా మీద పూలు చల్లుతారా.? తప్పించుకుని పారిపోతారు.

కాళేశ్వరం పూర్తి నివేదిక.. కంప్లీట్‌గా చర్చ ఉంటుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అన్నీ తానే అని చెప్పుకున్న కేసీఆర్ అసెంబ్లీకి రావాలని కోరుతున్నా.. కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే తప్పు ఒప్పుకున్నట్లే.. కాళేశ్వరం విషయంలో తప్పైతే తప్పని బాధ్యతగా ఒప్పుకోవాలి. కేసీఆర్ అసెంబ్లీకి.. వస్తాడని అనుకుంటున్నాం. కాళేశ్వరంపై లక్ష కోట్లు తిన్న వాళ్లను వదిలేస్తామా.?. ప్రజల ముందు దోషులుగా నిలబెడతాం. వాళ్లను ఏం చేయాలో ప్రజలు నిర్ణయిస్తారు. కాళేశ్వరంపై పెట్టిన శ్రద్ధ 10 ఏళ్లు డిండి, పాలమూరు లాంటి ప్రాజెక్టుల మీద ఎందుకు పెట్టలేదు?’’ అంటూ కోమటిరెడ్డి ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement