ప్రభుత్వాలకు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎటిఎంలు: అక్బరుద్దీన్ ఓవైసీ | Akbaruddin Owaisi Fires About Irrigation Projects in Assembly | Sakshi
Sakshi News home page

ప్రభుత్వాలకు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎటిఎంలు: అక్బరుద్దీన్ ఓవైసీ

Aug 31 2025 11:22 PM | Updated on Aug 31 2025 11:26 PM

Akbaruddin Owaisi Fires About Irrigation Projects in Assembly

హైదరాబాద్‌: ప్రభుత్వాలకు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎటిఎంలుగా మారాయని అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఓవైసీ ఫైర్‌ అయ్యారు. ప్రాజెక్టులు మారవు కేవలం పాస్ వర్డ్‌లు మారుతాయి. వైఎస్సార్ మరణం తో  జలయజ్ఞం నిర్వీర్యం అయింది. చాలా ప్రాజెక్టులు పెడింగ్‌లో పడ్డాయి.ఉమ్మడి శాసనసభలో ఇరిగేషన్ పై ఆనాడు గంటల పాటు డిబేట్ జరిగేవి. కాళేశ్వరం నుండి చుక్క నీరు తీసుకోలేదు అని మంత్రి ఉత్తమ్ అన్నారు. మెడిగడ్డ అక్కడ కట్టారు... ఇక్కడ నుండి మార్చారు అని సుదీర్ఘంగా చర్చ జరిగింది.

కాళేశ్వరం మరమ్మతులు చేస్తారా ఆపేస్తారా క్లారిటీ ఇవ్వండి. వాళ్ళు ఇంత తిన్నారు అంత తిన్నారు నేను వాటి జోలికి పోను. కాలేశ్వరంలోని నీటిని ఏం చేయాలనుకుంటున్నారు. క్యాబినెట్ అప్రూవల్ తోనే సభలో కమిషన్ రిపోర్ట్ టేబుల్ చేశామని ప్రభుత్వం చెప్తుంది..

మరి అంతకంటే ముందే కమిషన్ రిపోర్ట్  వివరాలు మీడియాలో ఎలా బహిర్గతం అయ్యాయి. సభలోని సభ్యుల ముందుకు రాకుండానే మీడియాలో రిపోర్టు రావడం  సభ సభ్యులను అగౌరపరచడమే. దేశంలో అన్ని రాజకీయ పార్టీలకు కాంట్రాక్టు కంపెనీలు ఎలెక్షన్ బాండ్స్ ఇచ్చాయి..

Mim పార్టీ , cpi కి మాత్రమే ఇవ్వలేదు. కాంట్రాక్టర్లు పార్టీకి ఫండింగ్ ఇచ్చే సాంస్కృతి మంచిది కాదు. ఏ పార్టీ అధికారంలో ఉన్న ఆ కాంట్రాక్టు కంపనీ అక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది. మొత్తం ఘోష్ కమిటీ రిపోర్టు లో కాంట్రాక్టు కంపనీ పేర్లు ఎందుకు పేర్కొనలేదు. అన్ని రిపోర్టులు ఉన్నాయి అంటున్నారు మరి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు.

అవినీతి పరులను ఎదో చేసేస్తారు అంటూ ప్రజలు అనుకున్నారు కానీ చేసింది ఏమి లేదు. అవినీతి కాంట్రాక్టు చిన్న పెద్ద అని చూడకుండా ప్రతి ఒక్కరిని శిక్షించండి. పెద్ద కాంట్రాక్టు సంస్థలను ఎందుకు కాపాడుతున్నారు. పెద్ద కాంట్రాక్టు కంపనీలు కాంగ్రెస్ పార్టీకి ఎలెక్షన్ బాండ్స్ ఇచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement