సాక్షి, హైదరాబాద్: గ్లోబల్ సమ్మిట్‌లో పాలసీ డాక్యుమెంట్‌ను ప్రకటిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ రైజింగ్- 2047 పాలసీ డాక్యుమెంట్, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌పై రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. విజన్ డాక్యుమెంట్‌కు తెలంగాణ రైజింగ్ 2047 అని పేరు పెట్టుకున్నామని తెలిపారు.
‘‘విజన్ డాక్యుమెంట్‌లో లక్షలాది మందిని భాగం చేశాం. అభివృద్ధి చెందిన తెలంగాణను అందించాలన్నదే మా లక్ష్యం. ఐఎస్‌బీ, నీతి ఆయోగ్ సంస్థల సలహాలు కూడా తీసకున్నాం. స్ట్రాటజీలో భాగంగా తెలంగాణను మూడు విభాగాలుగా తీసుకున్నామని వివరించారు. కోర్ అర్బన్, రీజియన్ ఎకనామిగా హైదరాబాద్ మాడిఫికేషన్ చేశారు. ఓఆర్‌ఆర్ పరిధిలో మున్సిపల్ కార్పోరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామాలు ఉండడం వల్ల వ్యవస్థల మధ్య సమన్యాయం లోపిస్తుంది. అందుకే కోర్ అర్బన్ రీజియన్ ఒకే గొడుగు కిందకు తీసుకువస్తున్నాం’’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
‘‘కాలుష్య రహితనగరంగా హైదరాబాద్‌ను మారుస్తాం. కాలుష్యం వెదజల్లే పరిశ్రమలను తరలిస్తాం. కోర్ అర్బన్ రీజియన్‌ను తీసుకొస్తున్నాం. వరంగల్, ఆదిలాబాద్, కొత్తగూడెంతో పాటు రామగుండంలో ఎయిర్‌పోర్టులు నిర్మిస్తాం. కోర్, ప్యూర్, రేర్ రీజియన్లుగా తెలంగాణను అభివృద్ధి చేస్తాం. సమగ్రంగా మూడు రీజియన్ల అభివృద్ధి చేపడతాం. సర్వీస్ సెక్టార్‌గా కోర్ అర్బన్ రీజియన్ అభివృద్ధి చేస్తాం. ఓఆర్‌ఆర్, ట్రిపుల్ ఆర్ మధ్య ప్రాంతాన్ని పెరీ అర్బన్ రీజియన్‌గా గుర్తించాం’’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.


