సీతక్కకు ప్రచారం ఎక్కువ..పని తక్కువ: హరీశ్‌రావు | M‍inister harishrao comments at telangana bavan | Sakshi
Sakshi News home page

సీతక్కకు ప్రచారం ఎక్కువ..పని తక్కువ: హరీశ్‌రావు

Nov 12 2023 1:58 PM | Updated on Nov 12 2023 4:26 PM

M‍inister harishrao comments at telangana bavan - Sakshi

సాక్షి,హైదరాబాద్‌ : ములుగు ఎమ్మెల్యే సీతక్క సోషల్ మీడియాలో మాత్రమే ఉంటారని, ఆమెకు పని తక్కువ ప్రచారం ఎక్కువ అని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. తెలంగాణభవన్‌లో ములుగుకు చెందిన బీజేపీ నేత రాములు బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు హరీశ్‌రావు కండువా కప్పి ఆహ్వానించారు.

చేరికల సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ ‘ నిరుపేద అమ్మాయి నాగజ్యోతి. ములుగులో ఈసారి ఆమెను గెలిపించాలని కోరుతున్న. ఓడిపోతున్నానని తెలిసి కోపంతో సీతక్క ఇష్టం వచ్చినట్లు నోరు జారుతోంది. ఆమె ఓటమి ఖాయం.  5 గంటల కరెంట్ ప్రచారంతో అబాసుపాలైంది. ఉచిత కరెంట్‌ను ఉత్త కరెంట్ చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? వ్యవసాయానికి ఎంత హెచ్‌పీ మోటార్ వాడుతారో కూడా తెలియని అజ్ఞాని రేవంత్ రెడ్డి.

కర్ణాటక లో రెండు గంటల కరెంట్ కూడా రావటం లేదని అక్కడి మాజీ సీఎం కుమార స్వామి చెప్తున్నాడు. వంద అబద్ధాలు ఆడైనా సీఎం కుర్చీ దక్కించుకోవాలని చూస్తోంది కాంగ్రెస్. 11సార్లు అవకాశం ఇచ్చినా కనీసం బిందె నీళ్ళు ఇవ్వడం కాంగ్రెస్‌కు చేతకాలేదు. బీఆర్‌ఎస్‌ మూడోసారి గెలిచి హ్యాట్రిక్‌ కొట్టడం పక్కా. కేసీఆర్‌ను కాంగ్రెస్‌ నేతలు ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు. మేం తిట్టలేమా’ అని హరీశ్‌రావు ఫైర్‌ అయ్యారు.  

ఇదీ చదవండి.. నా భర్తపై దాడిని ఖండిస్తున్నా: ఎమ్మెల్యే గువ్వల భార్య

Advertisement
 
Advertisement
Advertisement