Live Updates

బీఆర్‌ఎస్ వాకౌట్.. ముగిసిన బీఏసీ సమావేశం
బీఏసీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్
- స్పీకర్ చాంబరలో హాట్‌హాట్‌గా సాగిన బీఏసీ(Business Advisory Committee) సమావేశం
- బీఏసీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్
- ఎరువుల కొరత, వరదలపై చర్చించాలని పట్టుబట్టిన బీఆర్ఎస్
- ప్రతిపక్షాల డిమాండ్‌కు అంగీకరించని ప్రభుత్వం
- నిరసనగా బీఏసీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్
- బీఏసీ ముగిసిన అనంతరం.. మీడియాతో మంత్రి శ్రీధర్‌బాబు
- సభ ఎన్ని రోజులు జరపాలి అన్న అంశంపై రేపు నిర్ణయం తీసుకుంటాం: శ్రీధర్ బాబు.
- కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పై రేపు సభలో చర్చ ఉంటుంది: శ్రీధర్‌బాబు
- బీసీ రిజర్వేషన్ల బిల్లు ను రేపు సభలో పెడతాం: శ్రీధర్‌బాబు
- పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు బీఆర్‌ఎస్‌కు అనుమతి ఇవ్వాలా? లేదా? అన్నది స్పీకర్ నిర్ణయం
2025-08-30 16:12:20
ముగిసిన తెలంగాణ కేబినెట్ సమావేశం
- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
- రిజర్వేషన్ కోటా పరిమితి ఎత్తివేస్తూ కేబినెట్ నిర్ణయం
- 42 శాతం రిజర్వేషన్లు అమలు కోసం పంచాయతీ రాజ్ చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం
- పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285(A ) కు సవరణ చేయాలని నిర్ణయం
- స్పెషల్ జీవో తెచ్చి రిజర్వేషన్లు అమలు చేయాలని మంత్రి వర్గ నిర్ణయం
- ఈ సమావేశాల్లో పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు తేవాలని నిర్ణయం
- గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, మహ్మద్ అజారుద్దీన్ పేర్లకు ఆమోదం
- సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో పేర్లను మళ్లీ గవర్నర్‌కు పంపిన ప్రభుత్వం
2025-08-30 14:11:43
తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం..
- తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది.
- రిజర్వేషన్ల కటాఫ్‌కు సవరణపై చర్చ.
- డెడికేషన్ కమిటీ నివేదికపై కేబినెట్‌లో చర్చించే అవకాశం
- సభలో చట్ట సవరణ చేయాలని భావిస్తున్న ప్రభుత్వం
2025-08-30 12:43:46
అసెంబ్లీ రేపటికి వాయిదా
- తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా
- రేపు ఉదయం 9 గంటలకు తెలంగాణ శాసనసభ వాయిదా
- రేపు ఆదివారం కాళేశ్వరం ప్రాజెక్టుపై శాసన సభలో చర్చ.
- మరికాసేపట్లో శాసన సభలో BAC సమావేశం
- శాసన సభ ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ అంశాలు చర్చించాలి అనే విషయంపై చర్చ
2025-08-30 11:37:56
కేటీఆర్ కామెంట్స్..

- కేటీఆర్ కామెంట్స్..
- 2014లో టీడీపీ నుంచి గెలిచారు.
- తర్వాత బీఆర్‌ఎస్ నుంచి రెండుసార్లు గెలిచారు.
- ఆయన అనారోగ్యాన్ని ఎవరికీ చెప్పుకోలేదు.
- గోపీనాథ్ కుటుంబానికి మా పార్టీ అండగా ఉంటుంది.
- గోపీనాథ్ సంతాప తీర్మానం సభలో ప్రవేశపెడతాం అని కలలో కూడా అనుకోలేదు.
- గోపీనాథ్ లేకపోవడం పార్టీకి తీరని లోటు.
2025-08-30 11:00:34
శ్రీధర్ బాబు కామెంట్స్..

- శ్రీధర్ బాబు కామెంట్స్..
- గోపీనాథ్ మరణం దిగ్బ్రాంతిని కలిగించింది.
- జూబ్లీహిల్స్ రాష్ట్రంలోనే ప్రధాన నియోజకవర్గం.
- ఆ ప్రాంతం అభివృద్దికి కృషి చేశారు.
- మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్..
- గోపీనాథ్ నాకు పాత స్నేహితుడు.
- గోపీనాథ్ కలగన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గం తయారు చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం.
2025-08-30 11:00:34
కేంద్రంపై కాంగ్రెస్ నేతలు ఫైర్..
- ఆది శ్రీనివాస్ ప్రభుత్వ విప్ కామెంట్స్..
- కేంద్రం వివక్ష చూపుతుంది
- కేంద్రం చెప్పేది ఒకటి చేసేది మరొకటి
- యూరియా ఇచ్చేది మీరు పంచేది మీరు
- యూరియా కొరత రావడం కేంద్రం వైఫల్యం
- తెలంగాణ రైతులు గమనించాలి
- రాష్ట్ర ప్రభుత్వాన్ని తిరిగి కేంద్రం తప్పుపడుతోంది
- గండ్ర సత్యనారాయణ కామెంట్స్..
- యూరియా కొరత రావడానికి కారణం బీజేపీ నేతలే.
- నిజాయితీ ఉంటే యూరియా రాష్ట్రానికి తెప్పించండి.
- ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో యూరియా ఇస్తే సపోర్ట్ చేస్తామని బీఆర్‌ఎస్ మాట్లాడడం విడ్డూరం.
- వరదలకు నష్టపోతే కేంద్రం నుండి నిధులు తేలేకపోతున్నారు బీజేపీ నేతలు.
- నయా పైసా సహాయం చేయలేని బీజేపీ ప్రభుత్వం, తేలేని కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నారు.
- మధుసూదన్ రెడ్డి కామెంట్స్..
- బీజేపీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు.
- కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికపై బీఆర్‌ఎస్ నేతలు యూరియా కొరత చూపిస్తూ సభ పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు.
- యూరియా కొరత రాకుండా చూస్తామని రైతులకు విజ్ఞప్తి.
2025-08-30 10:52:44
శాసనమండలి వాయిదా..

- తెలంగాణ శాసన మండలి సోమవారానికి వాయిదా
- కొనసాగుతున్న శాసన సభ
2025-08-30 10:49:36
హరీష్ రావు కామెంట్స్..

- హరీష్ రావు కామెంట్స్..
- అసెంబ్లీ లాబీలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు చిట్ చాట్
- మేము కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే ఈ ప్రభుత్వానికి భయం ఎందుకు.
- పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అవకాశం ఇవ్వడం లేదంటేనే ఈ ప్రభుత్వం భయపడుతున్నట్లు అర్ధం అవుతుంది.
- వాస్తవాలు ప్రజలకు వివరిస్తాం కదా.
- వాస్తవాలు వినడానికి కాంగ్రెస్ పార్టీ, శ్రీధర్ బాబు గానీ ఇష్టంగా లేరు.
- నిజాలు తేల్చాల్సింది కోర్టులు మాత్రమే.
2025-08-30 10:45:23
మాగంటి గోపీనాథ్ మృతిపై సంతాప తీర్మానం

- మాగంటి గోపీనాథ్ మృతిపై సంతాప తీర్మానం.
- సభలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి.
- దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ సంతాప తీర్మానం.
- మాగంటి గోపీనాథ్ 1963లో జన్మించారు.
- రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు.
- తెలుగు యువత అధ్యక్షుడిగా ఏడేళ్లు సేవలందించారు.
- సీని నిర్మాతగా కూడా ఆయన సినిమా రంగంలో సేవలందించారు.
- గోపీనాథ్ నాకు మంచి మిత్రుడు.
- రాజకీయాల్లో మార్పు వచ్చినా. మిత్రుడిగా మా మధ్య ఎలాంటి మార్పు రాలేదు.
2025-08-30 10:43:23
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

- తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.
- సభను ప్రారంభించిన స్పీకర్ గడ్డం ప్రసాద్
2025-08-30 10:36:04
గన్ పార్క్ వద్ద బీఆర్‌ఎస్ నేతల నివాళులు
- గన్ పార్క్ వద్ద బీఆర్‌ఎస్ నేతల నివాళులు
- గన్ పార్క్ వద్ద అమరులకు హరీష్, కేటీఆర్‌న నివాళులు
- ఖాళీయూరియా బస్తాలతో బీఆర్‌ఎస్ నేతల నిరసనలు
- కాళేశ్వరంతో పాటు అన్ని విషయాలకు సమాధానం ఇస్తాం: కేటీఆర్
- యూరియా కొరత తీర్చడంతో సర్కార్ విఫలం..
2025-08-30 10:34:23
బీఆర్‌ఎస్‌కు భట్టి కౌంటర్..
- బీఆర్‌ఎస్‌కు భట్టి కౌంటర్..
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చిట్ చాట్
- పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మాకు ఇచ్చారా?
- అసెంబ్లీలో ప్రతిపక్షాలకు పీపీటీ ఇచ్చే సాంప్రదాయం లేదు.
- గత సాంప్రదాయాన్నే మేము కొనసాగిస్తాం.
- అప్పులపై బీఆర్‌ఎస్ అసత్య ప్రచారం చేస్తోంది.
- అప్పులపై వడ్డీలు BRS నాయకులు కడుతున్నారా?
- అన్ని విషయాలు అసెంబ్లీలో బయటపెడుతాం
2025-08-30 10:34:23
గన్ పార్క్‌కు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి.
- గన్ పార్క్‌కు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి.
- గన్ పార్క్‌లో అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి..
- మునుగోడు కాంగ్రెస్ కార్యకర్తలతో భారీ ర్యాలీగా వచ్చిన రాజగోపాల్ రెడ్డి.
- త్యాగాల పునాదుల మీద తెలంగాణ ఏర్పడింది.
- అసెంబ్లీ సమావేశాలకు వెళ్తున్నా అంటే.. నాతో పాటే కార్యకర్తలు వస్తా అన్నారు.
- అసెంబ్లీకి వెళ్లే ముందు గన్ పార్క్‌లో నివాళులు అర్పించాలని కార్యకర్తలు కోరారు.
- అమరవీరుల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్రం.
- అమరవీరుల స్థూపం గుడితో సమానం.
2025-08-30 10:34:23
బీఆర్‌ఎస్ మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
- బీఆర్‌ఎస్ మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
- అసెంబ్లీలో కాళేశ్వరంపై బీఆర్ఎస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ గురించి మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
- అసెంబ్లీ లాబీలో మంత్రి శ్రీధర్ బాబు మంత్రి చిట్ చాట్.
- కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో తప్పులు చేసింది వాళ్ళు.
- మళ్ళీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎందుకు?.
- ఏమైనా ఒప్పులు చేస్తే.. అవకాశం ఉండేది.
- సభలో ఎవరికైనా ఆర్డర్ ప్రకారం మాట్లాడటానికి అవకాశం ఇస్తాం..
2025-08-30 10:34:23
యూరియాకు కేంద్రమే కారణం..
- మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్..
- యూరియా కొరతకు కారణం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.
- ఎంపీ రఘునందన్ రావు స్పష్టంగా చెప్పారు
- తెలంగాణలోనే కాదు.. దేశం మొత్తం కూడా ఇదే పరిస్థితి
- ఏ రాష్ట్ర సీఎం కూడా యూరియా కోసం మాట్లాడలేదు.
- మా సీఎం రేవంత్ కేంద్రానికి లేఖ రాశారు.
- కేంద్ర మంత్రులతో మాట్లాడి ఒత్తిడి తెచ్చారు
- మా ఒత్తిడి తోనే.. కేంద్రం నుండి యూరియా కొంత తెగలిగాం.
2025-08-30 10:25:19
రైతులను ఆదుకోవాలి..

- బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి కామెంట్స్..
- భారీ వర్షాలతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి
- రైతులు నష్టపోయారు
- రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం
- సీఎం కనీసం ఒక ప్రకటన చేయలేదు
- అందాల పోటీలు, ఆటల పోటీలపైనే సీఎం కు శ్రద్ధ
- మూసీపై రివ్యూ చేశారు.. భారీ వర్షాలతో దెబ్బతిన్న పంటలపై సమీక్ష చేయలేదు
- ఒక వైపు యూరియా కొరత తీవ్రంగా ఉంది
- రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు
- చర్చలకు భయపడి, సమస్యలకు సమాధానం చెప్పలేక సభను మూడు రోజులకే పరిమితం చేస్తున్నారు
- మాజీ సర్పంచ్‌లకు ఇవ్వాల్సిన బిల్లులు ఇవ్వకుండా కాలక్షేపం చేస్తున్నారు
2025-08-30 10:25:19
అసెంబ్లీకి నిరసనలతో బీఆర్‌ఎస్ నేతలు

- అసెంబ్లీకి బీఆర్‌ఎస్ నేతలు..
- నిరసనలతో అసెంబ్లీకి చేరిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు
- యూరియా కష్టాలపై నిరసన తెలుపుతూ గన్ పార్క్ నుంచి అసెంబ్లీ వరకు నడుచుకుంటూ వచ్చిన ఎమ్మెల్యేలు
- ప్లకార్డుల ప్రదర్శనలతో అసెంబ్లీలోకి వెళ్లిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు
- అసెంబ్లీ లాబీలో యూరియాపై నిరసన తెలియజేస్తున్న ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు
2025-08-30 10:25:19
నేటి నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు

- నేటి నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
- కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై చర్చకు కాంగ్రెస్ వ్యూహం
- జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికతో బీఆర్‌ఎస్‌పై దాడికి సన్నద్ధం
- అసెంబ్లీలో చర్చ ద్వారా విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం
- కమిషన్ విచారణపై పీపీటీకి చాన్స్ ఇవ్వాలంటున్న బీఆర్‌ఎస్
- నివేదికను అడ్డం పెట్టుకొని బురదజల్లే ప్రయత్నమంటూ ఆరోపణ
- సీబీఐ విచారణకు డిమాండ్ చేయనున్న బీజేపీ
- ఈ సమావేశాల్లోనే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక
- నాలుగు రోజులపాటు సమావేశాలు జరిగే అవకాశం
2025-08-30 09:22:49
కేబినెట్‌లో చర్చలు..
- కేబినెట్‌లో చర్చలు..
- శాసనసభ వాయిదా తర్వాత అసెంబ్లీ కమిటీ హాల్‌లో భేటీ కానున్న మంత్రివర్గం.
- స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై జీవోకు ఆమోదం తెలిపే అవకాశం.
- వర్షాలు, వరదల ప్రభావంతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంపైనా కేబినెట్ భేటీ.
- పంటనష్టం సహా రహదారులు, ఇతర నష్టాలను అంచనా వేసి ఆర్థిక సాయం అందించాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం.
2025-08-30 09:22:49
Advertisement