హైదరాబాద్ : తాము తెలంగాణ ప్రజల ఆస్తుల హక్కుల రక్షణే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. గత ప్రభుత్వం తప్పిదాల వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడితే, తాము వాటిని సరి చేసి ప్రజా ఆస్తుల హక్కుల పరిరక్షిస్తున్నామన్నారు. ఈరోజు(శనివారం, సెప్టెంబర్ 12వ తేదీ) తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. కేసీఆర్ తన స్వప్రయోజనాలకే పనిచేశారని విమర్శించారు.
‘గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థ లేకుండా గత ప్రభుత్వం చేసింది. ధరణి పేరుతో వారు ఇష్టం వచ్చినట్లు దోచుకున్నారు. పదేళ్లు అధికారంలో ఉండి 22-A పేరుతో పేదల కడుపు కొట్టారు. ధరణి పోర్టల్ వల్ల బీఆర్‌ఎస్ నేతలకే లాభం చేకూరింది.
ధరణి వల్ల ప్రతి జిల్లాలోనూ రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మా ప్రభుత్వం వచ్చే నాటికి ధరణిలో 2.4 లక్షల సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. ధరణిలో ఉన్న సమస్యలను చెప్పినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ధరణి వచ్చిన తర్వాత మూడు నెలలు రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. ధరణి కాంట్రాక్ట్‌లను వారి తొత్తులకే కట్టబెట్టారు. అనేక మంది రైతులు ధరణి వల్ల నష్టపోయారు’ అని ఆరోపించారు.
ఇక తమ ప్రభుత్వం వచ్చాక తెచ్చిన భూభారతి పోర్టల్ గురించి అనేక మందితో చర్చించిన తర్వాతే ముందుకెళ్లామన్నారు. మూడు నెలల్లోనే భూభారతి చట్టానికి విధివిధినాలను రూపొందించామన్నారు. కేంద్రం తీసుకొచ్చిన చట్టంతోనే భూభారత చట్టం పనిచేస్తుందన్నారు.
ఇదీ చదవండి: సీఎంగా తలసాని.. ఉత్తమ్‌గా పల్లా.. మాక్ అసెంబ్లీలో నవ్వులే నవ్వులు!


