హైదరాబాద్: స్నాప్‌చాట్‌లో పరిచయం ప్రేమగా మారింది. ఏకాంతంగా నాలుగేళ్లుగా ప్రైవేట్ హోటల్స్‌లో గడిపారు. పెళ్లి చేసుకోవాలని యువతి ఒత్తిడి తేవడంతో అతను ముఖం చాటేశాడు. ఈ ఘటన నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ సైదులు వివరాల ప్రకారం.. నాగాపూర్‌కు చెందిన యువతి(22) హైదరాబాద్ శాలిబండకు చెందిన యువకుడితో(24) స్నాప్ చాట్ 2022వ సంవత్సరంలో పరిచయమయ్యారు.
పరిచయం ప్రేమగా మారి ఇద్దరూ శారీరకంగా దగ్గరయ్యారు. ప్రేమించిన యువకుడి కోసం నాగాపూర్ నుంచి యువతి అప్పుడప్పుడు హైదరాబాద్ వస్తుండేది. నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ రెసిడెన్షియల్‌లో గదిని అద్దెకు తీసుకొని గడిపేవారు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తేవడంతో యువకుడు ముఖం చాటేశాడు. మరొక అమ్మాయిని ప్రేమించానంటూ బాధిత యువతిని మోసం చేశాడు. దీంతో బాధితురాలు గురువారం నాంపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: చంపి ముక్కలు చేసి.. అడవిలో పడేసి


