
సాక్షి,హైదరాబాద్: పొన్నం ప్రభాకర్‌పై మాజీ మంత్రి గంగుల కమలాకర్ సెటైర్లు వేశారు. పొన్నం ప్రభాకర్ పుష్కరాల మంత్రి అంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై గంగుల చిట్ చాట్ చేశారు.
సభలో ఉత్తం, శ్రీధర్ బాబు, సీతక్క బిల్లులను ప్రవేశపెట్టారు.పొన్నం ప్రభాకర్ సభలో ఉండి బిల్లుల పై మాట్లాడం లేదు. పొన్నంతో సంబంధం ఉన్న బిల్లుల గురించి తప్ప..మిగతా విషయాలు మాట్లాడుతున్నారు. పొన్నం ప్రభాకర్ పుష్కరాల మంత్రి. మళ్ళీ 12ఏండ్ల తర్వాతే పొన్నం గెలిస్తే ..గెలుస్తారు.కరీంనగర్‌లో నేతలతో పొన్నంకు సఖ్యత ఉండదని ఎద్దేవా చేశారు.