కేటీఆర్ పీఏ, పీఆర్వోకు పోలీసుల నోటీసులు | Police Issue Notices to KTR PA and PRO | Sakshi
Sakshi News home page

కేటీఆర్ పీఏ, పీఆర్వోకు పోలీసుల నోటీసులు

Sep 13 2026 8:41 PM | Updated on Sep 13 2026 9:17 PM

Police Issue Notices to KTR PA and PRO

సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పీఏ మహేందర్ రెడ్డి, పీఆర్వో మహేష్‌కు సైఫాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. రేపు ఉదయం 10 గంటలకు సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

ఈ నెల 7న అసెంబ్లీ గేట్ నంబర్ 3 వద్ద చోటుచేసుకున్న ఘటనలకు సంబంధించి మహేందర్ రెడ్డి, మహేష్‌పై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో తమపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా చూడాలని కోరుతూ వారిద్దరూ హైకోర్టును ఆశ్రయించారు.

వారి పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. ఇద్దరికీ మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అలాగే, వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. అదే సమయంలో పోలీసుల విచారణకు సహకరించాలని సూచించింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో మహేందర్ రెడ్డి, మహేష్ రేపు ఉదయం 10 గంటలకు సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు.

ఇదీ చదవండి : కొండా సురేఖ బర్తరఫ్‌పై కేటీఆర్‌ రియాక్షన్‌ ఇదే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement