- ప్రజలకు జాతీయ హిందీ దినోత్సవ శుభాకాంక్షలు
- తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా
హైదరాబాద్: భారతదేశ భిన్నత్వంలో ఏకత్వానికి భారతీయ భాషలు ప్రతిబింబాలని, అవి దేశ సమున్నత సాంస్కృతిక వారసత్వానికి అమూల్యమైన ప్రతీకలని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. ఈ నెల 14 వ తేదీన జాతీయ హిందీ దినోత్సవం సందర్భంగా ప్రజలకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు తెలిపారు.
హిందీతో పాటు భారతీయ భాషల పరిరక్షణ, ప్రోత్సాహం ద్వారా మన సాంస్కృతిక వారసత్వాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. భాషలు ప్రజలను అనుసంధానిస్తూ పరస్పర అవగాహన, సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తాయని, భాషా వైవిధ్యాన్ని గౌరవించడం ద్వారా జాతీయ సమైక్యత మరింత బలోపేతం అవుతుందని గవర్నర్ ఆకాంక్షించారు.
ఇదీ చదవండి: తెలంగాణ ప్రజలకు గవర్నర్ వినాయక చవితి శుభాకాంక్షలు


