సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల వేళ ప్రతిపక్షంపై పోలీసులు దౌర్జన్యకాండకు దిగారు. సోమవారం ఉదయం నల్ల టీషర్లుతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా గేటు వద్దే అడ్డుకున్నారు. ఆ దుస్తులతో అనుమతించబోమని చెప్పారు. అయితే తమను లోపలికి అనుమతించాలని బీఆర్‌ఎస్ నేతలు పట్టుబట్టడంతో మెయిన్‌గేట్ వద్ద హైడ్రామా నడిచింది.
తెలంగాణ అసెంబ్లీ బయట బీఆర్‌ఎస్ నేతలు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో నేల మీద పడుకుని పలువురు నేతలు నిరసన తెలిపారు. తన టీ షర్ట్ తీసేసి.. ఇప్పుడైనా అనుమతించాలని హరీశ్‌రావు కోరారు. అయినా పోలీసులు అనుమతించలేదు. ఈ క్రమంలో వాగ్వాదం కాస్త.. తోపులాటగా మారింది. పోలీసులు నెట్టేయడంతో పలువురు బీఆర్‌ఎస్ నేతలు కిందపడిపోయారు.
కేటీఆర్, హరీష్ రావులను అసెంబ్లీ వద్ద అరెస్ట్ చేసి తెలంగాణ భవన్‌కు తరలించిన పోలీసులు https://t.co/zHd2zxHm06 pic.twitter.com/kCuJ4jsztK
— Telugu Scribe (@TeluguScribe) September 7, 2026
ఈ క్రమంలో సీనియర్ నేత సబితా ఇంద్రారెడ్డిని పోలీసులు మెడ బట్టి నెట్టేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి గాయాలయ్యాయి. కేటీఆర్ ముఖం, చేతులకు దెబ్బలు తగిలాయి. తన చీర లాగారంటూ సునీతా లక్ష్మారెడ్డి కంటతడి పెట్టగా.. సబిత ఓదార్చారు. ఆపై హరీష్‌రావు, కేటీఆర్ సహా పలువురు నేతల్ని బలవంతంగా అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. ఈ పరిణామాలతో అసెంబ్లీ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
అసెంబ్లీ ముందు కంటతడి పెట్టుకున్న మహిళా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
నలుపు రంగు చీర ధరించి అసెంబ్లీకి వెళ్తున్న సునీతా లక్ష్మారెడ్డి చీర లాగి అవమానించిన పోలీసులు
కౌరవ సభలా మారిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు https://t.co/0Nua3mziEr pic.twitter.com/Ada7X5MXwj— Telugu Scribe (@TeluguScribe) September 7, 2026
అసెంబ్లీ వద్ద తమకు అవమానం జరిగిందని.. పోలీసులు తమతో ప్రవర్తించిన తీరుకు పోలీసులు క్షమాపణలు చెప్పాల్సిందేనని బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.
స్పీకర్ చెబితేనే: డీసీపీ శిల్పవల్లి
అసెంబ్లీ గేటు వద్ద పరిణామాలపై స్థానిక డీసీపీ శిల్పవల్లి స్పందించారు. నల్ల దుస్తులతో లోపలికి అనుమతించొద్దని స్పీకర్ ఆదేశించారని.. అందుకే అడ్డుకున్నామని చెప్పారు. బీఆర్‌ఎస్ నేతల ఆరోపణల్లో నిజం లేదని.. తామేం అమర్యాదగా నడుచుకోలేదన్నారు. అలాగే.. వద్దని చెబుతున్నా బలవంతంగా నిరసనలకు దిగడంతోనే అదుపులోకి తీసుకున్నామని వివరించారు.
ఇదీ చదవండి: ఆఖరి నిమిషంలో ట్విస్ట్ ఇచ్చిన రేవంత్‌రెడ్డి



