Telangana Assembly Monsoon Session August 4 2023 Live Updates - Sakshi
Sakshi News home page

తెలంగాణలో కులగజ్జి, మతపిచ్చి లేదు: అసెంబ్లీలో కేటీఆర్‌

Published Fri, Aug 4 2023 10:34 AM

Telangana Assembly Monsoon Session August 4th Live Updates - Sakshi

►శాసన మండలి రేపటికి వాయిదా

►తెలంగాణలో కులగజ్జి, మత పిచ్చి లేదని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. కేసీఆర్‌ నాయకత్వంలో స్టేబుల్‌ గవర్నమెంట్‌ ఉందన్నారు. బెంగుళూరును వెనక్కి నెట్టి ఐటీ ఉద్యోగాల కల్పనలో తెలంగాణ నెంబర్‌ వన్‌ అయిందని పేర్కొన్నారు. ఐటీ అభివృద్ధిని ప్రతిపక్షాలు మెచ్చుకోవాలని చెప్పారు.

►1987లో  ఇంటర్‌  గ్రాఫ్‌ అనే సంస్థ హైదరాబాద్‌కు వచ్చిందని, ఈ విషయం మేమే ఐటీ తెచ్చామనే వారు తెలుసుకోవాలని మంత్రి కేటీఆర్‌ హితవు పలికారు. రజనీకాంత్‌ లాంటి వ్యక్తి కూడా హైదరాబాద్‌ గురించి చెప్పారని కానీ కొంతమంది ఇంకా కళ్లు తెరవడం లేదని విమర్శించారు.  ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ విస్తరిస్తున్నామని తెలిపారు. జిల్లాలకు విస్తరించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. హుజురాబాద్‌లో ఐటీ కంపెనీ వచ్చిందని ఈటలకు కూడా తెలవాలన్నారు.

►కోకాపేట భూముల వేలంపై అసెంబ్లీలో కేటీఆర్‌ మాట్లాడారు.  కోకాపేట భూముల ధర రికార్డు బద్దల కొట్టిందని చెప్పారు. ఎకరం వంద కోట్లు పలికిందంటే హైదరాబాద్‌ అభివృద్ధి అర్థం చేసుకోవచ్చని తెలిపారు. డైలాగులు, ధర్నాలతో ఇంత ధర రాదన్నారు.

సాక్షి, హైదరాబాద్‌: శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభల్లోనూ మొదట ప్రశ్నోత్తరాలలకు సమయం కేటాయించారు. అనంతరం రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలు, స్వల్పకాలిక చర్చ జరిగింది. అదే సమయంలో మండలిలో విద్య, వైద్యంపై చర్చ నిర్వహించారు.

తెలంగాణలో వరదల తర్వాత జరిగిన పునరావాస సహాయక చర్యలు, ప్రజలకు ఇచ్చిన సహాయక హామీల చర్యలపై  అసెంబ్లీలో బీజేపీ  వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. నేడు శాసనసభ ముందుకు 10 కీలక బిల్లులు రానున్నాయి. శని, ఆదివారాల్లో బిల్లులపై చర్చించి ఆమెదించనున్నారు. ఆదివారంతో అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి.

Advertisement
 
Advertisement