గ్రీన్‌ఫీల్డ్‌ హైవేపై మళ్లీ ప్రమాదాలు! | Accidents again on Greenfield Highway | Sakshi
Sakshi News home page

గ్రీన్‌ఫీల్డ్‌ హైవేపై మళ్లీ ప్రమాదాలు!

Sep 13 2026 1:20 AM | Updated on Sep 13 2026 1:20 AM

Accidents again on Greenfield Highway

వేర్వేరు ఘటనల్లో ముగ్గురి మృతి 

ఎండపల్లి వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ట్రావెల్‌ బస్సు 

బస్సు క్లీనర్‌ మృతి..మరో 15మందికి తీవ్రగాయాలు 

సత్తుపల్లి, చింతలపూడి ఆస్పత్రుల్లో క్షతగాత్రులకు చికిత్స 

ముత్తగూడెం సమీపంలో డివైడర్‌ను ఢీకొట్టి కారు బోల్తా 

ఇద్దరి మృతి, మరో ముగ్గురి పరిస్థితి విషమం..

ఖమ్మం–దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్‌ హైవేపై జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మరణిచారు. ఓ ప్రైవేటు ట్రావెల్‌ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఘటనలో క్లీనర్‌ మరణించగా.. అతి వేగంగా వెళ్తూ డివైడర్‌ను ఢీకొని కారు బోల్తాపడిన ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. ఇటీవల ఈ హైవేపై తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే.  

సత్తుపల్లిటౌన్‌: ‘అంతా నిద్రలో ఉన్నాం..అంతలోనే పెద్ద శబ్దం వచ్చింది..లేచి చూసేసరికి చాలామంది చిందరవందరగా పడిపోగా.. నొప్పులు భరించలేక మరికొందరు ఆర్తనాదాలు చేస్తున్నారు’అంటూ ఏపీ–తెలంగాణ సరిహద్దున శనివారం తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాదంలో గాయపడిన పలువురు వెల్లడించారు. హైదరాబా ద్‌ నుంచి విశాఖపటా్ననికి 57 మంది ప్రయాణికులతో ఓ ప్రైవేట్‌ ట్రావెల్‌ స్లీపర్‌ కోచ్‌ బస్సు శుక్రవారం రాత్రి బయలుదేరింది. ఖమ్మం–దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్‌ హైవేపై బస్సు వేగంగా వెళ్తుండగా ఏపీలోని చింతలపూడి మండలం ఎండపల్లి వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఘటనలో బస్సు నుజ్జునుజ్జయి క్లీనర్‌ మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. 

ఖమ్మం జిల్లా సత్తుపల్లికి సమీపాన తెలంగాణ–ఏపీ సరిహద్దులో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను సత్తుపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి నేషనల్‌ హైవే అంబులెన్స్‌లో తరలించారు. ఇందులో పి.సురేష్, ఆనంద్‌ పటేల్, కె.సాహితి(విజయనగరం), బస్సు డ్రైవర్‌ బండి గోపి(పెద్దిపాలెం)తో పాటు చక్రధర సాహో(గోపీనాథ్‌పూర్‌), దుర్గేష్‌ రావత్‌(ఉత్తరాఖండ్‌), ట్రావెల్‌ బస్సు మరో డ్రైవర్‌ సాయిఉజ్‌(కేరళ), డేర్లిన్‌ అబ్రహం(తమిళనాడు) తీవ్రంగా గాయపడి చికి త్స పొందుతున్నారు. కాగా, ఘటనలో క్లీన ర్‌ మృతి చెందగా మరో ఏడుగురిని చింతల పూడి ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. 

పెనుబల్లి: బంగారం కొనుగోలు చేసేందుకు బస్సులో వెళ్లారు.. తిరిగి బయలుదేరే సమయానికి చీకటి పడడం, వెంట బంగారం ఉండడంతో జాగ్రత్తగా వెళ్లొచ్చని అద్దెకు కారు మాట్లాడుకున్నారు. కానీ ఆ కారే ఇద్దరి ప్రాణాలు బలి తీసుకుంటుందని ఊహించలేకపోయారు. ఖమ్మం–దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్‌ హైవేపై శనివారం రాత్రి ప్రమాదం వివరాలిలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారానికి చెందిన సీతామహాలక్ష్మి, ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లికి చెందిన ఉషారాణి అక్కాచెల్లెళ్లు. వీరిద్దరూ కిష్టారానికి చెందిన పుచ్చకాయల శేషు, గోలి రాజేశ్వరితో కలిసి బస్సులో శనివారం ఉదయం ఖమ్మం వెళ్లి బంగారం కొనుగోలు చేశారు. 

షాపింగ్‌ పూర్తయ్యే సరికి చీకటి పడడం, తమ వద్ద బంగారం ఉండడంతో ఖమ్మం నుంచి నాగారపు నాగేశ్వరరావు(45) కారు అద్దెకు మాట్లాడుకుని సత్తుపల్లి మండలం కిష్టారానికి గ్రీన్‌ఫీల్డ్‌ హైవే మీదుగా వెళ్తున్నారు. ఈక్రమాన పెనుబల్లి మండలం ముత్తగూడెం సమీపాన కారు అతివేగంతో వెళ్తూ డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ఘటనలో డ్రైవర్‌ నాగేశ్వరరావుతో పాటు ఎర్రగుంటపల్లికి చెందిన కొల్లి ఉషారాణి(54) అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో రాజేశ్వరి, సీతామహాలక్ష్మి, శేషుకు తీవ్రగాయాలు కావడంతో పెనుబల్లి ఆస్పత్రిలో చికిత్స అనంతరం ఖమ్మం తరలిలించారు. వీరి పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. 

ఘటనాస్థలాన్ని సీఐ ముత్తులింగయ్య, ఎస్‌ఐ షాకీర్‌ చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాగా, మృతుల కుటుంబంలోని ఒకరు ఇటీవల మృతి చెందగా ఆమెకు సంబంధించిన పాత బంగారం ఇచ్చి కొత్త బంగారం తీసుకునేందుకు వెళ్లివస్తున్నట్లు తెలియగా.. కుటుంబంలో శుభకార్యం నిమిత్తం బంగారం కొనుగోలు వెళ్లి వస్తున్నారని మరికొందరు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement