నా ఖాతాలు బ్లాక్‌ చేయడం కాంగ్రెస్‌ కుట్ర: వర్షిత్‌ | Nalgonda BJP Varshit Reddy Social Media Accounts Blocked | Sakshi
Sakshi News home page

నా ఖాతాలు బ్లాక్‌ చేయడం కాంగ్రెస్‌ కుట్ర: వర్షిత్‌

Sep 12 2026 11:42 PM | Updated on Sep 12 2026 11:52 PM

Nalgonda BJP Varshit Reddy Social Media Accounts Blocked

నల్లగొండ: బీజేపీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌ రెడ్డి సోషల్‌ మీడియా ఖాతాలు బ్లాక్‌ అయ్యాయి. ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు ఇతర సోషల్‌ మీడియా ఖాతాలు కూడా బ్లాక్‌ అయినట్లు ఆయన తెలిపారు.

ఇటీవల నల్లగొండలో మంత్రి కొమటిరెడ్డి వెంకట్‌రెడ్డి క్యాంపు కార్యాలయంపై దాడి ఘటన అనంతరం చోటుచేసుకున్న పరిణామాలపై వర్షిత్‌ రెడ్డి సోషల్‌ మీడియాలో వరుసగా వీడియోలు పోస్టు చేశారు. ఈ వీడియోలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

దీంతో తన సోషల్‌ మీడియా ఖాతాలు బ్లాక్‌ అయ్యాయని వర్షిత్‌ రెడ్డి పేర్కొన్నారు. తన తల్లిపై దాడి జరిగిన నేపథ్యంలోనే ఆ ఘటనకు సంబంధించిన వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేసినట్లు ఆయన తెలిపారు.

తన సోషల్‌ మీడియా ఖాతాలను బ్లాక్‌ చేయడం వెనుక కాంగ్రెస్‌ కుట్ర ఉందని వర్షిత్‌ రెడ్డి ఆరోపించారు. అయితే, ఖాతాలు బ్లాక్‌ కావడానికి గల కారణాలపై సంబంధిత సోషల్‌ మీడియా సంస్థల నుంచి అధికారికంగా ఎలాంటి వివరాలు ఇంకా తెలియరాలేదు.

ఇదీ చదవండి: 56% బీసీలు.. రాజకీయ రంగంలో వాటా ఎక్కడ?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement