ర్యాలీ బాటలో దలాల్ స్ట్రీట్ | Sensex Jumps 332 Pts Nifty Above 23200 what Factors Driving Market Rally | Sakshi
Sakshi News home page

ర్యాలీ బాటలో దలాల్ స్ట్రీట్

Sep 16 2026 4:42 PM | Updated on Sep 16 2026 5:25 PM

Sensex Jumps 332 Pts Nifty Above 23200 what Factors Driving Market Rally

భారతీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం లాభాలతో ముగిశాయి. రోజంతా హెచ్చుతగ్గుల నడుమ సాగిన ట్రేడింగ్‌లో చివరికి నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ 99 పాయింట్లు పుంజుకుని 23,217 పాయింట్ల వద్ద స్థిరపడగా, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్‌ 332 పాయింట్లు పెరిగి 74,336 పాయింట్ల మార్కును చేరుకుంది.

ఆసియా, యూరప్‌ మార్కెట్లు స్థిరంగా సాగడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ రాబోయే సమావేశంలో వడ్డీ రేట్ల సవరణపై సరళతర వైఖరిని అవలంబించవచ్చనే అంచనాలు దేశీయ మార్కెట్లలో సెంటిమెంట్‌ను బలపరిచాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడాయిల్ ధరలు పెరిగాయి. ఇదికాస్త మార్కెట్‌కు నెగెటివ్‌ అంశామే అయినా, ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. నేటి ట్రేడింగ్‌లో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు కూడా ప్రధాన సూచీలతో పాటు లాభాల బాట పట్టాయి. ఆటో, మెటల్, ఫార్మా రంగాలు లాభాల్లో దూసుకెళ్లగా, మీడియా, రియాల్టీ రంగాల షేర్లు స్వల్ప ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.

సూచీలు తాత్కాలికంగా లాభపడినప్పటికీ అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల ద్రవ్యపతనం వంటి ఆర్థిక మార్పుల దృష్ట్యా ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. స్వల్పకాలిక లాభాల కంటే నాణ్యమైన ఫండమెంటల్స్ ఉన్న షేర్లలో దీర్ఘకాలిక వ్యూహంతో పెట్టుబడులు పెట్టడమే సురక్షితమైన మార్గమని చెబుతున్నారు.

ఇదీ చదవండి: ఈపీఎఫ్‌ సీలింగ్ పెంపు.. జీతంపై ప్రభావం ఎంత?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement