breaking news
Sensex Jumps
-
ర్యాలీ బాటలో దలాల్ స్ట్రీట్
భారతీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాలతో ముగిశాయి. రోజంతా హెచ్చుతగ్గుల నడుమ సాగిన ట్రేడింగ్‌లో చివరికి నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ 99 పాయింట్లు పుంజుకుని 23,217 పాయింట్ల వద్ద స్థిరపడగా, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 332 పాయింట్లు పెరిగి 74,336 పాయింట్ల మార్కును చేరుకుంది.ఆసియా, యూరప్ మార్కెట్లు స్థిరంగా సాగడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ రాబోయే సమావేశంలో వడ్డీ రేట్ల సవరణపై సరళతర వైఖరిని అవలంబించవచ్చనే అంచనాలు దేశీయ మార్కెట్లలో సెంటిమెంట్‌ను బలపరిచాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ ధరలు పెరిగాయి. ఇదికాస్త మార్కెట్‌కు నెగెటివ్ అంశామే అయినా, ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. నేటి ట్రేడింగ్‌లో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు కూడా ప్రధాన సూచీలతో పాటు లాభాల బాట పట్టాయి. ఆటో, మెటల్, ఫార్మా రంగాలు లాభాల్లో దూసుకెళ్లగా, మీడియా, రియాల్టీ రంగాల షేర్లు స్వల్ప ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.సూచీలు తాత్కాలికంగా లాభపడినప్పటికీ అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల ద్రవ్యపతనం వంటి ఆర్థిక మార్పుల దృష్ట్యా ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. స్వల్పకాలిక లాభాల కంటే నాణ్యమైన ఫండమెంటల్స్ ఉన్న షేర్లలో దీర్ఘకాలిక వ్యూహంతో పెట్టుబడులు పెట్టడమే సురక్షితమైన మార్గమని చెబుతున్నారు.ఇదీ చదవండి: ఈపీఎఫ్ సీలింగ్ పెంపు.. జీతంపై ప్రభావం ఎంత? -
రెండు నెలల గరిష్టానికి నిఫ్టీ
ముంబై: అమెరికాతో వాణిజ్య చర్చలు సఫలం కావొచ్చనే ఆశలు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలతో స్టాక్ సూచీలు మంగళవారం అరశాతానికి పైగా లాభపడ్డాయి. డాలర్ మారకంలో రూపాయి బలోపేతం, అధిక వెయిటేజీ షేర్ల ర్యాలీ సెంటిమెంట్‌ను మరింత బలపరిచాయి. ఫలితంగా సెన్సెక్స్ 595 పాయింట్లు పెరిగి 82,381 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 170 పాయింట్లు బలపడి 25,239 వద్ద నిలిచింది. ముగింపు స్థాయి సూచీలకి రెండు నెలల గరిష్టం. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం స్వల్ప లాభాలతో మొదలయ్యాయి.ఎఫ్ఎంసీజీ మినహా అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ముఖ్యంగా జీఎస్టీ సంస్కరణలు, పండుగ డిమాండ్ రికవరీపై ఆశలతో ఆటో షేర్లు దూసుకెళ్లాయి. అమెరికాతో వాణిజ్య చర్చలు సఫలమవ్వొచ్చనే ఆశలతో ఐటీ షేర్లు రాణించాయి. ఒక దశలో సెన్సెక్స్ 658 పాయింట్లు బలపడి 82,443 వద్ద, నిఫ్టీ 192 పాయింట్లు ఎగసి 25,261 వద్ద ఇంట్రాడే గరిష్టాలు అందుకున్నాయి. ఆసియాలో సింగపూర్, హాంగ్‌కాంగ్ మినహా అన్ని దేశాల మార్కెట్లు 1% పెరిగాయి. యూరప్ మార్కెట్లు అరశాతం నష్టపోయాయి. అమెరికా స్టాక్ సూచీలు స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి.⇒ అధిక వెయిటేజీ ఎల్అండ్టీ(2%), కోటక్ మహీంద్రా(2.50%), మహీంద్రా (2.2%), మారుతీ (2%), టీసీఎస్ (1%) రాణించి సూచీలకు దన్నుగా నిలిచాయి. సెన్సెక్స్ ఆర్జించిన మొత్తం పాయింట్లలో ఈ షేర్ల వాటాయే 352 పాయింట్లు కావడ విశేషం. -
భారీ లాభాల్లో దూసుకొచ్చిన మార్కెట్లు
ముంబై : అంతర్జాతీయంగా వస్తున్న పాజిటివ్ సంకేతాలతో శుక్రవారం ట్రేడింగ్‌లో స్టాక్‌మార్కెట్లు భారీ లాభాల్లో దూసుకొచ్చాయి. సెన్సెక్స్ ఏకంగా 250 పాయింట్లకు పైగా జంప్ అయి, 290 పాయింట్ల లాభంతో 28,703గా ర్యాలీ కొనసాగిస్తోంది. నిఫ్టీ సైతం 81.95 పాయింట్ల ర్యాలీతో తన కీలకమార్కు 8,800ను అధిగమించి 8,824 వద్ద ట్రేడ్ అవుతోంది. అమెరికా రిటైల్ విక్రయాలు ఆగస్టు నెలలో 0.3 శాతం క్షీణించడంతో ఫెడ్ రేట్ల పెంపు భయాలు వైదొలగాయి. దీంతో ఇన్వెస్టర్లలో ఫెడ్ భయాందోళనలు తొలగి పెట్టుబడులకు మొగ్గుచూపుతున్నారని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అదేవిధంగా బ్యాంకింగ్, ఆటో స్టాక్స్‌లో కొనుగోల ర్యాలీ కొనసాగుతుండటంతో మార్కెట్లు లాభాల పంట పండిస్తున్నాయి. బ్యాంకింగ్, ఆటో షేర్ల ఎన్ఎస్ఈ సబ్ సూచీలు 1.06శాతం, 1.11 శాతం ఎగిసి, మార్కెట్లో ర్యాలీ కొనసాగిస్తున్నాయి. నిఫ్టీ స్టాక్స్‌లో హీరో మోటాకార్పొ 2.5 శాతం లాభంతో టాప్ గెయినర్‌గా ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా బ్యాంకు ఆఫ్ బరోడా, యాక్సిస్ బ్యాంకు, బజాజ్ ఆటో, అంబుజా సిమెంట్స్ లాభాలను పండిస్తున్నాయి. రెండు రోజుల ర్యాలీ అనంతరం ఏషియన్ పేయింట్స్ 0.31 శాతం నష్టాలను గడిస్తూ నిఫ్టీలో టాప్ లూజర్‌గా కొనసాగుతోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీలు నిఫ్టీలో నష్టాలను చవిచూస్తున్నాయి. అటు డాలర్‌తో రూపాయి విలువ కూడా బలపడింది. గురువారం ముగింపు 67.02కు 16 పాయింట్ల లాభంతో 66.86గా ప్రారంభమైంది. మరోవైపు ఫెడరల్ రిజర్వు, బ్యాంకు ఆఫ్ జపాన్ సమావేశ నేపథ్యంలో ఆసియన్ మార్కెట్లు మిక్స్‌డ్‌గా ట్రేడ్ అవుతున్నాయి. వచ్చే వారంలో ఫెడ్ రేట్ల పెంపుకు అవకాశముంటుందనే అంచనాలకు నిన్న వెలువడిన ఎకనామిక్ డేటా విఘాతం కలిగిస్తుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో రేట్ల పెంపు భయాందోళనలు కొంతమేర వీడాయి.


