ముంబై : అంతర్జాతీయంగా వస్తున్న పాజిటివ్ సంకేతాలతో శుక్రవారం ట్రేడింగ్లో స్టాక్మార్కెట్లు భారీ లాభాల్లో దూసుకొచ్చాయి.
భారీ లాభాల్లో దూసుకొచ్చిన మార్కెట్లు
Sep 16 2016 10:06 AM | Updated on Mar 9 2019 4:28 PM
ముంబై : అంతర్జాతీయంగా వస్తున్న పాజిటివ్ సంకేతాలతో శుక్రవారం ట్రేడింగ్లో స్టాక్మార్కెట్లు భారీ లాభాల్లో దూసుకొచ్చాయి. సెన్సెక్స్ ఏకంగా 250 పాయింట్లకు పైగా జంప్ అయి, 290 పాయింట్ల లాభంతో 28,703గా ర్యాలీ కొనసాగిస్తోంది. నిఫ్టీ సైతం 81.95 పాయింట్ల ర్యాలీతో తన కీలకమార్కు 8,800ను అధిగమించి 8,824 వద్ద ట్రేడ్ అవుతోంది. అమెరికా రిటైల్ విక్రయాలు ఆగస్టు నెలలో 0.3 శాతం క్షీణించడంతో ఫెడ్ రేట్ల పెంపు భయాలు వైదొలగాయి. దీంతో ఇన్వెస్టర్లలో ఫెడ్ భయాందోళనలు తొలగి పెట్టుబడులకు మొగ్గుచూపుతున్నారని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
అదేవిధంగా బ్యాంకింగ్, ఆటో స్టాక్స్లో కొనుగోల ర్యాలీ కొనసాగుతుండటంతో మార్కెట్లు లాభాల పంట పండిస్తున్నాయి. బ్యాంకింగ్, ఆటో షేర్ల ఎన్ఎస్ఈ సబ్ సూచీలు 1.06శాతం, 1.11 శాతం ఎగిసి, మార్కెట్లో ర్యాలీ కొనసాగిస్తున్నాయి. నిఫ్టీ స్టాక్స్లో హీరో మోటాకార్పొ 2.5 శాతం లాభంతో టాప్ గెయినర్గా ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా బ్యాంకు ఆఫ్ బరోడా, యాక్సిస్ బ్యాంకు, బజాజ్ ఆటో, అంబుజా సిమెంట్స్ లాభాలను పండిస్తున్నాయి. రెండు రోజుల ర్యాలీ అనంతరం ఏషియన్ పేయింట్స్ 0.31 శాతం నష్టాలను గడిస్తూ నిఫ్టీలో టాప్ లూజర్గా కొనసాగుతోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీలు నిఫ్టీలో నష్టాలను చవిచూస్తున్నాయి.
అటు డాలర్తో రూపాయి విలువ కూడా బలపడింది. గురువారం ముగింపు 67.02కు 16 పాయింట్ల లాభంతో 66.86గా ప్రారంభమైంది. మరోవైపు ఫెడరల్ రిజర్వు, బ్యాంకు ఆఫ్ జపాన్ సమావేశ నేపథ్యంలో ఆసియన్ మార్కెట్లు మిక్స్డ్గా ట్రేడ్ అవుతున్నాయి. వచ్చే వారంలో ఫెడ్ రేట్ల పెంపుకు అవకాశముంటుందనే అంచనాలకు నిన్న వెలువడిన ఎకనామిక్ డేటా విఘాతం కలిగిస్తుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో రేట్ల పెంపు భయాందోళనలు కొంతమేర వీడాయి.
Advertisement
Advertisement