కంటికి తల తీస్తాం.. ట్రంప్‌నకు ఇరాన్‌ వార్నింగ్‌ | iran war live a head for an eye iran mohsen rezaei | Sakshi
Sakshi News home page

కంటికి తల తీస్తాం.. ట్రంప్‌నకు ఇరాన్‌ వార్నింగ్‌

Mar 24 2026 10:56 PM | Updated on Mar 25 2026 12:03 AM

iran war live a head for an eye iran mohsen rezaei

పశ్చిమాసియా యుద్ధంలో చర్చల అంశం నడుస్తున్న వేళ ఇరాన్‌ ట్రంప్‌నకు భారీ వార్నింగ్ ఇచ్చింది. అమెరికాను రక్షించుకోవడానికి ఉన్న చివరి గడువు ముగిసిపోతుందని నూతన సైనిక సలహాదారు మెుహ్సెన్‌ రెజాయీ అన్నారు.   కంటికి బదులు తల తీసుకోవాల్సి వస్తుందని ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు.

ప్రస్తుతం ఇరాన్‌- అమెరికా మధ్య చర్చలు జరగనున్నాయని  దానికి పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహిస్తుందనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ సైనిక సలహాదారు మెుహ్సెన్‌ రెజాయి మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. గడువు సమీపిస్తోంది: అమెరికాను రక్షించుకోవడానికి ఉన్న చివరి గడువు ముగిసిపోతోందని, ఈ ఊబి నుండి బయటపడటానికి ట్రంప్‌కు ఎక్కువ సమయం లేదని రెజాయీ పేర్కొన్నారు.

అక్కడి ప్రభుత్వ ఏజెన్సీకి చెందిన సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన మాట్లాడుతూ  "మీరు మా దేశ మౌలిక సదుపాయాలపై దాడి చేస్తే, మా స్పందన 'కంటికి కన్ను' అన్నట్టుగా ఉండదు. కంటికి తలతీసే విధంగా ఉంటుంది  అమెరికా యుద్ధనౌకలను అరేబియా గల్ఫ్‌లో ముంచివేస్తాం, అమెరికా మెుత్తాన్ని స్తంభింపజేస్తాం " అని  హెచ్చరించారు.

అమెరికాని ఇజ్రాయెల్ కుట్రపన్ని పావులా వాడుకుందని  'గ్రేటర్ ఇజ్రాయెల్' కల కోసం  ట్రంప్‌ను ఈ అక్రమ యుద్ధంలోకి నెట్టిందన్నారు, ప్రస్తుతం ట్రంప్ తన సైనిక కమాండర్లు మరియు ఇజ్రాయెల్ మధ్య అయోమయంలో ఉన్నారని విమర్శించారు. అదేవిధంగా ఇప్పుడున్న యుద్ధం ముగియాలంటే ఇరాన్‌పై ఉన్న అన్ని ఆంక్షలను ఎత్తివేయాలని, యుద్ధం వల్ల జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని, భవిష్యత్తులో ఇరాన్‌పై ఇలాంటి దాడులు జరగవని అంతర్జాతీయ చట్టపరమైన గ్యారెంటీ ఇవ్వాలని ఆయన తేల్చిచెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement