టీఎంసీ గుండాలు పది రోజుల్లో లొంగిపోవాలి.. లేదా: మోదీ వార్నింగ్‌ | Modi warns TMC goons to surrender within 10 days | Sakshi
Sakshi News home page

టీఎంసీ గుండాలు పది రోజుల్లో లొంగిపోవాలి.. లేదా: మోదీ వార్నింగ్‌

Apr 19 2026 5:27 PM | Updated on Apr 19 2026 6:07 PM

Modi warns TMC goons to surrender within 10 days

కోల్‌కతా: బెంగాల్‌ సీఎం ‍మమతా బెనర్జీపై ప్రధాని మోదీ విరుచుకపడ్డారు. బెంగాల్‌లో అశాంతి సృష్టిస్తున్న టీఎంసీ గుండాలను ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ‍ఆదివారం బెంగాల్‌లోని బిష్ణుపూర్‌లో బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. మే నాలుగు తర్వాత అవినీతిపరులు, గుండాలపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. కనుక టీఎంసీ గుండాలు పదిరోజుల్లోపు తమంతట తామే పోలీసుల ఎదుట లొంగిపోవాలని లేకుంటే తీవ్ర పరిణామాలుంటాయన్నారు. 

బిష్ణుపూర్ మాఫియా, టీఎంసీ సిండికేట్‌ ఆటలు ఇకసాగవన్నారు. గత 15 ఏళ్లుగా పశ్చిమబెంగాల్‌లో టీఎంసీ ఏవిధమైన అభివృద్ధి చేసిందో ప్రజలకు తెలియజేయాలన్నారు. టీఎంసీ విధానాలతో బెంగాల్‌ గుర్తింపు ప్రమాదకరంగా మారిందన్నారు. బెంగాల్‌ బ్రాండ్‌ను బీజేపీ కాపాడుతుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.అయితే అంతకుముందు లోక్‌సభలో లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ల బిల్లు వీగిపోవడంపై ప్రధాని మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు చాలా పెద్ద తప్పు చేశాయని పేర్కొన్నారు. 

దీనికి తగిన పర్యవసానాలను విపక్షాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని  దేశ మహిళలకు  ప్రతిపక్షాలు సమాధానం చెప్పుకోవాలన్నారు. ప్రతిపక్ష పార్టీలు దేశ మహిళలను మోసం చేశాయని ఈ సందేశాన్ని దేశంలోని ప్రతి ఒక్కరికీ, ప్రతి గ్రామానికి చేరవేయాలని  బీజేపీ కార్యకర్తలకు ప్రధాని మోదీ సూచించినట్లు తెలుస్తోంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement