యూఏఈ సంచలన కామెంట్స్ | UAE says it will stand by to free the Strait of Hormuz | Sakshi
Sakshi News home page

యూఏఈ సంచలన కామెంట్స్

Apr 14 2026 1:35 PM | Updated on Apr 14 2026 2:15 PM

UAE says it will stand by to free the Strait of Hormuz

యూఏఈ సంచలన వ్యాఖ్యలు చేసింది. హర్ముజ్‌ జలసంధి మీద అధికారం కేవలం ఒక్క ఇరాన్‌కే లేదని తెలిపింది. అది ఏమి టెహ్రాన్ ఆస్తి కాదని తెలిపింది. హర్ముజ్‌ జలసంధిని విముక్తి చేయడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు యుఏఈ మద్దతిస్తుందని ప్రకటించింది.

ప్రస్తుతం పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా హర్మూజ్‌ను బ్లాకేడ్‌ చేయడంతో చమురు సరఫరా పూర్తిగా నిలిచిపోయే అవకాశం ఉంది. దీంతో గల్ఫ్‌ దేశాలు అమెరికాను రిక్వెస్ట్ చేస్తున్నాయి. హర్ముజ్‌ దిగ్భందనం తొలగించాలని సౌదీఅరేబియా అమెరికాను కోరింది.

ఈ నేపథ్యంలో యూఏఈ ఇరాన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. హర్ముజ్‌ జలసంధి కేవలం ఇరాన్‌ సొత్తు కాదని తెలిపింది. హర్మూజ్‌ను విముక్తి చేయడానికి చేస్తున్న ప్రయత్నాలకు గల్ఫ్ దేశాలు అండగా నిలుస్తాయని పేర్కొంది. ఈ అంశమై బహ్రెయిన్‌ రాజుతో యూఏఈ అధ్యక్షుడు సమావేశమైనట్లు తెలుస్తోంది.

దేశ సమస్యలను చర్చలతో పరిష్కరించుకోవాలి గానీ ఇటువంటి దిగ్భందనాలు చేయడటం మంచిది కాదని యూఏఈ పేర్కొంది. ఈ విషయమై ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీతో యూఏఈ సంప్రదింపులు జరిపినట్లు పేర్కొంది. అయితే అమెరికా విపరీత డిమాండ్ల వల్లనే చర్చలు విఫలమయ్యాయని ఆయన యూఏఈతో తెలిపినట్లు సమాచారం.

ప్రస్తుతం అమెరికా సైతం హర్ముజ్‌ను బ్లాకేడ్ ‍చేయడంతో పరిస్థితులు మరింత దిగజారాయి. ఇరాన్‌ పోర్టుల నుండి నౌకలు ఎటు కదలడం లేదు. దీంతో రోజుకు సరాసరిన రూ. 4 వేల కోట్ల రుపాయల నష్టం జరుగుతుందని ట్రేడ్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.  

  
 

Advertisement
 
Advertisement
Advertisement