టెహ్రాన్‌పై అణుదాడి ప్లాన్‌? UNO మాజీ అధికారి సంచలన ఆరోపణ | mohamad safa nuclear attack on iran UN diplomat stunning claim | Sakshi
Sakshi News home page

టెహ్రాన్‌పై అణుదాడి ప్లాన్‌? UNO మాజీ అధికారి సంచలన ఆరోపణ

Mar 30 2026 11:37 PM | Updated on Mar 30 2026 11:40 PM

 mohamad safa nuclear attack on iran UN diplomat stunning claim

ఐక్యరాజ్యసమితికి  చెందిన  సీనియర్ దౌత్యవేత్త, మొహమ్మద్ సఫా తన పదవికి రాజీనామా చేస్తూ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇరాన్‌పై అణు ఆయుధాలను ప్రయోగించేందుకు ఐక్యరాజ్యసమితి ప్రణాళికలు సిద్ధం చేస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

పశ్చిమాసియా యుద్ధం మరింత తీవ్ర స్థాయికి చేరుకుంటుంది. హర్మూజ్ జలసంధి తెరవకుంటే దాడులు తీవ్రతరం చేస్తామని ట్రంప్ హెచ్చరించడం ఇరాన్‌ సైతం దానికి ధీటుగా ప్రతిస్పందించడంతో పరిస్థితులు చేజారిపోయాలే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే యుఎన్‌కు చెందిన సీనియర్ దౌత్యవేత్త మహమ్మద్ సఫా సంచలన వ్యాఖ్యలు చేశారు. టెహ్రాన్‌పై అణుదాడి చేసే ప్రయత్నాలు అంతర్జాతీయ సమాజం చేస్తోందన్నారు.

ఈ మేరకు మహమ్మద్ సఫా  తన రాజీనామా లేఖను X (ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు."ఇక్కడ మీరు చూస్తున్నది టెహ్రాన్ నగర చిత్రం. యుద్ధం కావాలని కోరుకునే వారు, ఎప్పుడూ యుద్ధ భూమిని చూడని వారు దీనిని ఏదో జనాభా లేని ఎడారి అని అనుకుంటున్నారు. కానీ, ఇది దాదాపు ఒక కోటి జనాభా కలిగిన నగరం. ఇలాంటి నగరంపై బాంబులు వేయాలని అనుకోవడం వికృతమైన ఆలోచన. వాషింగ్టన్ లేదా లండన్ వంటి నగరాలపై అణు దాడి జరిగితే ఎంతటి వినాశనం ఉంటుందో, ఇక్కడ కూడా అదే జరుగుతుంది" అని హెచ్చరించారు.

మానవత్వానికి వ్యతిరేకంగా జరగబోయే ఈ "నేరానికి" సాక్షిగా ఉండలేక, తన దౌత్య జీవితాన్ని త్యాగం చేసి ఈ విషయాన్ని బయటపెడుతున్నట్లు  సఫా పేర్కొన్నారు.  టెహ్రాన్ కేవలం ఎడారి కాదని, అక్కడ కోటి మందికి పైగా సామాన్య ప్రజలు, పిల్లలు నివసిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ఐక్యరాజ్యసమితిలోని కొందరు ఉన్నతాధికారులు ఒక శక్తివంతమైన లాబీకి తొత్తులుగా మారారని సఫా ఆరోపించారు. 

అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తున్నా, UN అధికారులు వారిని ప్రశ్నించడం లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా అణు యుద్ధ ముప్పు పొంచి ఉందని, ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన తెలపడం ద్వారా మాత్రమే ఈ వినాశనాన్ని ఆపగలరని ఆయన పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement