తలెగరేస్తే మళ్లీ బాంబులేస్తాం | US President Donald Trump issued a strong warning to Iran | Sakshi
Sakshi News home page

తలెగరేస్తే మళ్లీ బాంబులేస్తాం

Jun 18 2026 4:09 AM | Updated on Jun 18 2026 5:45 AM

US President Donald Trump issued a strong warning to Iran

ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరిక  

ఇరాన్‌తో కుదుర్చుకున్నది కేవలం అవగాహనా ఒప్పందమేనని వెల్లడి  

వాషింగ్టన్‌:  అమెరికా, ఇరాన్‌ మధ్య శాంతి ఒప్పందం కుదిరిందని, ఇక యుద్ధం ఆగిపోతుందని, చమురు, గ్యాస్‌ ధరలు దిగొస్తాయని ఆశపడిన ప్రపంచ దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పెద్ద షాక్‌ ఇచ్చారు. ఇరాన్‌తో కేవలం అవగాహనా ఒప్పందం(ఎంఓయూ) మాత్రమే కుదిరిందని, అది తుది ఒప్పందం కాదని తేలి్చచెప్పారు. ఇరాన్‌ ఇకనుంచి సరిగ్గా ప్రవర్తించకపోతే మళ్లీ బాంబు దాడులు చేస్తామని హెచ్చరించారు. తద్వారా ఇరాన్‌ తమ దారికి రాకపోతే యుద్ధం ఎప్పుడైనా ప్రారంభం కావొచ్చని సంకేతాలిచ్చారు. ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 శిఖరాగ్ర సమావేశంలో ట్రంప్‌ మాట్లాడారు.

ఒప్పందంపై అమెరికా, ఇరాన్‌లు శుక్రవారమే సంతకాలు చేయబోతున్నారు. స్విట్జర్లాండ్‌లో ఈ కార్యక్రమం జరుగనుంది. ఇంతలోనే ఇరాన్‌కు ట్రంప్‌ హెచ్చరికలు జారీ చేయడం చూస్తే ఆ ఒప్పందం అనుకున్నంత దృఢంగా లేదని స్పష్టమవుతోంది. ‘‘ఇరాన్‌తో కుదుర్చుకున్నది తుది ఒప్పందం కాదు. కేవలం ఒక అవగాహన ఒప్పందం మాత్రమే.

ఒకవేళ ఇది నాకు నచ్చకపోయినా లేదా ఇరాన్‌ సరిగ్గా ప్రవర్తించకపోయినా, మేము వెంటనే వారి తలలపైనే బాంబులు కురిపిస్తాం. మళ్లీ కాల్పులు ప్రారంభిస్తాం. ఎందుకంటే గత 47 ఏళ్లుగా వారు(ఇరాన్‌) దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు’’ అని ట్రంప్‌ ఆక్షేపించారు. అవగాహనా ఒప్పందంలో ఏవైనా మార్పులు చేసినా లేదా దానిని పాటించడంలో విఫలమైనా తక్షణమే సైనిక చర్యను ఎదుర్కోవాల్సి వస్తుందని ఇరాన్‌ను హెచ్చరించారు.  

ఇదీ ఒప్పందం ముసాయిదా
వాషింగ్టన్‌: అమెరికా, ఇరాన్‌ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం తాలూకు ముసాయిదా పత్రంలోని 14 అంశాలను అమెరికా ఉన్నతాధికారులు బుధవారం బహిర్గతంచేశారు. ఆ అధికారులు చెప్పిన ఆ అంశాలు.. 

1.    లెబనాన్, ఇరాన్, హార్మూజ్‌ జలసంధి సముద్రజలాలు సహా పశి్చమాసియాలో అన్ని చోట్ల  అమెరికా తన సైనిక, వైమానిక దాడులను తక్షణం నిలిపేస్తుంది 
2. అమెరికా, ఇరాన్‌ను పరస్పరం ఆయా దేశాల సార్వ¿ౌమత్వాలను గౌరవించుకుంటాయి 
3. ఉమ్మడి ఏకాభిప్రాయంతో 60 రోజుల్లోపు చర్చలను ఫలవంతంగా ముగిస్తాయి 

4. అవగాహన ఒప్పందంపై సంతకాలుచేశాక 30 రోజుల్లోపు హార్మూజ్‌ దిగ్బంధనాన్నిఅమెరికా పూర్తిగా ఎత్తేస్తుంది 
5.  సంతకాలు పూర్తయ్యాక 60 రోజులపాటు సుంకాల్లేకుండా హార్మూజ్‌ గుండా నౌకల రాకపో కలకు ఇరాన్‌ సంపూర్ణ సహాయసహకారాలు అందిస్తుంది 
6.  ఇరాన్‌ పునర్‌నిర్మాణం, ఆర్థికాభివృద్ధికి మిత్రదేశాలతో కలిసి అమెరికా 300 బిలియన్‌ డాలర్ల నిధులు సమకూరుస్తుంది 

7.  ఇరాన్‌పై ఐరాస భద్రతా మండలి, అంతర్జాతీయ అణుఇంధన సంస్థ సహా అంతర్జాతీయంగా అమల్లో ఉన్న అన్నిరకాల ఆంక్షలను ఎత్తేసేందుకు అమెరికా కృషిచేస్తుంది 
8. అణ్వ్రస్తాలను ఇరాన్‌ తయారుచేయకూడదు, కొనుగోలుచేయకూడదు. ఇప్పటికే అత్యంత శుద్ధిచేసిన యురేనియం నిరీ్వర్యంపై ఇరాన్, అమెరికా ఉమ్మడిగా నిర్ణయం తీసుకుంటాయి 
9.  అణుకార్యక్రమం ఇప్పుడు ఏ దశలోఉందో అదే యథాతథస్థితి కొనసాగించేందుకు ఇరాన్‌కు హక్కు ఉంటుంది. ఇరాన్‌పై అమెరికా కొత్తగా ఆంక్షలు విధించబోదు, 
   బలగాలను దింపబోదు 

10.  ఇరాన్‌ ముడి చమురు, పెట్రోలియం వస్తూత్పత్తుల ఎగుమతులకు ఊతమిచ్చేలా అమెరికా ఆర్థిక శాఖ సబ్సిడీలు, రాయితీల రూపంలో సాయపడుతుంది. బ్యాంకింగ్, బీమా, రవాణా   పరంగానూ సాయపడనుంది 
11. విదేశీ బ్యాంకుల్లో స్తంభింపజేసిన ఇరాక్‌కు చెందిన ఖాతాల నుంచి పెద్దమొత్తంలో నగదు ఉపసంహరణకు అవకాశం 

12. అవగాహన ఒప్పందం సవ్యంగా, సమర్థవంతంగా అమలయ్యేలా ఒక ప్రత్యేక  కార్యనిర్వాహణ వ్యవస్థను కొలువుతీర్చి దానిని పర్యవేక్షించడం 
13. సంతకాలు చేయగానే 1, 4, 5, 10, 11 పేరాల్లోని అంశాలు తక్షణం అమల్లోకి వస్తాయి. అందుకే మిగతా పేరాల్లోని అంశాల మీదనే చర్చలు జరుగుతాయి. 
14. ఐరాస భద్రతా మండలి నిబంధనలకు లోబడి తుది ఒప్పందం కుదుర్చుకోవాలి  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement