ప్రస్తుతం హర్ముజ్ జలసంధిని అమెరికా బ్లాకేడ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హర్ముజ్ జలసంధిని దాటడానికి ప్రయత్నిస్తున్న ఓ నౌకకు యుఎస్ ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది హెచ్చరించారు. ఇది అమెరికా దిగ్భందనమని వెనక్కి వెళ్లకపోతే తీవ్రపరిణామాలుంటాయన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
హర్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్- అమెరికా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఓవైపేమో అమెరికా హర్ముజ్‌ను బ్లాకేడ్ చేయగా మరోవైపు ఇరాన్ సైతం జలసంధిని మరోసారి మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో జలసంధి గుండా వెళ్లే నౌకలను అడ్డుకుంటుంది. ఈ మేరకు దీనికి సంబంధించిన వీడియోని యుఎస్ సెంట్రల్ కమాండ్ ఎక్స్ వేదికగా షేర్ చేసింది.
యూఎస్ గస్తీ హెలికాప్టర్‌లోని సిబ్బంది ఈ మేరకు హెచ్చరికలు జారీ చేశారు. " ఇది యునైటెడ్ స్టేట్స్ వార్‌షిప్ 115. మీరు యుఎస్ బ్లాకేడ్ చేసిన ప్రాంతంలోకి ప్రవేశిస్తున్నారు. ఈ బ్లాకేడ్ ఇరాన్ పోర్టులకు అన్నిటికీ వర్తిస్తుంది. ఇది షిప్‌పైన ఉన్న అన్ని జెండాలకు వర్తిస్తుంది. అని హెచ్చరించారు..
ఈ దిగ్బంధనం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు సుమారు 27 నౌకలను అమెరికా దళాలు వెనక్కి పంపించాయి. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ప్రతి నౌకను తనిఖీ చేసే అధికారం తమకు ఉందని, నిబంధనలు ఉల్లంఘిస్తే బలప్రయోగం చేస్తామని అమెరికా హెచ్చరించింది.
అయితే ఇటీవల అమెరికా 'టౌస్కా' అనే ఇరాన్ కంటైనర్ నౌకను స్వాధీనం చేసుకుంది. దీనిని ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఇది సముద్రపు దొంగతనమని అమెరికా దళాలు అంతర్జాతీయ నియమాలను ఉల్లంఘించాయని ఆరోపించింది. తమ వాణిజ్య నౌకపై జరిగిన ఈ దాడికి త్వరలోనే ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ సైన్యం హెచ్చరించింది.
కాగా ఇరు దేశాల మధ్య మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా మరో దఫా శాంతిచర్చలకు రావాలని పట్టుబట్టడం ఇరాన్ దానిని తిరస్కరించడంతో మరోసారి ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.
Since the commencement of the blockade against ships entering or exiting Iranian ports and coastal areas, U.S. forces have directed 27 vessels to turn around or return to an Iranian port. pic.twitter.com/G8dl96wN4H
— U.S. Central Command (@CENTCOM) April 20, 2026


