ఫోన్‌ పక్కకి పెడతారా.. లేక గన్‌ తీయమంటారా | Russian foreign minister Sergey Lavrov warns journalist | Sakshi
Sakshi News home page

ఫోన్‌ పక్కకి పెడతారా.. లేక గన్‌ తీయమంటారా

May 16 2026 5:15 PM | Updated on May 16 2026 5:36 PM

Russian foreign minister Sergey Lavrov warns journalist

ఢిల్లీ: భారత్‌ వేదికగా జరుగుతున్న బ్రిక్స్ విదేశాంగ శాఖ మంత్రుల సదస్సు ముగిసింది. అయితే ఇందులో పాల్గొనడానికి వచ్చిన రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌కు ఊహించని ఘటన ఎదురైంది. సదస్సులో పాల్గొన్న అనంతరం సెర్గీ లావ్రోవ్‌ మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతుండగా ఓ జర్నలిస్టు ఫోన్‌లో మాట్లాడుతూ తరచుగా అంతరాయం కలిగించారు. దీంతో ఆగ్రహం చెందిన సెర్గీ లావ్రోవ్‌ మీరు బయిటకి వెళతారా లేక గన్‌ తీయమంటారా అని హెచ్చరించారు.  

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం నిన్న (మే 15) ముగిసింది. పశ్చిమాసియా లో నెలకొన్న సంక్షోభం, ఇరాన్ వివాదం వంటి అంశాలపై సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఉమ్మడి ప్రకటన లేకుండానే సదస్సు ముగిసింది. ఈ సదస్సులో పాల్గొనడానికి వచ్చిన రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ని  ఒక జర్నలిస్టు ఇబ్బందులకు గురిచేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

బ్రిక్స్ సదస్సు అనంతరం సెర్గీ లావ్రోవ్‌ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సావధానంగా సమాధానాలిస్తున్నారు. అయితే ఇంతలోనే ఓ జర్నలిస్టు ఫోన్‌లో మాట్లాడడంతో లావ్రోవ్‌ మాటలకు అంతరాయం కలిగింది. దీంతో ఆయన "మీరు మమ్మల్ని ఒంటిరిగా వదిలేయండి. లేదా ఫోన్‌ని వదిలేయండి" అని ఆయనతో అ‍న్నారు. దీని తర్వాత సైతం అతని తీరు మారక మరోసారి ఫోన్‌లో మాట్లాడుతూ ఆయనను ఇబ్బందులకు గురిచేశారు. దీంతో ఆగ్రహం చెందిన లావ్రోవ్‌  "మీరు మమ్మల్ని వదిలేస్తారా.. నేను జోక్ చేయడం లేదు. మీరు ఫోన్‌ వదిలేయకపోతే సెక్యూరిటీ సిబ్బంది తుపాకీ తీయాల్సి వస్తుంది" అని తీవ్రంగా హెచ్చరించారు.

దీంతో మీడియా సమావేశంలో పరిస్థితులు గంభీరంగా మారాయి. కాగా బ్రిక్స్ సమావేశం కోసం  వచ్చిన లావ్రోవ్ కేంద్రమంత్రులతో పలు కీలక సమావేశాలు జరిపారు. మోదీ యూఏఈ పర్యటనకు ముందు గురువారం ఆయనతో భేటీ అయ్యారు.  ద్వైపాక్షిక సంబంధాలతో పాటు, ఉక్రెయిన్, పశ్చిమ ఆసియాలోని పరిస్థితులతో సహా కొనసాగుతున్న అంతర్జాతీయ సంఘర్షణల గురించి చర్చించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement