breaking news
Gianni Infantino
-
‘అతడి జోలికి వెళ్లొద్దు’.. ఫిఫాకు ట్రంప్ వార్నింగ్!
ప్రపంచ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) అధ్యక్షుడు గియాని ఇన్ఫాంటినో పదవి నుంచి తప్పించాలని ఒత్తిళ్లు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయనకు మద్దతుగా నిలవడం ఆసక్తి కలిగిస్తోంది. ఇన్ఫాంటియానోను పదవి నుంచి తప్పించాలని ప్రపంచ ఫుట్‌బాల్ నియంత్రణ సంస్థ నిర్ణయం తీసుకుంటే అంతకంటే పెద్ద పొరపాటు ఇంకేమి ఉండదని తన సోషల్ మీడియా ట్రూత్ సోషల్‌లో ఘాటుగా వ్యాఖ్యానించారు.ఫిఫా వరల్డ్ కప్ వంటి ప్రపంచ స్థాయి టోర్నమెంట్ల వాణిజ్య హక్కులను నిర్వహించేందుకు 20 బిలియన్ డాలర్ల విలువైన ఒక కొత్త అనుబంధ సంస్థను ఏర్పాటు చేయాలని ఫిఫా యోచిస్తోంది. ఇందులో 20 శాతం వాటాను ప్రైవేట్ పెట్టుబడిదారులకు విక్రయించాలని ఫిఫా అధ్యక్షుడు గియాని ఇన్ఫాంటినో ప్రతిపాదించారు. అయితే ఈ ప్రతిపాదనలపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ ప్రణాళికను విరమించుకునేంత వరకు ‘ఫిఫా’ అన్నీ టోర్నమెంట్లను బహిష్కరించనున్నట్లు యూరోపియన్ సాకర్ సంస్థ హెచ్చరించింది. ఫిఫా అధ్యక్ష పదవి నుంచి కూడా ఇన్ఫాంటినో తప్పుకోవాలనే డిమాండ్లు కూడా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ అతడికి మద్దతు పలకడం గమనార్హం.ఇక ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ సోషల్‌లో ఇలా రాసుకొచ్చారు. "ఏ కారణం చేతనైనా, అధ్యక్షుడు గియానీ ఇన్ఫాంటినోను తొలగించాలని ఫీఫా కనీసం ఆలోచించినా అది ఒక ఘోరమైన పొరపాటే అవుతుంది. ఆయన అద్భుతమైన వ్యక్తి. ఇప్పటివరకు నిర్వహించిన ప్రపంచ కప్లలోకెల్లా అత్యంత విజయవంతమైన దానిని నాలుగుసార్లు నిర్వహించారు. ఆయన లేకపోయుంటే ఇంత లాభదాయకంగా ఉండేది కాదేమో! ఈ విషయంపై శ్రద్ధ వహించినందుకు ధన్యవాదాలు’’ అని ట్రంప్ పేర్కొన్నారు.2016 నుంచి గియాని ఇన్ఫాంటినో ఫిఫా అధ్యక్ష పదవిలో కొనసాగుతున్నారు. 2019, 2023 ఎన్నికల్లో విజయం సాధించిన ఆయన... వచ్చే ఏడాది మార్చిలో మొరాకో వేదికగా జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో చివరిసారి పోటీ చేయనున్నారు. ‘ఫిఫా’లో మొత్తం 211 సభ్య దేశాలు ఉండగా... యూరప్, దక్షిణామెరికాలోని 90 దేశాలతో పాటు ఆసియా ఫుట్‌బాల్ సమాఖ్యలోని 46 దేశాలు కూడా ఇన్ఫాంటినో ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో వచ్చే ఏడాది ఎన్నికలపై దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది.Read: ఆ ముగ్గురి నుంచి ఫోన్‌కాల్.. అందరికీ ఒకటే సమాధానం! -
‘ఫిఫా’ అధ్యక్షుడిపై తిరుగుబాటు
జెనీవా: ప్రపంచ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) అధ్యక్షుడు గియాని ఇన్ఫాంటినో చేపట్టిన కొత్త పెట్టుబడి ప్రణాళికపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ‘ఫిఫా’ ప్రపంచకప్ లాభాలను ప్రైవేట్ ఈక్విటీ సంస్థలకు విక్రయించాలనే ఇన్ఫాంటినో నిర్ణయాన్ని సభ్య దేశాలన్ని తప్పుపడుతున్నాయి. ఇప్పటికే యూరప్, ఉత్తర అమెరికా ఫుట్‌బాల్ సమాఖ్యలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించగా... తాజాగా ఆసియా ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఎఫ్సీ) కూడా ఆ జాబితాలో చేరింది. దీంతో ఇన్ఫాంటినోపై ఒత్తిడి మరింత పెరిగింది. ఈ వివాదం ముదురుతున్న తరుణంలో ఇన్ఫాంటినోకు అత్యంత సన్నిహితుడు, సీనియర్ సలహాదారు కార్లోస్ కార్డెరో తన పదవికి రాజీనామా చేశాడు. వైట్‌హౌస్ వరల్డ్‌కప్ టాస్క్ ఫోర్స్‌లో ‘ఫిఫా’ ప్రతినిధిగా వ్యవహరించిన కార్డెరో... ఇన్ఫాంటినో ప్రతిపాదన ఫుట్‌బాల్‌కు ఏమాత్రం మంచిది కాదని వెల్లడించాడు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ సోదరుడైన జోషువా కుష్నర్ సంస్థ కోసమే ‘ఫిఫా’ ఈ కొత్త ప్రతిపాదనను రూపొందించింది. కాగా... దీనిపై స్పందించిన ఫిఫా ‘ఫుట్‌బాల్‌ను అమ్మేయడానికి ఎవరూ ప్రయత్నించడం లేదు’ అని ప్రకటించిన గంటల వ్యవధిలోనే... కోర్డెరో ‘ప్రపంచకప్ లాభాల్లో వాటాలను అమ్మాలని ‘ఫిఫా’ ప్రయత్నిస్తుంటే చూస్తూ ఊరుకోలేను’ అంటూ సంచలన ప్రకటన చేశాడు. ఈ రహస్య ఒప్పందంతో తనకు ఎలాంటి సబంధం లేదని తేల్చిచెప్పాడు. ట్రంప్ అల్లుడి సోదరుడి కోసం! ఇటీవల కెనడా, మెక్సికో, అమెరికా వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక వరల్డ్‌కప్ విజయవంతం కాగా... దాని ద్వారా వచ్చిన లాభాలతో ట్రంప్ సన్నిహితులకు ఆయాచిత లబ్ది చేకూర్చేందుకు ‘ఫిఫా’ అధ్యక్షుడు గియాని ఇన్ఫాంటినో ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు తీవ్రమవుతున్నాయి. ‘ఫిఫా’ తన వాణిజ్య వ్యాపారాలను ఒక అనుబంధ సంస్థగా మార్చి అందులో 20 శాతం వాటాను ప్రైవేట్ పెట్టుబడిదారులకు విక్రయించాలని భావిస్తోంది. అయితే సరైన సంప్రదింపులు జరపకుండా ఏకపక్షంగా తీసుకున్న ఈ నిర్ణయం ‘ఫిఫా’ పాలనా వైఫల్యాలను ఎత్తిచూపుతోందని ఆసియా ఫుట్‌బాల్ సమాఖ్య ఆరోపించింది. ఈ ప్రణాళికను విరమించుకునేంత వరకు ‘ఫిఫా’ అన్నీ టోర్నమెంట్లను బహిష్కరించనున్నట్లు యూరోపియన్ సాకర్ సంస్థ హెచ్చరించింది. తప్పుడు ప్రచారం వల్లే ఈ సమస్య తలెత్తిందని ‘ఫిఫా’ వివరణ ఇచ్చినప్పటికీ... వచ్చే ఏడాది ‘ఫిఫా’ అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ఇన్ఫాంటినో భవితవ్యంపై ఇది తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. 2016 నుంచి గియాని ఇన్ఫాంటినో ఈ పదవిలో కొనసాగుతున్నారు. 2019, 2023 ఎన్నికల్లో విజయం సాధించిన ఆయన... వచ్చే ఏడాది మార్చిలో మొరాకో వేదికగా జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో చివరిసారి పోటీ చేయనున్నారు. ‘ఫిఫా’లో మొత్తం 211 సభ్య దేశాలు ఉండగా... యూరప్, దక్షిణామెరికాలోని 90 దేశాలతో పాటు ఆసియా ఫుట్‌బాల్ సమాఖ్యలోని 46 దేశాలు కూడా ఇన్ఫాంటినో ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో వచ్చే ఏడాది ఎన్నికలపై దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది. -
ఫిఫా అధ్యక్షుడికి ఐరాస అత్యున్నత పదవి..?
2026 ఫిఫా ప్రపంచకప్ విజయవంతంగా ముగిసిన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫిఫా అధ్యక్షుడు జియానీ ఇన్ఫాంటినోపై చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి.ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఒక్కతాటిపైకి తీసుకురాగల నాయకత్వ లక్షణాలు ఇన్ఫాంటినోకు ఉన్నాయని ప్రశంసిస్తూ, ఆయన ఐక్యరాజ్యసమితి (UN) తదుపరి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టాలని ట్రంప్ కోరుకుంటున్నట్లు నివేదికలు వెల్లడించాయి.అయితే, ట్రంప్ వ్యాఖ్యలు చేసినంత మాత్రాన ఇన్ఫాంటినో యూఎన్ ప్రధాన కార్యదర్శి కాలేరు. ఆ పదవికి ఎంపిక కావాలంటే ముందుగా 15 సభ్య దేశాలున్న ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UN Security Council) మద్దతు అవసరం. ఐదు శాశ్వత సభ్య దేశాల్లో (అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, చైనా) ఏ ఒక్క దేశం వీటో విధించినా అభ్యర్థిత్వం నిలిచిపోతుంది.భద్రతా మండలి ఆమోదం లభించిన తర్వాతే అభ్యర్థి పేరును యూఎన్ సర్వసభ్య సమావేశం (General Assembly) తుది ఆమోదానికి పంపుతుంది. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ పదవీకాలం ఈ ఏడాది డిసెంబరుతో ముగియనుండటంతో, కొత్త ప్రధాన కార్యదర్శి ఎంపిక ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది.ఇప్పటివరకు జియానీ ఇన్ఫాంటినో ఈ పదవికి పోటీ చేయాలనే ఆసక్తి వ్యక్తం చేసినట్లు లేదా ట్రంప్‌తో అధికారికంగా చర్చలు జరిపినట్లు ఎలాంటి నిర్ధారణ లేదు.ఇక యూఎన్ ప్రధాన కార్యదర్శి రేసులో చిలీ మాజీ అధ్యక్షురాలు మిచెల్ బాచెలెట్, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) డైరెక్టర్ జనరల్ రాఫెల్ గ్రోస్సీ పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి.కాగా, ప్రపంచకప్ విజయవంతంగా నిర్వహించిన తర్వాత భవిష్యత్తులో మరోసారి టోర్నీని అమెరికాలో నిర్వహించాలని ట్రంప్ ఫిఫాను కోరనున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల కిందట ముగిసిన ఫైనల్లో అర్జెంటీనాపై గెలిచి స్పెయిన్ ఛాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. విజేతకు ట్రంప్ చేతుల మీదుగా ట్రోఫీని బహుకరించారు. ఈ టోర్నీని అమెరికా,కెనడా, మెక్సికో దేశాలు సంయుక్తంగా నిర్వహించాయి. -
భారత్‌లో ఫుట్‌బాల్ అభివృద్ధి చెందాలి
‘ఫిఫా’ అధ్యక్షుడు ఇన్ఫాన్టినో ఆకాంక్ష జ్యూరిచ్: రాబోయే సంవత్సరాల్లో భారత్‌లో ఫుట్‌బాల్ మరింతగా అభివృద్ధి చెందాలని ‘ఫిఫా’ కొత్త అధ్యక్షుడు జియాని ఇన్ఫాన్టినో అన్నారు. ఓసియానియాలోని స్కూల్ చిన్నారులు ఫుట్‌బాల్ ఆడితే చూడాలని ఉందన్నారు. ‘ఆసియా, చైనా, భారత్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఈ క్రీడ బాగా విస్తరించాలి. ఇందుకోసం ఫిఫా సహాయం చేస్తుంది. 2020 వరకు ఫుట్‌బాల్‌ను భారీ ఎత్తున అభివృద్ధి చేయాలని అనుకుంటున్నాం. ఇందుకోసం వెస్టిండీస్, ఆఫ్రికాలో కూడా దీన్ని విసృ్తతం చేయాలి. దీనికి నాలుగేళ్ల సమయం ఉంది. అయితే అప్పటి వరకు నేను అధ్యక్షుడిగా ఉంటానో లేదో తెలియదు. ఎందుకంటే 2019లో మరోసారి ఎన్నికలు ఉన్నాయి. కానీ అభివృద్ధి చేస్తాననే నమ్మకమైతే ఉంది. ఇందుకోసం ఫిఫా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ఆట అభివృద్ధిలో ప్రతి జాతీయ సంఘం పాలు పంచుకోవాలి. కరీబియన్ లీగ్‌తో పాటు ఆఫ్రికాలో ప్రాథమిక స్థాయి నుంచి అకాడమీలను ఏర్పాటు చేయాలి’ అని ఇన్ఫాన్టినో వ్యాఖ్యానించారు. ప్రస్తుతం భారత్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 162వ స్థానంలో ఉండగా... వచ్చే ఏడాది అండర్-17 ప్రపంచ చాంపియన్‌షిప్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. -
‘ఫిఫా’ కొత్త అధ్యక్షుడిగా ఇన్ఫాన్టినో
జ్యూరిచ్: ప్రపంచ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) కొత్త అధ్యక్షుడిగా స్విట్జర్లాండ్‌కు చెందిన జియాని ఇన్ఫాన్టినో ఎన్నికయ్యారు. శుక్రవారం జరిగిన ఎన్నికల్లో 45 ఏళ్ల ఇన్‌ఫాన్‌టినోకు అత్యధికంగా 115 ఓట్లు లభించాయి. మిగతా అభ్యర్థులలో షేక్ సల్మాన్‌కు 88 ఓట్లు, ప్రిన్స్ అలీకి నాలుగు ఓట్లు రాగా... జెరోమ్ షాంపేన్కు ఒక్క ఓటు కూడా రాలేదు. తొలి రౌండ్లో ఎవరికీ మెజారిటీ రాకపోవడంతో రెండో రౌండ్‌ను నిర్వహించగా... ఇన్ఫాన్టినోను విజయం వరించింది.


