‘ఫిఫా’ కొత్త అధ్యక్షుడిగా ఇన్‌ఫాన్‌టినో
ప్రపంచ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) కొత్త అధ్యక్షుడిగా స్విట్జర్లాండ్‌కు చెందిన జియాని ఇన్‌ఫాన్‌టినో ఎన్నికయ్యారు......
జ్యూరిచ్: ప్రపంచ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) కొత్త అధ్యక్షుడిగా స్విట్జర్లాండ్‌కు చెందిన జియాని ఇన్‌ఫాన్‌టినో ఎన్నికయ్యారు. శుక్రవారం జరిగిన ఎన్నికల్లో 45 ఏళ్ల ఇన్‌ఫాన్‌టినోకు అత్యధికంగా 115 ఓట్లు లభించాయి. మిగతా అభ్యర్థులలో షేక్ సల్మాన్‌కు 88 ఓట్లు, ప్రిన్స్ అలీకి నాలుగు ఓట్లు రాగా... జెరోమ్ షాంపేన్‌కు ఒక్క ఓటు కూడా రాలేదు. తొలి రౌండ్‌లో ఎవరికీ మెజారిటీ రాకపోవడంతో రెండో రౌండ్‌ను నిర్వహించగా... ఇన్‌ఫాన్‌టినోను విజయం వరించింది.


