భారత్‌లో ఫుట్‌బాల్ అభివృద్ధి చెందాలి
రాబోయే సంవత్సరాల్లో భారత్‌లో ఫుట్‌బాల్ మరింతగా అభివృద్ధి చెందాలని ‘ఫిఫా’ కొత్త అధ్యక్షుడు జియాని ఇన్‌ఫాన్‌టినో ....
‘ఫిఫా’ అధ్యక్షుడు ఇన్‌ఫాన్‌టినో ఆకాంక్ష
జ్యూరిచ్: రాబోయే సంవత్సరాల్లో భారత్‌లో ఫుట్‌బాల్ మరింతగా అభివృద్ధి చెందాలని ‘ఫిఫా’ కొత్త అధ్యక్షుడు జియాని ఇన్‌ఫాన్‌టినో అన్నారు. ఓసియానియాలోని స్కూల్ చిన్నారులు ఫుట్‌బాల్ ఆడితే చూడాలని ఉందన్నారు. ‘ఆసియా, చైనా, భారత్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఈ క్రీడ బాగా విస్తరించాలి. ఇందుకోసం ఫిఫా సహాయం చేస్తుంది. 2020 వరకు ఫుట్‌బాల్‌ను భారీ ఎత్తున అభివృద్ధి చేయాలని అనుకుంటున్నాం. ఇందుకోసం వెస్టిండీస్, ఆఫ్రికాలో కూడా దీన్ని విసృ్తతం చేయాలి. దీనికి నాలుగేళ్ల సమయం ఉంది. అయితే అప్పటి వరకు నేను అధ్యక్షుడిగా ఉంటానో లేదో తెలియదు.
ఎందుకంటే 2019లో మరోసారి ఎన్నికలు ఉన్నాయి. కానీ అభివృద్ధి చేస్తాననే నమ్మకమైతే ఉంది. ఇందుకోసం ఫిఫా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ఆట అభివృద్ధిలో ప్రతి జాతీయ సంఘం పాలు పంచుకోవాలి. కరీబియన్ లీగ్‌తో పాటు ఆఫ్రికాలో ప్రాథమిక స్థాయి నుంచి అకాడమీలను ఏర్పాటు చేయాలి’ అని ఇన్‌ఫాన్‌టినో వ్యాఖ్యానించారు. ప్రస్తుతం భారత్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 162వ స్థానంలో ఉండగా... వచ్చే ఏడాది అండర్-17 ప్రపంచ చాంపియన్‌షిప్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది.


