ఇంగ్లండ్ జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌.. 'గే'కు ఛాన్స్‌ | England Name 12 Man Squad For 1st Test Against New Zealand, Check Out Names And Other Details Inside | Sakshi
Sakshi News home page

NZ vs ENG: ఇంగ్లండ్ జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌.. 'గే'కు ఛాన్స్‌

Jun 3 2026 11:28 AM | Updated on Jun 3 2026 12:01 PM

England name 12-man squad for 1st Test against New Zealand

న్యూజిలాండ్‌తో జూన్ 4 నుంచి ప్రారంభం కానున్న తొలి టెస్టు కోసం 12 మంది స‌భ్యుల‌తో కూడిన త‌మ జ‌ట్టును ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్ర‌క‌టించింది. ఈ జ‌ట్టులో డర్హమ్ టాప‌ర్డ‌ర్ బ్యాట‌ర్ ఎమిలియో గే(Emilio Gay), హాంప్‌షైర్ పేస్ బౌలర్ సోనీ బేకర్‌ల‌కు చోటు ద‌క్కింది. ఈ మ్యాచ్‌తో వారిద్ద‌రూ ఇంగ్లండ్ త‌ర‌పున టెస్టుల్లో అరంగేట్రం చేయ‌నున్నారు.

అయితే కివీస్‌తో తొలి టెస్టుకు రాజ‌స్తాన్ రాయ‌ల్స్ స్పీడ్ స్టార్ జోఫ్రా అర్చ‌ర్‌కు టీమ్ మేనెజ్‌మెంట్ విశ్రాంతి ఇచ్చింది. అత‌డు తిరిగి రెండో టెస్టులో ఆడ‌నున్నాడు. ఇక వెట‌ర‌న్ పేస‌ర్ రెండేళ్ల త‌ర్వాత ఇంగ్లండ్ జ‌ట్టులోకి వ‌చ్చాడు. అత‌డు చివ‌ర‌గా ఫిబ్రవరి 2024లో ఆడాడు. స్టార్ ఓపెన‌ర్ జాక్ క్రాలీని జ‌ట్టు నుంచి త‌ప్పించ‌డంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను బెన్ డకెట్‌తో కలిసి యువ ఆట‌గాడు గే ప్రారంభించ‌నున్నాడు. 

ఈ విష‌యాన్ని ఇంగ్లండ్ క్రికెట్‌ డైరెక్టర్ రాబ్ కీ ధృవీకరించారు. 26 ఏళ్ల ఎమిలియో గే ప్ర‌స్తుతం అద్భుత‌మైన ఫామ్‌లో ఉన్నాడు.  2026 కౌంటీ సీజన్‌లో అతడు కేవలం మ్యాచ్‌ల్లోనే 92 సగటుతో 554 పరుగులు సాధించాడు. ఇందులో 3 సెంచరీలు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలోనే  అత‌డు ఇంగ్లండ్ త‌ర‌పున అరంగేట్రం చేయ‌డానికి సిద్ద‌మ‌య్యాడు. ఇక యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాజయం చవిచూసిన త‌ర్వాత ఇంగ్లండ్ జ‌ట్టుకు ఇదే తొలి టెస్ట్ మ్యాచ్ కావ‌డం గ‌మ‌నార్హం. 

దీంతో ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి క‌మ్‌బ్యాక్ ఇవ్వాల‌ని ఇంగ్లీష్ జ‌ట్టు భావిస్తోంది. అదేవిధంగా వ‌ర‌ల్డ్ టెస్టు ఛాంపియ‌న్‌షిప్ పాయింట్ల ప‌ట్టిక‌లో ఇంగ్లండ్ 7వ స్థానంలో ఉంది. ఈ సైకిల్‌లో స్టోక్స్ సేన ఆడిన 10 మ్యాచ్‌లలో, కేవలం 3 మ్యాచ్‌లలో మాత్రమే విజయం సాధించి, 6 మ్యాచ్‌లలో ఓటమి పాలైంది. ఓ మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. ఫైన‌ల్ రేసులో ఉండాలంటే కివీస్‌తో సిరీస్ ఇంగ్లండ్‌కు అత్యంత కీలకం కానుంది.

కివీస్‌తో తొలి టెస్టుకు ఇంగ్లండ్ జ‌ట్టు
బెన్ స్టోక్స్ (కెప్టెన్), గస్ అట్కిన్సన్,సన్నీ బేకర్,షోయబ్ బషీర్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బెన్ డకెట్, ఎమిలియో గే, ఆలీ రాబిన్సన్, జో రూట్, జేమీ స్మిత్ (వికెట్ కీపర్),జాష్ టంగ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement