వరంగల్‌తో మ్యాచ్‌.. నల్గొండ బ్యాటింగ్‌ | TG20 League 2026: Warangal Warriors Vs Nalgonda Kinghts Toss Updates | Sakshi
Sakshi News home page

వరంగల్‌తో మ్యాచ్‌.. నల్గొండ బ్యాటింగ్‌

Jun 26 2026 2:06 PM | Updated on Jun 26 2026 4:00 PM

TG20 League 2026: Warangal Warriors Vs Nalgonda Kinghts Toss Updates

రాహుల్‌ బుద్ధి- అమన్‌ రావు (PC: TG20 X)

తెలంగాణ టీ20 లీగ్‌ (టీజీ20)- 2026లో భాగంగా శుక్రవారం వరంగల్‌ వారియర్స్‌- నల్గొండ నైట్స్‌ తలపడుతున్నాయి. ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ స్టేడియంలో వేదికగా టాస్‌ గెలిచిన వరంగల్‌ వారియర్స్‌ తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో నల్గొండ నైట్స్‌ బ్యాటింగ్‌కు దిగింది.

కాగా ఇప్పటికి రెండు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న వరంగల్‌.. ఒక విజయం.. ఒక పరాజయం నమోదు చేసింది. ఫలితంగా రెండు పాయింట్లతో మూడో స్థానంలో ఉండగా.. నల్గొండ సైతం ఒకటి గెలిచి ఒకటి ఓడిపోయింది. అయితే, నెట్‌రన్‌రేటు పరంగా వెనుకబడి ఐదో స్థానంలో కొనసాగుతోంది.

తుదిజట్లు
నల్గొండ
ప్రణవ్‌ సూర్యదేవర, గౌరవ్‌ రెడ్డి, నితీశ్‌ రెడ్డి, రాహుల్‌ బుద్ధి (కెప్టెన్‌), దివేశ్‌ సింగ్‌, ఎండీ అర్ఫాజ్‌ అహ్మద్‌, టి.హర్షవర్దన్‌ సింగ్‌, అనికేత్‌ రెడ్డి, వరుణ్‌ గౌడ్‌, రక్షణ్‌ రెడ్డి, నిశాంత్‌ సరాను.

వరంగల్‌
అమన్‌ రావు (కెప్టెన్‌), హర్షిత్‌ చౌదరి, రిషికేత్‌ సిసోడియా, భవేశ్‌ సేత్‌, మురుగన్‌ అభిషేక్‌, ఆది మణి కిరణ్‌, ఆసిఫ్‌ మన్సూరి, క్రాంటి పల్లెపాటి, మహ్మద్‌ అబ్దుల్‌ మాలిక్‌, ముదస్పర్‌ హుసేన్‌, శౌనక్‌ కులకర్ణి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement