breaking news
Rahul Buddhi
-
నల్గొండతో మ్యాచ్.. మెదక్ నామమాత్రపు స్కోరు
తెలంగాణ టీ20 (టీజీ20) లీగ్-2026లో శుక్రవారం నాటి మధ్యాహ్నం మ్యాచ్‌లో మెదక్ ఫాల్కన్స్- నల్గొండ నైట్స్ తలపడుతున్నాయి. ఉప్పల్ వేదికగా టాస్ గెలిచిన మెదక్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది.ఓపెనర్లలో నమన్ అగర్వాల్ (18) ఫర్వాలేదనిపించగా.. శృంజిత్ రెడ్డి (17 బంతుల్లో 30) మెరుపులు మెరిపించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ రవితేజ 33 పరుగులు చేశాడు. ఆఖర్లో విక్రం నాయక్ (31 బంతుల్లో 48), వరుణ్ యర్రం (29 బంతుల్లో 44) మెరుగ్గా రాణించి అజేయంగా నిలిచారు. నల్గొండ బౌలర్లలో రక్షన్ రెడ్డి, అనికేత్ రెడ్డి, సతాని తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.తుదిజట్లుమెదక్ ఫాల్కన్స్రవితేజ (కెప్టెన్), నమన్ అగర్వాల్, శృంజిత్ రెడ్డి, విక్రమ్ నాయక్ (వికెట్ కీపర్), సాయి వరుణ్ యర్రం, అర్జున్ గొర్రపల్లి, జగమ్ బన్నీ, నొమన్ అహ్మద్, సయ్మద్ ఘాజి అబ్బాస్, కార్తికేయ కాక్, మధుకర్ మన్నెనల్గొండ నైట్స్రాహుల్ బుద్ధి (కెప్టెన్), అనికేత్ రెడ్డి, టి.హర్షవర్దన్ సింగ్ (వికెట్ కీపర్), గౌరవ్ రెడ్డి, జశ్వంత్ మోటే, నితీశ్ రెడ్డి, ఎండీ అర్ఫాజ్ అహ్మద్, దివేశ్ సింగ్, ఇల్యాన్ సతాని, ఉర్వేశ్ కక్కడ్, రక్షన్ రెడ్డి. -
పాలమూరు నామమాత్రపు స్కోరు
తెలంగాణ టీ20 (టీజీ20)- 2026 లీగ్‌లో భాగంగా సోమవారం నల్గొండ నైట్స్- పాలమూరు స్ట్రైకర్స్ ముఖాముఖి తలపడుతున్నాయి. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో టాస్ గెలిచిన నల్గొండ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో పాలమూరు బ్యాటింగ్‌కు దిగింది.పాలమూరు నామమాత్రపు స్కోరునల్గొండతో మ్యాచ్‌లో పాలమూరు నామమాత్రపు స్కోరుకు పరిమితమైంది. నల్గొండ బౌలర్ల ధాటికి పాలమూరు టాపార్డర్ కుదేలైంది. ఓపెనర్లలో విఘ్నేశ్ రెడ్డి సింగిల్ డిజిట్ స్కోరు (4)కే వెనుదిరగగా.. వన్‌డౌన్ బ్యాటర్ కరణ్ యాదవ్ డకౌట్ అయ్యాడు.మరో ఓపెనర్ చైతన్య రెడ్డి 17 పరుగులు చేయగలిగాడు. ఇలాంటి తరుణంలో కెప్టెన్ ప్రజ్ఞయ్ రెడ్డి (35 బంతుల్లో 55), తేజ (33 బంతుల్లో 50) అద్భుత అర్ధ శతకాలతో రాణించి ఇన్నింగ్స్ చక్కదిద్దారు. మిగిలిన వారిలో ఆఫ్రిది పద్నాలుగు పరుగులు చేయగలిగాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి పాలమూరు 148 పరుగులు స్కోరు చేసింది.నల్గొండ బౌలర్లలో అఫ్రాజ్ అహ్మద్ మూడు వికెట్లు పడగొట్టగా.. నిశాంత్ సరాను రెండు, అనికేత్ రెడ్డి, దివేశ్ సింగ్ తలా ఒక వికెట్ పడగొట్టారు.తుదిజట్లుపాలమూరుప్రజ్ఞయ్ రెడ్డి (కెప్టెన్, వికెట్ కీపర్), విఘ్నేశ్ రెడ్డి అనుముల, చైతన్య రెడ్డి, కరణ్ యాదవ్, రోహిత్ రాయుడు, ఎండీ షాదాబ్ అహ్మద్, ఎండీ ఆఫ్రిది అహ్మద్, రతన్ తేజ, రిషభ్ బస్లాస్, నిపుణ్ రెడ్డి, ఎండీ అజారుద్దీన్నల్గొండరాహుల్ బుద్ధి (కెప్టెన్), అనికేత్ రెడ్డి, హర్షవర్దన్ సింగ్ (వికెట్ కీపర్), గౌరవ్ రెడ్డి, జశ్వంత్ మోటే, పి. నితీశ్ రెడ్డి, ఎండీ అఫ్రాజ్ అహ్మద్, దివేశ్ సింగ్, వరుణ్ గౌడ్, రక్షన్ రెడ్డి, నిశాంత్ సరాను. -
వరంగల్‌తో మ్యాచ్.. నల్గొండ బ్యాటింగ్
తెలంగాణ టీ20 లీగ్ (టీజీ20)- 2026లో భాగంగా శుక్రవారం వరంగల్ వారియర్స్- నల్గొండ నైట్స్ తలపడుతున్నాయి. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో వేదికగా టాస్ గెలిచిన వరంగల్ వారియర్స్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో నల్గొండ నైట్స్ బ్యాటింగ్‌కు దిగింది.కాగా ఇప్పటికి రెండు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న వరంగల్.. ఒక విజయం.. ఒక పరాజయం నమోదు చేసింది. ఫలితంగా రెండు పాయింట్లతో మూడో స్థానంలో ఉండగా.. నల్గొండ సైతం ఒకటి గెలిచి ఒకటి ఓడిపోయింది. అయితే, నెట్‌రన్‌రేటు పరంగా వెనుకబడి ఐదో స్థానంలో కొనసాగుతోంది.తుదిజట్లునల్గొండప్రణవ్ సూర్యదేవర, గౌరవ్ రెడ్డి, నితీశ్ రెడ్డి, రాహుల్ బుద్ధి (కెప్టెన్), దివేశ్ సింగ్, ఎండీ అర్ఫాజ్ అహ్మద్, టి.హర్షవర్దన్ సింగ్, అనికేత్ రెడ్డి, వరుణ్ గౌడ్, రక్షణ్ రెడ్డి, నిశాంత్ సరాను.వరంగల్అమన్ రావు (కెప్టెన్), హర్షిత్ చౌదరి, రిషికేత్ సిసోడియా, భవేశ్ సేత్, మురుగన్ అభిషేక్, ఆది మణి కిరణ్, ఆసిఫ్ మన్సూరి, క్రాంటి పల్లెపాటి, మహ్మద్ అబ్దుల్ మాలిక్, ముదస్పర్ హుసేన్, శౌనక్ కులకర్ణి.


