పాలమూరు నామమాత్రపు స్కోరు | TG20 League 2026 ANK vs PAS: Nalgonda Won Toss Update Result | Sakshi
Sakshi News home page

పాలమూరు నామమాత్రపు స్కోరు

Jun 29 2026 2:25 PM | Updated on Jun 29 2026 4:04 PM

TG20 League 2026 ANK vs PAS: Nalgonda Won Toss Update Result

తెలంగాణ టీ20 (టీజీ20)- 2026 లీగ్‌లో భాగంగా సోమవారం నల్గొండ నైట్స్‌- పాలమూరు స్ట్రైకర్స్‌ ముఖాముఖి తలపడుతున్నాయి. ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో టాస్‌ గెలిచిన నల్గొండ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో పాలమూరు బ్యాటింగ్‌కు దిగింది.

పాలమూరు నామమాత్రపు స్కోరు
నల్గొండతో మ్యాచ్‌లో పాలమూరు నామమాత్రపు స్కోరుకు పరిమితమైంది. నల్గొండ బౌలర్ల ధాటికి పాలమూరు టాపార్డర్‌ కుదేలైంది. ఓపెనర్లలో విఘ్నేశ్‌ రెడ్డి సింగిల్‌ డిజిట్‌ స్కోరు (4)కే వెనుదిరగగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ కరణ్‌ యాదవ్‌ డకౌట్‌ అయ్యాడు.

మరో ఓపెనర్‌ చైతన్య రెడ్డి 17 పరుగులు చేయగలిగాడు. ఇలాంటి తరుణంలో కెప్టెన్‌ ప్రజ్ఞయ్‌ రెడ్డి (35 బంతుల్లో 55), తేజ (33 బంతుల్లో 50) అద్భుత అర్ధ శతకాలతో రాణించి ఇన్నింగ్స్‌ చక్కదిద్దారు. మిగిలిన వారిలో ఆఫ్రిది పద్నాలుగు పరుగులు చేయగలిగాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి పాలమూరు 148 పరుగులు స్కోరు చేసింది.

నల్గొండ బౌలర్లలో అఫ్రాజ్‌ అహ్మద్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. నిశాంత్‌ సరాను రెండు, అనికేత్‌ రెడ్డి, దివేశ్‌ సింగ్‌ తలా ఒక వికెట్‌ పడగొట్టారు.

తుదిజట్లు
పాలమూరు
ప్రజ్ఞయ్‌ రెడ్డి (కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), విఘ్నేశ్‌ రెడ్డి అనుముల, చైతన్య రెడ్డి, కరణ్‌ యాదవ్‌, రోహిత్‌ రాయుడు, ఎండీ షాదాబ్‌ అహ్మద్‌, ఎండీ ఆఫ్రిది అహ్మద్‌, రతన్‌ తేజ, రిషభ్‌ బస్లాస్‌, నిపుణ్‌ రెడ్డి, ఎండీ అజారుద్దీన్‌

నల్గొండ
రాహుల్‌ బుద్ధి (కెప్టెన్‌), అనికేత్‌ రెడ్డి, హర్షవర్దన్‌ సింగ్‌ (వికెట్‌ కీపర్‌), గౌరవ్‌ రెడ్డి, జశ్వంత్‌ మోటే, పి. నితీశ్‌ రెడ్డి, ఎండీ అఫ్రాజ్‌ అహ్మద్‌, దివేశ్‌ సింగ్‌, వరుణ్‌ గౌడ్‌, రక్షన్‌ రెడ్డి, నిశాంత్‌ సరాను.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement