breaking news
Palamuru Strikers
-
కరీంనగర్ ఘన విజయం.. ప్లే ఆఫ్స్ బెర్తు ఖరారు!
తెలంగాణ టీ20 (టీజీ20)- 2026 లీగ్ అరంగేట్ర సీజన్లో కరీంనగర్ డైమండ్స్ ప్లే ఆఫ్స్ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకుంది. పాలమూరు స్ట్రైకర్స్‌తో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో కరీంనగర్ ఆటగాళ్లు దుమ్ములేపారు. ఈ క్రమంలో ప్రత్యర్థిని ఏకంగా 73 పరుగుల తేడాతో చిత్తు చేసింది కరీంనగర్.ఉప్పల్ వేదికగా మంగళవారం నాటి మధ్యాహ్నం మ్యాచ్‌లో పాలమూరు- కరీంనగర్ తలపడ్డాయి. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో టాస్ గెలిచిన పాలమూరు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన కరీంనగర్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 216 పరుగులు సాధించింది.తన్మయ్ అగర్వాల్ అద్భుత శతకం ఓపెనర్లలో కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ అద్భుత శతకం (58 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్సర్లు; 109) సాధించాడు. సాత్విక్ రెడ్డి 22 బంతుల్లో 32 పరుగులు చేశాడు. మిగిలిన వారిలో నారాయణ తేజ మెరుపులు (8 బంతుల్లో 23 నాటౌట్) మెరిపించాడు.ఇక లక్ష్య ఛేదనలో పాలమూరును కరీంనగర్ 143 పరుగులకే కట్టడి చేసింది. కరీంనగర్ బౌలర్లలో రత్లావత్ దినేశ్, శుభం శర్మ మూడేసి వికెట్లతో చెలరేగి పాలమూరు బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించారు. నారాయణ తేజ, ఆశిష్ శ్రీవాస్తవ్ చెరో వికెట్ దక్కించుకున్నారు.A true all-rounder! 😍This return catch deserves a place in the greatest museums of the world! 🥵#KDvPS #SreenidhiUniversityTG20 #ManaCricketShuru pic.twitter.com/dgGVkLTZ6M— tg20official (@tg20official) July 7, 2026సంహిత్ రెడ్డి మెరుపులు వృథాపాలమూరు బ్యాటర్లలో సంహిత్ రెడ్డి టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. 46 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 67 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడికి తోడుగా షాదాబ్ అహ్మద్ (16 బంతుల్లో 24) రాణించాడు. కానీ మిగతా వాళ్లంతా తేలిపోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో పాలమూరు తొమ్మిది వికెట్లు నష్టపోయి 143 పరుగులకే పరిమితమైంది. దీంతో ఓటమితోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది.కాగా లీగ్ దశలో ఆడిన ఏడు మ్యాచ్‌లలో పాలమూరుకు ఇది ఐదో ఓటమి. మరోవైపు.. కరీంనగర్‌కు ఏడింట ఇది నాలుగో గెలుపు. ఇక ఇప్పటికే హైదరాబాద్, ఖమ్మం ప్లే ఆఫ్స్ చేరగా.. మూడు, నాలుగు స్థానాల కోసం కరీంనగర్, నల్గొండ, రంగారెడ్డి బరిలో నిలిచాయి. అయితే, మంగళవారం జరిగే రంగారెడ్డి- వరంగల్ మ్యాచ్ ఫలితంతో మూడు, నాలుగు స్థానాల్లో ఎవరు నిలిచారో అధికారికంగా తేలుతుంది. కరీంనగర్ ఎనిమిది పాయింట్లతో పాటు మెరుగైన నెట్‌రన్‌రేటు (+1.424)తో బెర్తును దాదాపుగా ఖరారు చేసుకుంది. -
సెంచరీతో చెలరేగిన కెప్టెన్
పాలమూరు స్ట్రైకర్స్‌పై కరీంనగర్ డైమండ్స్ కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ శతక్కొట్టాడు. మొత్తంగా 58 బంతులు ఎదుర్కొని పదకొండు ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 109 పరుగులు సాధించాడు. ఫలితంగా.. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కరీంనగర్ భారీ స్కోరు చేయగలిగింది.తెలంగాణ టీ20 (టీజీ20)- 2026 లీగ్‌లో భాగంగా మంగళవారం నాటి మధ్యాహ్నం మ్యాచ్‌లో పాలమూరు స్ట్రైకర్స్‌తో కరీంనగర్ డైమండ్స్ తలపడుతోంది. ఉప్పల్ వేదికగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో టాస్ గెలిచిన పాలమూరు తొలుత ఫీల్డింగ్ ఎంచుకుని.. కరీంనగర్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.తన్మయ్ శతకంతో చెలరేగడంతోఈ క్రమంలో ఓపెనర్లు కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ (109), సాత్విక్ రెడ్డి (22 బంతుల్లో 32) శుభారంభం అందించారు. ముఖ్యంగా తన్మయ్ శతకంతో చెలరేగడంతో మిగతా బ్యాటర్లు విఫలమైనా కరీంనగర్ స్కోరు 200 దాటింది. చందన్ సహాని 16, సింహా 15, రాహుల్ రాదేశ్ 10 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచారు.Brutal hitting! 💥Tanmay Agarwal upped the ante with 2️⃣0️⃣ off the over, putting the Diamonds in a position of stength! 💪#KDvPS #SreenidhiUniversityTG20 #ManaCricketShuru pic.twitter.com/mNgmtOh5lc— tg20official (@tg20official) July 7, 2026ఆఖర్లో నారాయణ తేజ మెరుపు ఇన్నింగ్స్ (8 బంతుల్లో 23 నాటౌట్) ఆడాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి కరీంనగర్ డైమండ్స్ 216 పరుగులు చేసింది. పాలమూరు బౌలర్లలో అశ్వద్ రాజీవ్ రెండు వికెట్లు తీయగా.. మహ్మద్ ఆఫ్రిది, రిషభ్ బిస్లాస్, నిశాంత్ రెడ్డి తలా ఒక వికెట్ పడగొట్టారు.ఇక ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే కరీంనగర్ ప్లే ఆఫ్స్ రేసులో ఉంటుంది. మరోవైపు.. పాలమూరు ఇప్పటికి ఆడిన ఆరు మ్యాచ్‌లలో ఒక్కటి మాత్రమే గెలిచి ఇప్పటికే ఎలిమినేట్ అయింది.తుదిజట్లుపాలమూరు స్ట్రైకర్స్ప్రజ్ఞయ్ రెడ్డి (కెప్టెన్, వికెట్ కీపర్), విఘ్నేశ్ రెడ్డి, రోహిత్ రాయుడు, మణికంఠేశ్వర్‌రెడ్డి, రిషభ్ బిస్లాస్, ఎండీ ఆఫ్రిదీ అహ్మద్, సంహిత్ రెడ్డి, ఎండీ షాదాబ్ అహ్మద్, నిపుణ్ రెడ్డి, అశ్వద్ రాజీవ్, నిశాంత్ సేన్ రెడ్డి.కరీంనగర్ డైమండ్స్తన్మయ్ అగర్వాల్ (కెప్టెన్), సాత్విక్ రెడ్డి, హెచ్‌కే సింహ, రాహుల్ రాదేశ్ (వికెట్ కీపర్), చందన్ సహాని, టీవీఎస్ నారాయణ తేజ, హరీశ్ ఠాకూర్, శుభం శర్మ, రత్లావత్ దినేశ్, ఆశిష్ శ్రీవాస్తవ్, సతీశ్ కుమార్. -
కరీంనగర్‌కు చావోరేవో.. టాస్ గెలిచిన పాలమూరు
తెలంగాణ టీ20 (టీజీ20)- 2026 లీగ్‌లో భాగంగా మంగళవారం మధ్యాహ్నం మ్యాచ్‌లో పాలమూరు స్ట్రైకర్స్- కరీంనగర్ డైమండ్స్ తలపడుతున్నాయి. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో టాస్ గెలిచిన పాలమూరు తొలుత ఫీల్డింగ్ ఎంచుకోగా.. కరీంనగర్ బ్యాటింగ్‌కు దిగింది. ఇరుజట్లకు లీగ్ దశలో ఇదే ఆఖరి మ్యాచ్ కావడం గమనార్హం.కాగా హైదరాబాద్ ఇ- చాంపియన్స్ లీగ్ దశలో ఏడింట ఏడు గెలిచి.. 14 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఇక హైదారాబాద్‌తో పాటు ఖమ్మం ఏసెస్ (ఏడింట ఐదు గెలిచి) తమ ప్లే ఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకుంది. ఈ క్రమంలో మిగిలిన రెండు బెర్తుల కోసం కరీంనగర్ డైమండ్స్, నల్గొండ నైట్స్, రంగారెడ్డి రైజర్స్ పోటీలో ఉన్నాయి.ఇక మంగళవారం కరీంనగర్ పాలమూరుతో మ్యాచ్‌లో గెలిస్తేనే రేసులో ఉండగలుగుతుంది. అనంతరం రంగారెడ్డి- వరంగల్ మ్యాచ్ ఫలితంతో ప్లే ఆఫ్స్ చేరిన మిగిలిన రెండు జట్లు ఏవో తేలుతుంది. తుదిజట్లుపాలమూరు స్ట్రైకర్స్ప్రజ్ఞయ్ రెడ్డి (కెప్టెన్, వికెట్ కీపర్), విఘ్నేశ్ రెడ్డి, రోహిత్ రాయుడు, మణికంఠేశ్వర్‌రెడ్డి, రిషభ్ బిస్లాస్, ఎండీ ఆఫ్రిదీ అహ్మద్, సంహిత్ రెడ్డి, ఎండీ షాదాబ్ అహ్మద్, నిపుణ్ రెడ్డి, అశ్వద్ రాజీవ్, నిశాంత్ సేన్ రెడ్డి.కరీంనగర్ డైమండ్స్తన్మయ్ అగర్వాల్ (కెప్టెన్), సాత్విక్ రెడ్డి, హెచ్‌కే సింహ, రాహుల్ రాదేశ్ (వికెట్ కీపర్), చందన్ సహాని, టీవీఎస్ నారాయణ తేజ, హరీశ్ ఠాకూర్, శుభం శర్మ, రత్లావత్ దినేశ్, ఆశిష్ శ్రీవాస్తవ్, సతీశ్ కుమార్. -
వర్షంతో వరంగల్, పాలమూరు మ్యాచ్ రద్దు
టీజీ20 లీగ్‌లో శుక్రవారం వరంగల్ వారియర్స్, పాలమూరు స్ట్రైకర్స్ మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. టాస్ గెలిచిన పాలమూరు స్ట్రైకర్స్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన వరంగల్ వారియర్స్ 2.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 23 పరుగులు చేసింది. హర్షిత్ చౌదరీ (8), రిషికేత్ సిసోడియా (1) పరుగులతో ఆడుతున్నారు. ఈ దశలో వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. ఆ తర్వాత వర్షం ఎంతకీ తెరిపినివ్వకపోవడంతో మ్యాచ్ రద్దుకే అంపైర్లు మొగ్గు చూపారు. దీంతో ఇరుజట్లకు చెరో పాయింట్ లభించింది. ఈ సిరీస్ లో ఇప్పటివరకు పాలమూరు స్ట్రైకర్స్, వరంగల్ వారియర్స్ ఆరు చొప్పున మ్యాచ్‌లు ఆడగా.. ఒక్కో మ్యాచ్‌లో విజయం సాధించాయి. -
పాలమూరు స్ట్రైకర్స్ వర్సెస్ వరంగల్ తుది జట్లు ఇవే
తెలంగాణ టీ20 లీగ్‌లో భాగంగా ఉప్పల్ వేదికగా పాలమూరు స్ట్రైకర్స్, వరంగల్ వారియర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాలమూరు స్ట్రైకర్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఇరు జట్లు ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి. ఈ నామమాత్రపు మ్యాచ్‌లో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని వరంగల్, పాలమూరు భావిస్తున్నాయి.తుది జట్లువరంగల్ వారియర్స్: అమన్ రావ్ పేరాల(కెప్టెన్), భవేష్ సేథ్(వికెట్ కీపర్), రిషికేత్ సిసోడియా, హర్షిత్ చౌదరి, మురుగన్ అభిషేక్, ఆది మణి కిరణ్, కర్రి సాయి ధనుష్, ముదస్సర్ హుస్సేన్, పల్లెపాటి క్రాంతి, సుంకరి ధీరజ్, సల్మాన్ ఖాన్పాలమూరువిగ్నేష్ రెడ్డి, ప్రజ్ఞయ్ రెడ్డి, రోహిత్ రాయుడు, మణికంతేశ్వర్ రెడ్డి, రిషబ్, మహ్మద్ అఫ్రిది, బుడిది తేజ, షదాబ్ అహ్మద్, నిపుణ్ రెడ్డి, అశ్వద్ రాజీవ్, నిశాంత్ రెడ్డి -
నల్గొండ నైట్స్ హ్యాట్రిక్ విజయం
తెలంగాణ టీ20 లీగ్-2026లో అనురాగ్ నల్గొండ నైట్స్ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. ఈ టోర్నీలో భాగంగా సోమవారం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాలమూరు స్ట్రైకర్స్‌ను 6 వికెట్ల తేడాతో నల్గొండ చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాలమూరు స్ట్రైకర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 148 పరుగుల నామ మాత్రపు స్కోర్ సాధించింది. పాలమూరు ఇన్నింగ్స్‌లో కెప్టెన్ ప్రజ్ఞయ్ రెడ్డి (55), బుడిది తేజ (50) హాఫ్ సెంచరీలతో రాణించగా.. మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. నల్గొండ నైట్స్ బౌలర్లలో అర్ఫాజ్ అహ్మద్ మహమ్మద్ మూడు వికెట్లు పడగొట్టగా.. నిశాంత్ రెండు, అనికేత్, దివేష్ తలా వికెట్ సాధించారు. అనంతరం 149 పరుగుల లక్ష్యాన్ని నల్గొండ జట్టు కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 15.2 ఓవర్లలో ఊదిపడేసింది. నల్గొండ మిడిలార్డర్ బ్యాటర్ రాహుల్ బుద్ది(68) అజేయంగా నిలిచి మ్యాచ్ ఫినిష్ చేశాడు. ఈ విజయంతో నల్గొండ నైట్స్ జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్ధానానికి చేరుకుంది.చదవండి: IND vs IRE: భారత్‌పై ఘన విజయం.. ఐర్లాండ్‌కు భారీ షాక్ -
పాలమూరు నామమాత్రపు స్కోరు
తెలంగాణ టీ20 (టీజీ20)- 2026 లీగ్‌లో భాగంగా సోమవారం నల్గొండ నైట్స్- పాలమూరు స్ట్రైకర్స్ ముఖాముఖి తలపడుతున్నాయి. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో టాస్ గెలిచిన నల్గొండ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో పాలమూరు బ్యాటింగ్‌కు దిగింది.పాలమూరు నామమాత్రపు స్కోరునల్గొండతో మ్యాచ్‌లో పాలమూరు నామమాత్రపు స్కోరుకు పరిమితమైంది. నల్గొండ బౌలర్ల ధాటికి పాలమూరు టాపార్డర్ కుదేలైంది. ఓపెనర్లలో విఘ్నేశ్ రెడ్డి సింగిల్ డిజిట్ స్కోరు (4)కే వెనుదిరగగా.. వన్‌డౌన్ బ్యాటర్ కరణ్ యాదవ్ డకౌట్ అయ్యాడు.మరో ఓపెనర్ చైతన్య రెడ్డి 17 పరుగులు చేయగలిగాడు. ఇలాంటి తరుణంలో కెప్టెన్ ప్రజ్ఞయ్ రెడ్డి (35 బంతుల్లో 55), తేజ (33 బంతుల్లో 50) అద్భుత అర్ధ శతకాలతో రాణించి ఇన్నింగ్స్ చక్కదిద్దారు. మిగిలిన వారిలో ఆఫ్రిది పద్నాలుగు పరుగులు చేయగలిగాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి పాలమూరు 148 పరుగులు స్కోరు చేసింది.నల్గొండ బౌలర్లలో అఫ్రాజ్ అహ్మద్ మూడు వికెట్లు పడగొట్టగా.. నిశాంత్ సరాను రెండు, అనికేత్ రెడ్డి, దివేశ్ సింగ్ తలా ఒక వికెట్ పడగొట్టారు.తుదిజట్లుపాలమూరుప్రజ్ఞయ్ రెడ్డి (కెప్టెన్, వికెట్ కీపర్), విఘ్నేశ్ రెడ్డి అనుముల, చైతన్య రెడ్డి, కరణ్ యాదవ్, రోహిత్ రాయుడు, ఎండీ షాదాబ్ అహ్మద్, ఎండీ ఆఫ్రిది అహ్మద్, రతన్ తేజ, రిషభ్ బస్లాస్, నిపుణ్ రెడ్డి, ఎండీ అజారుద్దీన్నల్గొండరాహుల్ బుద్ధి (కెప్టెన్), అనికేత్ రెడ్డి, హర్షవర్దన్ సింగ్ (వికెట్ కీపర్), గౌరవ్ రెడ్డి, జశ్వంత్ మోటే, పి. నితీశ్ రెడ్డి, ఎండీ అఫ్రాజ్ అహ్మద్, దివేశ్ సింగ్, వరుణ్ గౌడ్, రక్షన్ రెడ్డి, నిశాంత్ సరాను. -
చితక్కొట్టిన ఓపెనర్లు.. రంగారెడ్డి రైజర్స్ ఘనవిజయం
టీజీ20 లీగ్‌లో రంగారెడ్డి రైజర్స్ మూడో విజయాన్ని అందుకుంది. శనివారం ఉప్పల్ వేదికగా పాలమూరు స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రంగారెడ్డి రైజర్స్ 6 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. పాలమూరు విధించిన 131 పరుగుల లక్ష్యాన్ని రంగారెడ్డి రైజర్స్ 14 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేధించింది. రంగారెడ్డి ఓపెనర్లు అవనీష్ (50), గ్యానా రెడ్డి (47) ఆరంభం నుంచే ధాటి ఆడి జట్టును విజయపథంలో నడిపించారు. ఈ క్రమంలో గ్యానా రెడ్డి ఔటైనప్పటికీ మరో ఓపెనర్ అవనీష్ అర్ధసెంచరీతో రాణించాడు. అయితే చివర్లో అవనీష్ ఔటైనప్పటికీ ఆదిత్య (7 నాటౌట్), తనయ్ త్యాగరాజన్ (7 నాటౌట్) మిగతా పనిని పూర్తి చేశారు. పాలమూరు బౌలర్ రిషబ్ బస్లాస్ రెండు వికెట్లు తీశాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన పాలమూరు స్ట్రైకర్స్ 19.1 ఓవర్లలో 130 పరుగులకు ఆలౌటైంది. చేసింది. ఓపెనర్ విగ్నేశ్ రెడ్డి (46), షాదాబ్ అహ్మద్ (22) మినహా మిగతావారంతా పెద్దగా రాణించలేదు. అంతేకాదు రంగారెడ్డి రైజర్స్ బౌలర్ద ధాటికి ఇద్దరు బ్యాటర్లు గోల్డెన్ డక్ అయ్యారు. రంగారెడ్డి బౌలర్లలో ఆర్యన్ కరియప్ప 4 వికెట్లతో చెలరేగితే, పున్నయ్య, త్యాగరాజన్ చెరో 2 వికెట్లు తీశారు. ఈ విజయంతో రంగారెడ్డి రైజర్స్ పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది. మరోవైపు మూడో ఓటమితో పాలమూరు ఏడో స్థానానికి పడిపోయింది.Hila daala, miya! 🔥A long stride, a long mane, a fire in his heart, purpose in his game. 💥#PSvRRR #SreenidhiUniversityTG20 #ManaCricketShuru pic.twitter.com/NIfAwpn2pa— tg20official (@tg20official) June 27, 2026He came in red hot, fully charged! 🔋Aryan Cariappa ran in with purpose and bowled with intent, ending with 4️⃣ in his kitty and a Purple Cap on his head.#PSvRRR #SreenidhiUniversityTG20 #ManaCricketShuru pic.twitter.com/pIlJo7NG9h— tg20official (@tg20official) June 27, 2026చదవండి: అదే జరిగితే హర్మన్ సేన ఇంటికే! -
పాలమూరు స్ట్రైకర్స్‌పై రంగారెడ్డి విజయం
టీజీ20 లీగ్‌లో రంగారెడ్డి రైజర్స్ మూడో విజయాన్ని అందుకుంది. శనివారం ఉప్పల్ వేదికగా పాలమూరు స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రంగారెడ్డి రైజర్స్ 6 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. పాలమూరు విధించిన 131 పరుగుల లక్ష్యాన్ని రంగారెడ్డి రైజర్స్ 14 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేధించింది. రంగారెడ్డి ఓపెనర్లు అవనీష్ (50), గ్యానా రెడ్డి (47) ఆరంభం నుంచే ధాటి ఆడి జట్టును విజయపథంలో నడిపించారు. ఈ క్రమంలో గ్యానా రెడ్డి ఔటైనప్పటికీ మరో ఓపెనర్ అవనీష్ అర్ధసెంచరీతో రాణించాడు. అయితే చివర్లో అవనీష్ ఔటైనప్పటికీ ఆదిత్య (7 నాటౌట్), తనయ్ త్యాగరాజన్ (7 నాటౌట్) మిగతా పనిని పూర్తి చేశారు.ఫిఫ్టీ బాదిన వెంటనే అవనీష్ ఔట్.. మూడో వికెట్ డౌన్పాలమూరు స్ట్రైకర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రంగారెడ్డి రైజర్స్ ఓఎనర్ అవనీష్ అర్ధసెంచరీ సాధించాడు. 31 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ అందుకున్న అవనీష్ ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. అయితే ఫిఫ్టీ సాధించిన వెంటనే అవనీష్ పృథ్వీరెడ్డి బౌలింగ్‌లో వెనుదిరిగాడు. దీంతో రంగారెడ్డి 106 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. అంతకముందు ఆరోన్ జార్జ్ (6) రూపంలో రంగారెడ్డి రైజర్స్ రెండో వికెట్ కోల్పోయింది. అంతకముందు 47 పరుగులు చేసిన ఓపెనర్ గ్యానా రెడ్డి బస్లాస్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. రంగారెడ్డి విజయానికి 54 బంతుల్లో 28 పరుగులు కావాలి.దంచుతున్న ఓపెనర్లు.. 7 ఓవర్లలో 77/0పాలమూరు స్ట్రైకర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రంగారెడ్డి స్ట్రైకర్స్ ఓపెనర్లు అదరగొడుతున్నారు. 131 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన రంగారెడ్డి 7 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 77 పరుగులు చేసి విజయం దిశగా సాగుతుంది. గ్నాన్రెడ్డి (39), అవనీష్ (31) పోటీ పడి పరుగులు సాధిస్తున్నారు.ధాటిగా ఆడుతున్న రంగారెడ్డి రైజర్స్131 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రంగారెడ్డి రైజర్స్ ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించింది. 3 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది. ఓపెనర్ గ్నానా రెడ్డి (16 బంతుల్లో 37) ధాటిగా ఆడుతుండగా, అవనీష్ (2) పరుగులతో సహకరిస్తున్నాడు.రంగారెడ్డి రైజర్స్ టార్గెట్ 131 పరుగులురంగారెడ్డి రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాలమూరు స్ట్రైకర్స్ నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. పాలమూరు 19.1 ఓవర్లలో 130 పరుగులకు ఆలౌటైంది. చేసింది. ఓపెనర్ విగ్నేశ్ రెడ్డి (46), షాదాబ్ అహ్మద్ (22) మినహా మిగతావారంతా పెద్దగా రాణించలేదు. అంతేకాదు రంగారెడ్డి రైజర్స్ బౌలర్ద ధాటికి ఇద్దరు బ్యాటర్లు గోల్డెన్ డక్ అయ్యారు. రంగారెడ్డి బౌలర్లలో ఆర్యన్ కరియప్ప 4 వికెట్లతో చెలరేగగా, త్యాగరాజన్, పున్నయ్య చెరో 2 వికెట్లు పడగొట్టారు.నాలుగో వికెట్ డౌన్63 పరుగుల వద్ద పాలమూరు స్ట్రైకర్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 22 పరుగులు చేసిన షాదాబ్ అహ్మద్ రాకేశ్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.మూడో వికెట్ కోల్పోయిన పాలమూరురంగారెడ్డితో మ్యాచ్‌లో పాలమూరు స్ట్రైకర్స్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వస్తోంది. ఏడు పరుగులు చేసిన రోహిత్ రాయుడు కరియప్ప బౌలింగ్‌లో త్యాగరాజన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో పాలమూరు స్ట్రైకర్స్ 31 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది.రెండు పరుగులకే 2 వికెట్లు డౌన్రంగారెడ్డి రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాలమూరు స్ట్రైకర్స్ వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్లో ఓపెనర్ చైతన్యరెడ్డి పున్నయ్య బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇక ఇన్నింగ్స్ రెండో ఓవర్లో కెప్టెన్ ప్రగ్నయ్ రెడ్డి (1) త్యాగరాజన్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో పాలమూరు 2 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.టాస్ గెలిచిన రంగారెడ్డిటీజీ20 లీగ్‌లో భాగంగా ఉప్పల్ వేదికగా శనివారం 13వ మ్యాచ్‌లో పాలమూరు స్ట్రైకర్స్, రంగారెడ్డి రైజర్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. టాస్ గెలిచిన రంగారెడ్డి రైజర్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. రంగారెడ్డి స్ట్రైకర్స్ ఆడిన మూడింటిలో రెండింట విజయంతో పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుంది. మరోవైపు పాలమూరు స్ట్రైకర్స్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒకటి గెలిచి రెండు ఓడి పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో గెలిచి రంగారెడ్డి రైజర్స్ టాప్ 2 స్థానానికి చేరుకోవాలని చూస్తోంది.తుదిజట్లు:పాలమూరు స్ట్రైకర్స్: ప్రగ్నయ్ రెడ్డి (కెప్టెన్, వికెట్ కీపర్), విఘ్నేష్ రెడ్డి, పిఎస్ చైతన్య రెడ్డి, రోహిత్ రాయుడు, ప్రతీక్ పవార్, షాదాబ్ అహ్మద్, మహ్మద్ అఫ్రిది, బుద్ధి తేజ, రిషబ్ బాస్లాస్, రవి కిరణ్, ఎండీ అజారుద్దీన్🚨 PLAYING XI 🚨11 🦁 take the field to hunt their prey and pick up one more win. #PSvRRR #SreenidhiUniversityTG20 #ManaCricketShuru pic.twitter.com/VcknsEKfkZ— tg20official (@tg20official) June 27, 2026రంగారెడ్డి రైజర్స్: తనయ్ త్యాగరాజన్ (కెప్టెన్), ఆరోన్ జార్జ్, ఆరవెల్లి అవనీష్ (వికెట్ కీపర్), అలంకృత్ రాపోల్, జ్ఞాన రెడ్డి, ఆదిత్య జవ్వాజీ, నితిన్ సాయి యాదవ్, నానావత్ రాకేష్, అరుణ్ కుమార్, బి పున్నయ్య, ఆర్యన్ కరియప్ప🚨 PLAYING XI 🚨👕 The Risers faced a setback but name a squad that's up for the challenge and ready to push for a win! 💪#PSvRRR #SreenidhiUniversityTG20 #ManaCricketShuru pic.twitter.com/A2ddSNMEuD— tg20official (@tg20official) June 27, 2026 -
సత్తా చాటిన రాయుడు.. మెదక్‌పై పాలమూరు గెలుపు
టీజీ20 లీగ్ 2026లో ఇవాళ (జూన్ 25) రాత్రి జరిగిన మ్యాచ్‌లో మెదక్ ఫాల్కన్స్‌పై పాలమూరు స్ట్రయికర్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మెదక్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. విక్రమ్ నాయక్, వరుణ్ యెర్రం తలో 36 పరుగులు చేయడంతో మెదక్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.మిగతా బ్యాటర్లలో శృంజిత్ రెడ్డి (19), నమన్ అగర్వాల్ (21), అశ్విన్ రామ్ (12 రిటైర్డ్ ఔట్), రవితేజ (13) రెండంకెల స్కోర్లు చేశారు. పాలమూరు బౌలర్లలో రవి కిరణ్, రిషబ్ చెరో 2 వికెట్లు తీయగా.. అఫ్రిది, తేజ, రోహిత్ రాయుడు తలో వికెట్ పడగొట్టారు.165 పరుగుల లక్ష్య ఛేదనలో పాలమూరు స్ట్రయికర్స్ ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయినప్పటికీ.. రోహిత్ రాయుడు (54) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో ఆదుకున్నాడు. బుడిది తేజ (23), ప్రతీక్ పవార్ (27 నాటౌట్) సహకారంతో పాలమూరును విజయతీరాలకు చేర్చారు. రాయుడు, పవార్ సత్తా చాటడంతో పాలమూరు జట్టు 17.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మెదక్ బౌలర్లలో వరుణ్ యెర్రం 2, ఘజా అబ్బాస్, శృంజిత్ రెడ్డి, రవితేజ తలో వికెట్ తీశారు. -
మెదక్‌పై పాలమూరు గెలుపు
ఆదిలోనే పాలమూరుకు షాక్165 పరుగుల లక్ష్య ఛేదనలో పాలమూరు స్ట్రయికర్స్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. రెండో బంతికే కరణ్ యాదవ్ (0), మూడో ఓవర్ నాలుగో బంతికి ప్రజ్ఞయ్ రెడ్డి (15) ఔటయ్యారు. రెండు వికెట్లు యెర్రం వరుణ్‌కే దక్కాయి. 3 ఓవర్ల తర్వాత పాలమూరు స్కోర్ 18-2గా ఉంది. పాలమూరు టార్గెట్ 165టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన మెదక్ ఫాల్కన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. విక్రమ్ నాయక్, వరుణ్ యెర్రం తలో 36 పరుగులు చేయడంతో మెదక్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. మిగతా బ్యాటర్లలో శృంజిత్ రెడ్డి (19), నమన్ అగర్వాల్ (21), అశ్విన్ రామ్ (12 రిటైర్డ్ ఔట్), రవితేజ (13) రెండంకెల స్కోర్లు చేశారు. పాలమూరు బౌలర్లలో రవి కిరణ్, రిషబ్ చెరో 2 వికెట్లు తీయగా.. అఫ్రిది, తేజ, రోహిత్ రాయుడు తలో వికెట్ పడగొట్టారు. కష్టాల్లో మెదక్మెదక్ జట్టు ఒకే ఓవర్లో 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అశ్విన్ రామ్ (12) రిటైర్డ్ ఔట్ కాగా.. శృంజిత్ రెడ్డి (19) తేజ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 8 ఓవర్ల తర్వాత మెదక్ స్కోర్ 58-4గా ఉంది. రెండో వికెట్ కోల్పోయిన మెదక్3.4వ ఓవర్- 36 పరుగుల వద్ద మెదక్ రెండో వికెట్ కోల్పోయింది. రవి కిరణ్ బౌలింగ్‌లో నమన్ అగర్వాల్ (21) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తొలి ఓవర్లోనే మెదక్‌కు షాక్మెదక్ ఫాల్కన్స్‌కు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. రవి కిరణ్ బౌలింగ్‌లో పవార్‌కు క్యాచ్ ఇచ్చి సాయి కాకులమర్రి (1) ఔటయ్యాడు.టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాలమూరు స్ట్రయికర్స్టీజీ20 లీగ్ 2026లో భాగంగా ఇవాళ (జూన్ 25) జరుగుతున్న తొమ్మిదో మ్యాచ్‌లో పాలమూరు స్ట్రయికర్స్, మెదక్ ఫాల్కన్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో పాలమూరు జట్టు టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. -
హైదరాబాద్‌కు తొలి గెలుపు
తెలంగాణ టీ20 లీగ్-2026లో హైదరాబాద్ ఇ- ఛాంపియన్స్ జట్టు తొలి మ్యాచ్‌లోనే విజయాన్ని నమోదు చేసింది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్డేడియం వేదికగా ఇవాళ (జూన్ 23) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో పాలమూరు స్ట్రయికర్స్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన హైదరాబాద్.. పాలమూరు జట్టును 19.4 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌట్ చేసింది. అనుముల విఘ్నేశ్ రెడ్డి (30), రోహిత్ రాయుడు (35), ప్రతీక్ పవార్ (30) ఓ మోస్తరు స్కోర్లతో రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో అజయ్ దేవ్ గౌడ్ నాలుగు వికెట్లు తీయగా.. యశ్వీర్ గౌడ్, ప్రణవ్ వర్మ చెరో రెండు, శ్రీనికేత్ ఒక వికెట్ పడగొట్టారు.అనంతరం 142 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన హైదరాబాద్ జట్టు 15.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి, ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. ఓపెనర్ అభిరథ్ రెడ్డి 35 పరుగులు చేసి శుభారంభం అందించగా.. అన్విత్ రెడ్డి (53 నాటౌట్), గడుగు గణేశ్ (50 నాటౌట్) అర్ద సెంచరీలతో సత్తా చాటారు. పాలమూరు బౌలర్లలో రిషబ్ బస్లాస్ 2, రవి కిరణ్ ఓ వికెట్ తీశారు. -
పాపం పాలమూరు.. వరుసగా రెండో ఓటమి
తెలంగాణ టీ20 లీగ్-2026లో భాగంగా పాలమూరు స్ట్రైకర్స్- హైదరాబాద్ ఇ- చాంపియన్స్ మంగళవారం తలపడుతున్నాయి. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్డేడియంలో టాస్ గెలిచిన హైదరాబాద్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో పాలమూరు బ్యాటింగ్‌కు దిగింది. పాలమూరు ఆలౌట్హైదరాబాద్ బౌలర్ల ధాటికి పాలమూరు 19.4 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌట్ అయింది. అనుముల విఘ్నేశ్ రెడ్డి (30), రోహిత్ రాయుడు (35), ప్రతీక్ పవార్ (30) ఓ మోస్తరుగా రాణించారు. హైదాబాద్ బౌలర్లలో అజయ్ దేవ్ గౌడ్ నాలుగు వికెట్లు తీయగా.. యశ్వీర్ గౌడ్, ప్రణవ్ వర్మ చెరో రెండు, శ్రీనికేత్ ఒక వికెట్ పడగొట్టారు. హైదరాబాద్ గెలుపునామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్.. 15.4 ఓవర్లలో పనిపూర్తి చేసింది. కేవలం మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి తొలి గెలుపు నమోదు చేసింది. ఓపెనర్, కెప్టెన్ అభిరథ్ రెడ్డి 35 పరుగులు చేయగా.. అన్విత్ రెడ్డి (53 నాటౌట్), గడుగు గణేశ్ (50 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. పాలమూరు బౌలర్లలో రిషభ్ బస్లాస్ రెండు, రవి కిరణ్ ఒక వికెట్ పడగొట్టారు. కాగా సీజన్ ఆరంభ మ్యాచ్‌లో పాలమూరు ఖమ్మం ఏసెస్ చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే.తుదిజట్లుపాలమూరుఅనుముల విజ్ఞేశ్ రెడ్డి, పృథ్వీ రెడ్డి, ప్రజ్ఞయ్ రెడ్డి (కెప్టెన్), రోహిత్ రాయుడు, నిశాంత్ సేన్ రెడ్డి సీహెచ్, ప్రతీక్ పవార్, మహ్మద్ ఆఫ్రిది అహ్మద్, నిపుణ్ రెడ్డి శవ్వా, రిషభ్ బస్లాస్, కిరణ్, జంబోజు పార్దీబన్.హైదరాబాద్హైదరాబాద్అభిరథ్ రెడ్డి మందాడి (కెప్టెన్), ప్రణవ్ వర్మ, అరవింద్ (వికెట్ కీపర్), సాయి వికాస్ రెడ్డి, శ్రీనికేత్, షణ్ముఖ, అఖిల్ రాథోడ్, గడుగు గణేశ్, అన్విత్ రెడ్డి, అజయ్ దేవ్ గౌడ్, యశ్వీర్ గౌడ్. -
TG20 League: అన్విత ఖమ్మం ఏసెస్ శుభారంభం
తెలంగాణ టీ20 లీగ్ 2026లో అన్విత ఖమ్మం ఏసెస్ శుభారంభం చేసింది. ఉప్పల్ మైదానం వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో పాలమూరు స్ట్రైకర్స్‌పై 20పరుగుల తేడాతో ఖమ్మం ఘన విజయం సాధించింది. 238 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాలమూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. పాలమూరు బ్యాటర్లలో ఓపెనర్ విగ్నేష్ రెడ్డి(31 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 86) టాప్ స్కోరర్‌గా నిలవగా.. చైతన్య రెడ్డి(35) పర్వాలేదనిపించాడు. మిగితా బ్యాటర్లంతా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. ఖమ్మం బౌలర్లలో వేద్‌రెడ్డి రెండు, మిలింద్, వెంకట్, విద్యానంద రెడ్డి తలా వికెట్ సాధించారు.కాగా తొలుత బ్యాటింగ్ చేసిన ఖమ్మం జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 237 పరుగుల భారీ స్కోర్ సాధించింది.ఏసెస్ బ్యాటర్లలో ఓపెనర్ వాఫీ ఖచ్చి(60), కృష్ణ రెడ్డి(52), హిమతేజ(59) హాఫ్ సెంచరీలతో సత్తాచాటగా.. కెప్టెన్ మిలంద్(18, ప్రతీక్ రెడ్డి(25) రాణించారు. పాలమూర్ బౌలర్లలో కిరణ్ రెండు, రోహిత్ రాయుడు, అఫ్రిది అహ్మద్ తలా వికెట్ పడగొట్టారు.Juggling act but safe hands! 😮💨Inches away from the boundary rope, Vidyananda Reddy Ellala recovers well to dismiss the opposition skipper.#PSvANK #SreenidhiUniversityTG20 #ManaCricketShuru pic.twitter.com/G64zKnQpUw— tg20official (@tg20official) June 21, 2026 -
పాలమూరు స్ట్రైకర్స్‌పై ఖమ్మం ఘన విజయం
Palamuru Strikers vs Anvita Khammam Aces Live Updates:. తెలంగాణ టీ20 లీగ్ 2026లో అన్విత ఖమ్మం ఏసెస్ శుభారంభం చేసింది. ఉప్పల్ మైదానం వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో పాలమూరు స్ట్రైకర్స్‌పై 20పరుగుల తేడాతో ఖమ్మం ఘన విజయం సాధించింది. 238 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాలమూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. పాలమూరు బ్యాటర్లలో ఓపెనర్ విగ్నేష్ రెడ్డి(31 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 86) టాప్ స్కోరర్‌గా నిలవగా.. చైతన్య రెడ్డి(35) పర్వాలేదనిపించాడు. మిగితా బ్యాటర్లంతా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. ఖమ్మం బౌలర్లలో వేద్‌రెడ్డి రెండు, మిలింద్, వెంకట్, విద్యానంద రెడ్డి తలా వికెట్ సాధించారు.పాలమూరు ఐదో వికెట్ డౌన్పాలమూరు ఐదో వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన ప్రతీక్ పవార్.. మిలింద్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 17 ఓవర్లకు పాలమూరు స్కోర్: 190/5. పాలమూరు విజయానికి 18 బంతుల్లో 48 పరుగులు కావాలి.పాలమూరు మూడో వికెట్ డౌన్35 పరుగులు చేసిన చైతన్య రెడ్డి.. రనౌట్ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. 14 ఓవర్లకు పాలమూర్ స్కోర్: 167/3పాలమూరు రెండో వికెట్ డౌన్పాలమూరు రెండో వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన ప్రజ్ఞయ్ రెడ్డి.. వేద్‌రెడ్డి బౌలింగ్‌లో ఔటయ్యాడు.పాలమూరు తొలి వికెట్ డౌన్పాలమూరు తొలి వికెట్ కోల్పోయింది. 86 పరుగులు చేసిన విగ్నేష్ రెడ్డి.. వేద్‌రెడ్డి బౌలింగ్‌లో ఔటయ్యాడు. 10 ఓవర్లకు పాలమూరు స్కోర్: 133/1దూకుడుగా ఆడుతున్న పాలమూరు ఓపెనర్లు238 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాలమూరు స్ట్రైకర్స్ ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. 4 ఓవర్లు ముగిసే సరికి పాలమూరు వికెట్ నష్టపోకుండా 56 పరుగులు చేసింది. క్రీజులో అనుముల విగ్నేష్ రెడ్డి(45), చైతన్య రెడ్డి(7) ఉన్నారు.పాలమూరు టార్గెట్ ఎంతంటే?పాలమూరు స్ట్రైకర్స్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో అన్విత ఖమ్మం ఏసెస్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఖమ్మం జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 237 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఏసెస్ బ్యాటర్లలో ఓపెనర్ వాఫీ ఖచ్చి(60), కృష్ణ రెడ్డి(52), హిమతేజ(59) హాఫ్ సెంచరీలతో సత్తాచాటగా.. కెప్టెన్ మిలంద్(18, ప్రతీక్ రెడ్డి(25) రాణించారు. పాలమూర్ బౌలర్లలో కిరణ్ రెండు, రోహిత్ రాయుడు, అఫ్రిది అహ్మద్ తలా వికెట్ పడగొట్టారు.GSK aale aale, nahi khelte hai haule haule! 🥵Three 6️⃣s in an over that gave the #AnvitaKhammamAces the very start they needed. 🔥#PSvANK #SreenidhiUniversityTG20 #ManaCricketShuru pic.twitter.com/67iEuethQs— tg20official (@tg20official) June 21, 2026మూడో వికెట్ డౌన్ఖమ్మం జట్టు మూడో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన జైశ్వాల్.. అఫ్రిది అహ్మద్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 14 ఓవర్లకు స్కోర్: 150/3ఖమ్మం రెండో వికెట్ డౌన్ఖమ్మం ఏసెస్ జట్టు రెండో వికెట్ కోల్పోయింది. 52 పరుగులు చేసిన కృష్ణ రెడ్డి.. రోహిత్ రాయుడు బౌలింగ్‌లో ఔటయ్యాడు. 12 ఓవర్లకు ఏసెస్ స్కోర్: 141/2ఖమ్మం ఏసెస్ తొలి వికెట్ డౌన్అన్విత ఖమ్మం ఏసెస్ తొలి వికెట్ కోల్పోయింది. 60 పరుగులు చేసిన వాఫీ కచ్చీ.. నిపుణ్ రెడ్డి శవ్వా బౌలింగ్ ఔటయ్యాడు. 10 ఓవర్లకు ఏసెస్ స్కోర్: 113/1దుమ్ములేపుతున్న ఖమ్మం ఓపెనర్లుఅన్విత ఖమ్మం ఏసెస్ ఓపెనర్లు కృష్ణ రెడ్డి(18 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లతో 30), వాఫీ కచ్చీ(24 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్‌తో 52) దుమ్ములేపుతున్నారు. 7 ఓవర్లకు ఖమ్మం ఏసెస్ స్కోర్: 86/0తెలంగాణ టీ20 లీగ్ తొలి సీజన్‌కు తెరలేచింది. ఈ టోర్నీ మొదటి మ్యాచ్‌లో ఉప్పల్ మైదానం వేదికగా పాలమూరు స్ట్రైకర్స్, అన్విత ఖమ్మం ఏసెస్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాలమూరు తొలుత బౌలింగ్ ఎంచుకుంది.తుది జట్లుఖమ్మం ఏసెస్కృష్ణ రెడ్డి, వాఫీ కచ్చీ, మిలింద్(కెప్టెన్), జైశ్వాల్, హిమతేజ, వెంకట్ ధాత్రక్, సిద్దు నాయక్,విశాల్ యాదవ్, వేద్ రెడ్డి అమిష్టాపురం, విద్యా నంద రెడ్డి, అనంత్ ప్రతీక్ రెడ్డిపాలమూరు స్ట్రైకర్స్అన్ముల విఘ్నేష్ రెడ్డి, ప్రజ్ఞయ్ రెడ్డి(కెప్టెన్), పృథ్వీ రెడ్డి, రోహిత్ రాయుడు, ప్రతీక్ పవార్, మహమ్మద్ అఫ్రీది అహ్మద్, నిపుణ్ రెడ్డి శవ్వా, బుడిది రతన్ తేజ, పి.ఎస్. చైతన్య రెడ్డి, జంబోజు పార్థిపన్, రవి కిరణ్ మజేటి


