టీజీ20 లీగ్‌లో రంగారెడ్డి రైజర్స్ మూడో విజయాన్ని అందుకుంది. శనివారం ఉప్పల్ వేదికగా పాలమూరు స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రంగారెడ్డి రైజర్స్ 6 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. పాలమూరు విధించిన 131 పరుగుల లక్ష్యాన్ని రంగారెడ్డి రైజర్స్ 14 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేధించింది.
రంగారెడ్డి ఓపెనర్లు అవనీష్ (50), గ్యానా రెడ్డి (47) ఆరంభం నుంచే ధాటి ఆడి జట్టును విజయపథంలో నడిపించారు. ఈ క్రమంలో గ్యానా రెడ్డి ఔటైనప్పటికీ మరో ఓపెనర్ అవనీష్ అర్ధసెంచరీతో రాణించాడు. అయితే చివర్లో అవనీష్ ఔటైనప్పటికీ ఆదిత్య (7 నాటౌట్), తనయ్ త్యాగరాజన్ (7 నాటౌట్) మిగతా పనిని పూర్తి చేశారు. పాలమూరు బౌలర్ రిషబ్ బస్లాస్ రెండు వికెట్లు తీశాడు.
అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన పాలమూరు స్ట్రైకర్స్ 19.1 ఓవర్లలో 130 పరుగులకు ఆలౌటైంది. చేసింది. ఓపెనర్ విగ్నేశ్ రెడ్డి (46), షాదాబ్ అహ్మద్ (22) మినహా మిగతావారంతా పెద్దగా రాణించలేదు. అంతేకాదు రంగారెడ్డి రైజర్స్ బౌలర్ద ధాటికి ఇద్దరు బ్యాటర్లు గోల్డెన్ డక్ అయ్యారు. రంగారెడ్డి బౌలర్లలో ఆర్యన్ కరియప్ప 4 వికెట్లతో చెలరేగితే, పున్నయ్య, త్యాగరాజన్ చెరో 2 వికెట్లు తీశారు. ఈ విజయంతో రంగారెడ్డి రైజర్స్ పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది. మరోవైపు మూడో ఓటమితో పాలమూరు ఏడో స్థానానికి పడిపోయింది.
Hila daala, miya! 🔥
A long stride, a long mane, a fire in his heart, purpose in his game. 💥#PSvRRR #SreenidhiUniversityTG20 #ManaCricketShuru pic.twitter.com/NIfAwpn2pa— tg20official (@tg20official) June 27, 2026
He came in red hot, fully charged! 🔋
Aryan Cariappa ran in with purpose and bowled with intent, ending with 4️⃣ in his kitty and a Purple Cap on his head.#PSvRRR #SreenidhiUniversityTG20 #ManaCricketShuru pic.twitter.com/pIlJo7NG9h— tg20official (@tg20official) June 27, 2026
చదవండి: అదే జరిగితే హర్మన్ సేన ఇంటికే!


