సత్తా చాటిన రాయుడు.. మెదక్‌పై పాలమూరు గెలుపు | TG20 League 2026: Palamuru Strikers beat Medak Falcons by 5 wickets | Sakshi
Sakshi News home page

సత్తా చాటిన రాయుడు.. మెదక్‌పై పాలమూరు గెలుపు

Jun 25 2026 10:55 PM | Updated on Jun 25 2026 10:58 PM

TG20 League 2026: Palamuru Strikers beat Medak Falcons by 5 wickets

టీజీ20 లీగ్‌ 2026లో ఇవాళ (జూన్‌ 25) రాత్రి జరిగిన మ్యాచ్‌లో మెదక్‌ ఫాల్కన్స్‌పై పాలమూరు స్ట్రయికర్స్‌ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన మెదక్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. విక్రమ్‌ నాయక్‌, వరుణ్‌ యెర్రం తలో 36 పరుగులు చేయడంతో మెదక్‌ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.

మిగతా బ్యాటర్లలో శృంజిత్‌ రెడ్డి (19), నమన్‌ అగర్వాల్‌ (21), అశ్విన్‌ రామ్‌ (12 రిటైర్డ్‌ ఔట్‌), రవితేజ (13) రెండంకెల స్కోర్లు చేశారు. పాలమూరు బౌలర్లలో రవి కిరణ్‌, రిషబ్‌ చెరో 2 వికెట్లు తీయగా.. అఫ్రిది, తేజ, రోహిత్‌ రాయుడు తలో వికెట్‌ పడగొట్టారు.

165 పరుగుల లక్ష్య ఛేదనలో పాలమూరు స్ట్రయికర్స్‌ ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయినప్పటికీ.. రోహిత్‌ రాయుడు (54) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో ఆదుకున్నాడు. బుడిది తేజ (23), ప్రతీక్‌ పవార్‌ (27 నాటౌట్‌) సహకారంతో పాలమూరును విజయతీరాలకు చేర్చారు. రాయుడు, పవార్‌ సత్తా చాటడంతో పాలమూరు జట్టు 17.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మెదక్‌ బౌలర్లలో వరుణ్‌ యెర్రం​ 2, ఘజా అబ్బాస్‌, శృంజిత్‌ రెడ్డి, రవితేజ తలో వికెట్‌ తీశారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement