టీజీ20 లీగ్‌లో రంగారెడ్డి రైజర్స్ మూడో విజయాన్ని అందుకుంది. శనివారం ఉప్పల్ వేదికగా పాలమూరు స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రంగారెడ్డి రైజర్స్ 6 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. పాలమూరు విధించిన 131 పరుగుల లక్ష్యాన్ని రంగారెడ్డి రైజర్స్ 14 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేధించింది. రంగారెడ్డి ఓపెనర్లు అవనీష్ (50), గ్యానా రెడ్డి (47) ఆరంభం నుంచే ధాటి ఆడి జట్టును విజయపథంలో నడిపించారు. ఈ క్రమంలో గ్యానా రెడ్డి ఔటైనప్పటికీ మరో ఓపెనర్ అవనీష్ అర్ధసెంచరీతో రాణించాడు. అయితే చివర్లో అవనీష్ ఔటైనప్పటికీ ఆదిత్య (7 నాటౌట్), తనయ్ త్యాగరాజన్ (7 నాటౌట్) మిగతా పనిని పూర్తి చేశారు.
ఫిఫ్టీ బాదిన వెంటనే అవనీష్ ఔట్.. మూడో వికెట్ డౌన్
పాలమూరు స్ట్రైకర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రంగారెడ్డి రైజర్స్ ఓఎనర్ అవనీష్ అర్ధసెంచరీ సాధించాడు. 31 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ అందుకున్న అవనీష్ ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. అయితే ఫిఫ్టీ సాధించిన వెంటనే అవనీష్ పృథ్వీరెడ్డి బౌలింగ్‌లో వెనుదిరిగాడు. దీంతో రంగారెడ్డి 106 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది.
అంతకముందు ఆరోన్ జార్జ్ (6) రూపంలో రంగారెడ్డి రైజర్స్ రెండో వికెట్ కోల్పోయింది. అంతకముందు 47 పరుగులు చేసిన ఓపెనర్ గ్యానా రెడ్డి బస్లాస్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. రంగారెడ్డి విజయానికి 54 బంతుల్లో 28 పరుగులు కావాలి.
దంచుతున్న ఓపెనర్లు.. 7 ఓవర్లలో 77/0
పాలమూరు స్ట్రైకర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రంగారెడ్డి స్ట్రైకర్స్ ఓపెనర్లు అదరగొడుతున్నారు. 131 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన రంగారెడ్డి 7 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 77 పరుగులు చేసి విజయం దిశగా సాగుతుంది. గ్నాన్‌రెడ్డి (39), అవనీష్ (31) పోటీ పడి పరుగులు సాధిస్తున్నారు.
ధాటిగా ఆడుతున్న రంగారెడ్డి రైజర్స్
131 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రంగారెడ్డి రైజర్స్ ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించింది. 3 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది. ఓపెనర్ గ్నానా రెడ్డి (16 బంతుల్లో 37) ధాటిగా ఆడుతుండగా, అవనీష్ (2) పరుగులతో సహకరిస్తున్నాడు.
రంగారెడ్డి రైజర్స్ టార్గెట్ 131 పరుగులు
రంగారెడ్డి రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాలమూరు స్ట్రైకర్స్ నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. పాలమూరు 19.1 ఓవర్లలో 130 పరుగులకు ఆలౌటైంది. చేసింది. ఓపెనర్ విగ్నేశ్ రెడ్డి (46), షాదాబ్ అహ్మద్ (22) మినహా మిగతావారంతా పెద్దగా రాణించలేదు. అంతేకాదు రంగారెడ్డి రైజర్స్ బౌలర్ద ధాటికి ఇద్దరు బ్యాటర్లు గోల్డెన్ డక్ అయ్యారు. రంగారెడ్డి బౌలర్లలో ఆర్యన్ కరియప్ప 4 వికెట్లతో చెలరేగగా, త్యాగరాజన్, పున్నయ్య చెరో 2 వికెట్లు పడగొట్టారు.
నాలుగో వికెట్ డౌన్
63 పరుగుల వద్ద పాలమూరు స్ట్రైకర్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 22 పరుగులు చేసిన షాదాబ్ అహ్మద్ రాకేశ్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.
మూడో వికెట్ కోల్పోయిన పాలమూరు
రంగారెడ్డితో మ్యాచ్‌లో పాలమూరు స్ట్రైకర్స్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వస్తోంది. ఏడు పరుగులు చేసిన రోహిత్ రాయుడు కరియప్ప బౌలింగ్‌లో త్యాగరాజన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో పాలమూరు స్ట్రైకర్స్ 31 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది.
రెండు పరుగులకే 2 వికెట్లు డౌన్
రంగారెడ్డి రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాలమూరు స్ట్రైకర్స్ వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్‌లో ఓపెనర్ చైతన్యరెడ్డి పున్నయ్య బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇక ఇన్నింగ్స్ రెండో ఓవర్లో కెప్టెన్ ప్రగ్నయ్ రెడ్డి (1) త్యాగరాజన్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో పాలమూరు 2 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
టాస్ గెలిచిన రంగారెడ్డి
టీజీ20 లీగ్‌లో భాగంగా ఉప్పల్ వేదికగా శనివారం 13వ మ్యాచ్‌లో పాలమూరు స్ట్రైకర్స్, రంగారెడ్డి రైజర్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. టాస్ గెలిచిన రంగారెడ్డి రైజర్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. రంగారెడ్డి స్ట్రైకర్స్ ఆడిన మూడింటిలో రెండింట విజయంతో పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుంది. మరోవైపు పాలమూరు స్ట్రైకర్స్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒకటి గెలిచి రెండు ఓడి పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో గెలిచి రంగారెడ్డి రైజర్స్ టాప్ 2 స్థానానికి చేరుకోవాలని చూస్తోంది.
తుదిజట్లు:
పాలమూరు స్ట్రైకర్స్: ప్రగ్నయ్ రెడ్డి (కెప్టెన్, వికెట్ కీపర్), విఘ్నేష్ రెడ్డి, పిఎస్ చైతన్య రెడ్డి, రోహిత్ రాయుడు, ప్రతీక్ పవార్, షాదాబ్ అహ్మద్, మహ్మద్ అఫ్రిది, బుద్ధి తేజ, రిషబ్ బాస్లాస్, రవి కిరణ్, ఎండీ అజారుద్దీన్
🚨 PLAYING XI 🚨
11 🦁 take the field to hunt their prey and pick up one more win. #PSvRRR #SreenidhiUniversityTG20 #ManaCricketShuru pic.twitter.com/VcknsEKfkZ— tg20official (@tg20official) June 27, 2026
రంగారెడ్డి రైజర్స్: తనయ్ త్యాగరాజన్ (కెప్టెన్), ఆరోన్ జార్జ్, ఆరవెల్లి అవనీష్ (వికెట్ కీపర్), అలంకృత్ రాపోల్, జ్ఞాన రెడ్డి, ఆదిత్య జవ్వాజీ, నితిన్ సాయి యాదవ్, నానావత్ రాకేష్, అరుణ్ కుమార్, బి పున్నయ్య, ఆర్యన్ కరియప్ప
🚨 PLAYING XI 🚨
👕 The Risers faced a setback but name a squad that's up for the challenge and ready to push for a win! 💪#PSvRRR #SreenidhiUniversityTG20 #ManaCricketShuru pic.twitter.com/A2ddSNMEuD— tg20official (@tg20official) June 27, 2026


