నల్గొండ నైట్స్ హ్యాట్రిక్‌ విజయం | Anurag Nalgonda Knights Beat Palamuru Strikers by 6 wickets | Sakshi
Sakshi News home page

TG20: నల్గొండ నైట్స్ హ్యాట్రిక్‌ విజయం

Jun 29 2026 5:49 PM | Updated on Jun 29 2026 6:02 PM

Anurag Nalgonda Knights Beat Palamuru Strikers by 6 wickets

తెలంగాణ టీ20 లీగ్‌-2026లో అనురాగ్ నల్గొండ నైట్స్ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. ఈ టోర్నీలో భాగంగా సోమవారం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాలమూరు స్ట్రైకర్స్‌ను 6 వికెట్ల తేడాతో నల్గొండ చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాలమూరు స్ట్రైకర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 148 పరుగుల నామ మాత్రపు స్కోర్ సాధించింది. 

పాలమూరు ఇన్నింగ్స్‌లో కెప్టెన్ ప్రజ్ఞయ్ రెడ్డి (55), బుడిది తేజ (50) హాఫ్ సెంచరీలతో రాణించగా.. మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. నల్గొండ నైట్స్ బౌలర్లలో అర్ఫాజ్ అహ్మద్ మహమ్మద్ మూడు వికెట్లు పడగొట్టగా.. నిశాంత్‌ రెండు, అనికేత్‌, దివేష్‌ తలా వికెట్‌ సాధించారు. 

అనంతరం 149 పరుగుల లక్ష్యాన్ని నల్గొండ జట్టు కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 15.2 ఓవర్లలో ఊదిపడేసింది. నల్గొండ మిడిలార్డర్ బ్యాటర్‌ రాహుల్‌ బుద్ది(68) అజేయంగా నిలిచి మ్యాచ్‌ ఫినిష్‌ చేశాడు. ఈ విజయంతో  నల్గొండ నైట్స్ జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్ధానానికి చేరుకుంది.
చదవండి: IND vs IRE: భారత్‌పై ఘన విజయం.. ఐర్లాండ్‌కు భారీ షాక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement