భారత్‌పై ఘన విజయం.. ఐర్లాండ్‌కు భారీ షాక్‌ | Ireland Head Coach Steps Down After Giving Nightmare To Gautam Gambhir's India | Sakshi
Sakshi News home page

IND vs IRE: భారత్‌పై ఘన విజయం.. ఐర్లాండ్‌కు భారీ షాక్‌

Jun 29 2026 5:00 PM | Updated on Jun 29 2026 5:25 PM

Ireland Head Coach Steps Down After Giving Nightmare To Gautam Gambhir's India

స్వదేశంలో టీమిండియాపై 2-0 తేడాతో టీ20 సిరీస్‌ను సొంతం చేసుకుని 24 గంట‌ల తిర‌గ‌కముందే ఐర్లాండ్‌కు భారీ షాక్ త‌గిలింది. ఆ జ‌ట్టు హెడ్ కోచ్ హెన్రిచ్ మలాన్ తన పదవికి రాజీనామా చేశారు. వ‌చ్చే ఏడాది ఆరంభం వ‌ర‌కు తన ప‌దవీ కాలం ఉన్న‌ప్ప‌టికి, వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మలాన్ తెలిపారు. కొత్త కోచ్‌కు జట్టు బాధ్యతలు అప్పగించడానికి ఇదే సరైన సమయమని అతడు పేర్కొన్నాడు.  

గత రెండు వన్డే ప్రపంచకప్‌లకు అర్హత సాధించలేకపోయిన ఐర్లాండ్ జట్టు, ఈసారి ఎలాగైనా వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో బరిలోకి దిగాలని పట్టుదలగా ఉంది. ప్రస్తుతం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో ఐర్లాండ్ 11వ స్ధానంలో ఉంది. 

ఆతిథ్య దేశాలైన సౌతాఫ్రికా, జింబాబ్వేలతో పాటు టాప్-8 స్థానాల్లో ఉన్న జట్లకు మాత్రమే ప్రపంచకప్‌కు నేరుగా అర్హత లభిస్తుంది. మిగిలిన నాలుగు స్థానాల కోసం క్వాలిఫైయర్స్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కొత్త కోచ్ ఆధ్వర్యంలో జట్టును ప్రపంచకప్‌కు సిద్ధం చేయాలని ఐర్లాండ్ భావిస్తోంది.

కాగా హెన్రిచ్ మలాన్ హయంలో ఐర్లాండ్ ఎన్నో అద్భుత విజయాలను అందించింది. వరుసగా మూడు టీ20 ప్రపంచకప్‌లకు ఐరీష్ జట్టు క్వాలిఫై అయింది. 2022 టీ20 ప్రపంచకప్‌లో మెల్‌బోర్న్ వేదికగా ఇంగ్లండ్‌ను ఓడించి ఐర్లాండ్ సంచలనం సృష్టించింది.

అంతేకాకుండా అతడి నేతృత్వంలోనే పాకిస్తాన్, వెస్టిండీస్, సౌతాఫ్రికా వంటి బలమైన జట్లను కూడా ఐర్లాండ్ మట్టికరిపించింది. ఇప్పుడు వరల్డ్ నంబర్ వన్ టీ20 జట్టు అయిన టీమిండియాను ఓడించి సరికొత్త చరిత్ర సృష్టించింది.
చదవండి: 'వారిని తప్పు పట్టడం సరికాదు.. కానీ ఐర్లాండ్‌ మాత్రం అద్భుతం'

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement