'వారిని తప్పు పట్టడం సరికాదు.. కానీ ఐర్లాండ్‌ మాత్రం అద్భుతం' | India outsmarted by Ireland, says Ryan ten Doeschate after humiliating series defeat | Sakshi
Sakshi News home page

'వారిని తప్పు పట్టడం సరికాదు.. కానీ ఐర్లాండ్‌ మాత్రం అద్భుతం'

Jun 29 2026 3:46 PM | Updated on Jun 29 2026 4:28 PM

India outsmarted by Ireland, says Ryan ten Doeschate after humiliating series defeat

గత రెండేళ్లుగా అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో తిరుగులేని శక్తిగా దూసుకుపోతున్న టీమిండియాకు పసి కూన ఐర్లాండ్ ఊహించని షాకిచ్చింది. తమ సొంత గడ్డపై జరిగిన రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్‌ను ఐర్లాండ్ క్లీన్‌స్వీప్ చేసింది. పాల్ స్టిర్లింగ్‌, మార్క్ అడైర్, కర్టిస్ కాంఫర్, జోష్ లిటిల్ వంటి సీనియర్లు లేనప్పటికి యువ ఆటగాళ్లతో కూడిన ఐరీష్ జట్టు పటిష్టమైన టీమిండియాను రెండు మ్యాచ్‌లలోనూ చిత్తు చేసింది.

ఐర్లాండ్ వంటి చిన్న జట్టు చేతిలో ఓడిపోవడాన్ని భారత అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఐర్లాండ్ టూర్‌లో భార‌త బ్యాటింగ్ యూనిట్ ఘోరంగా విఫ‌ల‌మైంది. ముఖ్యంగా కొత్త కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్‌, టీ20 ప్రపంచ‌క‌ప్ హీరో సంజూ శాంస‌న్ ఏ మాత్రం ప్రభావం చూప‌లేక‌పోయారు.  అయితే ఈ ఘోర ప‌రాభావం త‌ర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో నెల‌కొన్న ప‌రిస్థితి గురుంచి భార‌త అసిస్టెంట్ కోచ్ ర్యాన్ డెష్కాట్ వివ‌రించాడు. ఈ ఓట‌మి తామ‌ని తీవ్ర నిరాశ‌ప‌రిచంద‌ని అత‌డు చెప్పుకొచ్చాడు.

"మా ఆట‌గాళ్లంతా తీవ్ర నిరాశ‌లో ఉన్నారు. ఇది నిజంగా నమ్మలేని పరిస్థితి. ఈ ఒక్క ఓట‌మి కార‌ణంగా ఆట‌గాళ్లను విమర్శించ‌డం స‌రికాదు. వారంతా వ‌ర‌ల్డ్‌క‌ప్ గెలిచిన జ‌ట్టులో స‌భ్యులు. అయితే ఈ సిరీస్‌లో మా ప్ర‌ణాళిక‌ల‌ను స‌రిగ్గా అమ‌లు చేయ‌లేక‌పోయాము. ఐర్లాండ్ జ‌ట్టు బెసిక్స్ స‌రిగ్గా పాటించి మాపై విజ‌యం సాధించింది. 

మా కంటే వారు మెరుగ్గా ఆడారు. ఈ సిరీస్ ఓట‌మి మాకు చాలా పాఠాల‌ను నేర్పించింది. భార‌త్ వంటి ఉప‌ఖండ పిచ్‌ల‌పై ఎలా ఆడాలో మా ఆట‌గాళ్ల‌కు బాగా తెలుసు. కానీ వేరే దేశాలకు వెళ్లినప్పుడు అక్కడి వాతావరణానికి తగినట్లుగా ఆడటం నేర్చుకోవాలని ఈ సిరీస్ నిరూపించింది. 

ఐర్లాండ్ బౌల‌ర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. బంతిని స్ట్రెయిట్‌గా హిట్ చేసే అవ‌కాశమివ్వ‌లేదు. రెండు మ్యాచ్‌ల్లో మేము కేవలం కేవ‌లం రెండు స్ట్రెయిట్ సిక్సర్లు మాత్రమే. భారత పిచ్‌లపై దూకుడుగా ఆడే శైలికి మ‌న‌వాళ్లు అల‌వాటు ప‌డిపోయారు. రాబోయో ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌లో కూడా భార‌త్‌కు ఇలాంటి ఫాస్టెస్ట్ వికెట్లు ఎదుర‌వుతాయి. అక్కడ గెలవాలంటే మనం మరింత తెలివిగా ఆడాల్సి ఉంటుంద‌ని" డెష్కాట్ పోస్ట్ మ్యాచ్ కాన్ఫ‌రెన్స్‌లో పేర్కొన్నాడు.
చదవండి: IND vs ENG: అతడికే మా మద్దతు.. వైభవ్‌ ఎదురుచూడాల్సిందే: కోచ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement