కరీంనగర్‌కు చావోరేవో.. టాస్‌ గెలిచిన పాలమూరు | TG20 League: Karimnagar Diamonds Vs Palamuru Strikers Toss Updates | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌కు చావోరేవో.. టాస్‌ గెలిచిన పాలమూరు

Jul 7 2026 2:05 PM | Updated on Jul 7 2026 2:19 PM

TG20 League: Karimnagar Diamonds Vs Palamuru Strikers Toss Updates

తెలంగాణ టీ20 (టీజీ20)- 2026 లీగ్‌లో భాగంగా మంగళవారం మధ్యాహ్నం మ్యాచ్‌లో పాలమూరు స్ట్రైకర్స్‌- కరీంనగర్‌ డైమండ్స్‌ తలపడుతున్నాయి. ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో టాస్‌ గెలిచిన పాలమూరు తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకోగా.. కరీంనగర్‌ బ్యాటింగ్‌కు దిగింది. ఇరుజట్లకు లీగ్‌ దశలో ఇదే ఆఖరి మ్యాచ్‌ కావడం గమనార్హం.

కాగా హైదరాబాద్‌ ఇ- చాంపియన్స్‌ లీగ్‌ దశలో ఏడింట ఏడు గెలిచి.. 14 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఇక హైదారాబాద్‌తో పాటు ఖమ్మం ఏసెస్‌ (ఏడింట ఐదు గెలిచి) తమ ప్లే ఆఫ్స్‌ బెర్తును ఖరారు చేసుకుంది. ఈ క్రమంలో మిగిలిన రెండు బెర్తుల కోసం కరీంనగర్‌ డైమండ్స్‌, నల్గొండ నైట్స్‌, రంగారెడ్డి రైజర్స్‌ పోటీలో ఉన్నాయి.

ఇక మంగళవారం కరీంనగర్‌ పాలమూరుతో మ్యాచ్‌లో గెలిస్తేనే రేసులో ఉండగలుగుతుంది. అనంతరం రంగారెడ్డి- వరంగల్‌ మ్యాచ్‌ ఫలితంతో ప్లే ఆఫ్స్‌ చేరిన మిగిలిన రెండు జట్లు ఏవో తేలుతుంది. 

తుదిజట్లు
పాలమూరు స్ట్రైకర్స్‌
ప్రజ్ఞయ్‌ రెడ్డి (కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), విఘ్నేశ్‌ రెడ్డి, రోహిత్‌ రాయుడు, మణికంఠేశ్వర్‌రెడ్డి, రిషభ్‌ బిస్లాస్‌, ఎండీ ఆఫ్రిదీ అహ్మద్‌, సంహిత్‌ రెడ్డి, ఎండీ షాదాబ్‌ అహ్మద్‌, నిపుణ్‌ రెడ్డి, అశ్వద్‌ రాజీవ్‌, నిశాంత్‌ సేన్‌ రెడ్డి.

కరీంనగర్‌ డైమండ్స్‌
తన్మయ్‌ అగర్వాల్‌ (కెప్టెన్‌), సాత్విక్‌ రెడ్డి, హెచ్‌కే సింహ, రాహుల్‌ రాదేశ్‌ (వికెట్‌ కీపర్‌), చందన్‌ సహాని, టీవీఎస్‌ నారాయణ తేజ, హరీశ్‌ ఠాకూర్‌, శుభం శర్మ, రత్లావత్‌ దినేశ్‌, ఆశిష్‌ శ్రీవాస్తవ్‌, సతీశ్‌ కుమార్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement