breaking news
Pragnay Reddy
-
కరీంనగర్‌కు చావోరేవో.. టాస్ గెలిచిన పాలమూరు
తెలంగాణ టీ20 (టీజీ20)- 2026 లీగ్‌లో భాగంగా మంగళవారం మధ్యాహ్నం మ్యాచ్‌లో పాలమూరు స్ట్రైకర్స్- కరీంనగర్ డైమండ్స్ తలపడుతున్నాయి. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో టాస్ గెలిచిన పాలమూరు తొలుత ఫీల్డింగ్ ఎంచుకోగా.. కరీంనగర్ బ్యాటింగ్‌కు దిగింది. ఇరుజట్లకు లీగ్ దశలో ఇదే ఆఖరి మ్యాచ్ కావడం గమనార్హం.కాగా హైదరాబాద్ ఇ- చాంపియన్స్ లీగ్ దశలో ఏడింట ఏడు గెలిచి.. 14 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఇక హైదారాబాద్‌తో పాటు ఖమ్మం ఏసెస్ (ఏడింట ఐదు గెలిచి) తమ ప్లే ఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకుంది. ఈ క్రమంలో మిగిలిన రెండు బెర్తుల కోసం కరీంనగర్ డైమండ్స్, నల్గొండ నైట్స్, రంగారెడ్డి రైజర్స్ పోటీలో ఉన్నాయి.ఇక మంగళవారం కరీంనగర్ పాలమూరుతో మ్యాచ్‌లో గెలిస్తేనే రేసులో ఉండగలుగుతుంది. అనంతరం రంగారెడ్డి- వరంగల్ మ్యాచ్ ఫలితంతో ప్లే ఆఫ్స్ చేరిన మిగిలిన రెండు జట్లు ఏవో తేలుతుంది. తుదిజట్లుపాలమూరు స్ట్రైకర్స్ప్రజ్ఞయ్ రెడ్డి (కెప్టెన్, వికెట్ కీపర్), విఘ్నేశ్ రెడ్డి, రోహిత్ రాయుడు, మణికంఠేశ్వర్‌రెడ్డి, రిషభ్ బిస్లాస్, ఎండీ ఆఫ్రిదీ అహ్మద్, సంహిత్ రెడ్డి, ఎండీ షాదాబ్ అహ్మద్, నిపుణ్ రెడ్డి, అశ్వద్ రాజీవ్, నిశాంత్ సేన్ రెడ్డి.కరీంనగర్ డైమండ్స్తన్మయ్ అగర్వాల్ (కెప్టెన్), సాత్విక్ రెడ్డి, హెచ్‌కే సింహ, రాహుల్ రాదేశ్ (వికెట్ కీపర్), చందన్ సహాని, టీవీఎస్ నారాయణ తేజ, హరీశ్ ఠాకూర్, శుభం శర్మ, రత్లావత్ దినేశ్, ఆశిష్ శ్రీవాస్తవ్, సతీశ్ కుమార్. -
పాలమూరు నామమాత్రపు స్కోరు
తెలంగాణ టీ20 (టీజీ20)- 2026 లీగ్‌లో భాగంగా సోమవారం నల్గొండ నైట్స్- పాలమూరు స్ట్రైకర్స్ ముఖాముఖి తలపడుతున్నాయి. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో టాస్ గెలిచిన నల్గొండ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో పాలమూరు బ్యాటింగ్‌కు దిగింది.పాలమూరు నామమాత్రపు స్కోరునల్గొండతో మ్యాచ్‌లో పాలమూరు నామమాత్రపు స్కోరుకు పరిమితమైంది. నల్గొండ బౌలర్ల ధాటికి పాలమూరు టాపార్డర్ కుదేలైంది. ఓపెనర్లలో విఘ్నేశ్ రెడ్డి సింగిల్ డిజిట్ స్కోరు (4)కే వెనుదిరగగా.. వన్‌డౌన్ బ్యాటర్ కరణ్ యాదవ్ డకౌట్ అయ్యాడు.మరో ఓపెనర్ చైతన్య రెడ్డి 17 పరుగులు చేయగలిగాడు. ఇలాంటి తరుణంలో కెప్టెన్ ప్రజ్ఞయ్ రెడ్డి (35 బంతుల్లో 55), తేజ (33 బంతుల్లో 50) అద్భుత అర్ధ శతకాలతో రాణించి ఇన్నింగ్స్ చక్కదిద్దారు. మిగిలిన వారిలో ఆఫ్రిది పద్నాలుగు పరుగులు చేయగలిగాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి పాలమూరు 148 పరుగులు స్కోరు చేసింది.నల్గొండ బౌలర్లలో అఫ్రాజ్ అహ్మద్ మూడు వికెట్లు పడగొట్టగా.. నిశాంత్ సరాను రెండు, అనికేత్ రెడ్డి, దివేశ్ సింగ్ తలా ఒక వికెట్ పడగొట్టారు.తుదిజట్లుపాలమూరుప్రజ్ఞయ్ రెడ్డి (కెప్టెన్, వికెట్ కీపర్), విఘ్నేశ్ రెడ్డి అనుముల, చైతన్య రెడ్డి, కరణ్ యాదవ్, రోహిత్ రాయుడు, ఎండీ షాదాబ్ అహ్మద్, ఎండీ ఆఫ్రిది అహ్మద్, రతన్ తేజ, రిషభ్ బస్లాస్, నిపుణ్ రెడ్డి, ఎండీ అజారుద్దీన్నల్గొండరాహుల్ బుద్ధి (కెప్టెన్), అనికేత్ రెడ్డి, హర్షవర్దన్ సింగ్ (వికెట్ కీపర్), గౌరవ్ రెడ్డి, జశ్వంత్ మోటే, పి. నితీశ్ రెడ్డి, ఎండీ అఫ్రాజ్ అహ్మద్, దివేశ్ సింగ్, వరుణ్ గౌడ్, రక్షన్ రెడ్డి, నిశాంత్ సరాను.


