పాపం పాలమూరు.. వరుసగా రెండో ఓటమి | TG20 League 2026 Hyderabad Vs Palamuru Updates | Sakshi
Sakshi News home page

పాపం పాలమూరు.. వరుసగా రెండో ఓటమి

Jun 23 2026 2:08 PM | Updated on Jun 23 2026 6:17 PM

TG20 League 2026 Hyderabad Vs Palamuru Updates

ప్రజ్ఞయ్‌ రెడ్డి- అభిరథ్‌ రెడ్డి (PC: TG20 X)

తెలంగాణ టీ20 లీగ్‌-2026లో భాగంగా పాలమూరు స్ట్రైకర్స్‌- హైదరాబాద్‌ ఇ- చాంపియన్స్‌ మంగళవారం తలపడుతున్నాయి. ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్డేడియంలో టాస్‌ గెలిచిన హైదరాబాద్‌ తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో పాలమూరు బ్యాటింగ్‌కు దిగింది. 

పాలమూరు ఆలౌట్‌
హైదరాబాద్‌ బౌలర్ల ధాటికి పాలమూరు 19.4 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌట్‌ అయింది. అనుముల విఘ్నేశ్‌ రెడ్డి (30), రోహిత్‌ రాయుడు (35), ప్రతీక్‌ పవార్‌ (30) ఓ మోస్తరుగా రాణించారు. హైదాబాద్‌ బౌలర్లలో అజయ్‌ దేవ్‌ గౌడ్‌ నాలుగు వికెట్లు తీయగా.. యశ్‌వీర్‌ గౌడ్‌, ప్రణవ్‌ వర్మ చెరో రెండు, శ్రీనికేత్‌ ఒక వికెట్‌ పడగొట్టారు. 

హైదరాబాద్‌ గెలుపు
నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్‌.. 15.4 ఓవర్లలో పనిపూర్తి చేసింది. కేవలం మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి తొలి గెలుపు నమోదు చేసింది. ఓపెనర్‌, కెప్టెన్‌ అభిరథ్‌ రెడ్డి 35 పరుగులు చేయగా.. అన్విత్‌ రెడ్డి (53 నాటౌట్‌), గడుగు గణేశ్‌ (50 నాటౌట్‌) హాఫ్‌ సెంచరీలతో రాణించారు. 

పాలమూరు బౌలర్లలో రిషభ్‌ బస్లాస్‌ రెండు, రవి కిరణ్‌ ఒక వికెట్‌ పడగొట్టారు. కాగా సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లో పాలమూరు ఖమ్మం ఏసెస్‌ చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే.

తుదిజట్లు
పాలమూరు
అనుముల విజ్ఞేశ్‌ రెడ్డి, పృథ్వీ రెడ్డి, ప్రజ్ఞయ్‌ రెడ్డి (కెప్టెన్‌), రోహిత్‌ రాయుడు, నిశాంత్‌ సేన్‌ రెడ్డి సీహెచ్‌, ప్రతీక్‌ పవార్‌, మహ్మద్‌ ఆఫ్రిది అహ్మద్‌, నిపుణ్‌ రెడ్డి శవ్వా, రిషభ్‌ బస్లాస్‌, కిరణ్‌, జంబోజు పార్దీబన్‌.

హైదరాబాద్‌
హైదరాబాద్‌
అభిరథ్‌ రెడ్డి మందాడి (కెప్టెన్‌), ప్రణవ్‌ వర్మ, అరవింద్‌ (వికెట్‌ కీపర్‌), సాయి వికాస్‌ రెడ్డి, శ్రీనికేత్‌, షణ్ముఖ, అఖిల్‌ రాథోడ్‌, గడుగు గణేశ్‌, అన్విత్‌ రెడ్డి, అజయ్‌ దేవ్‌ గౌడ్‌, యశ్‌వీర్‌ గౌడ్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement