తెలంగాణ టీ20 లీగ్ 2026లో అన్విత ఖమ్మం ఏసెస్ శుభారంభం చేసింది. ఉప్పల్ మైదానం వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో పాలమూరు స్ట్రైకర్స్‌పై 20పరుగుల తేడాతో ఖమ్మం ఘన విజయం సాధించింది. 238 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాలమూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది.
పాలమూరు బ్యాటర్లలో ఓపెనర్ విగ్నేష్ రెడ్డి(31 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 86) టాప్ స్కోరర్‌గా నిలవగా.. చైతన్య రెడ్డి(35) పర్వాలేదనిపించాడు. మిగితా బ్యాటర్లంతా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. ఖమ్మం బౌలర్లలో వేద్‌రెడ్డి రెండు, మిలింద్, వెంకట్, విద్యానంద రెడ్డి తలా వికెట్ సాధించారు.
కాగా తొలుత బ్యాటింగ్ చేసిన ఖమ్మం జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 237 పరుగుల భారీ స్కోర్ సాధించింది.ఏసెస్ బ్యాటర్లలో ఓపెనర్ వాఫీ ఖచ్చి(60), కృష్ణ రెడ్డి(52), హిమతేజ(59) హాఫ్ సెంచరీలతో సత్తాచాటగా.. కెప్టెన్ మిలంద్(18, ప్రతీక్ రెడ్డి(25) రాణించారు. పాలమూర్ బౌలర్లలో కిరణ్ రెండు, రోహిత్ రాయుడు, అఫ్రిది అహ్మద్ తలా వికెట్ పడగొట్టారు.
Juggling act but safe hands! 😮💨
Inches away from the boundary rope, Vidyananda Reddy Ellala recovers well to dismiss the opposition skipper.#PSvANK #SreenidhiUniversityTG20 #ManaCricketShuru pic.twitter.com/G64zKnQpUw— tg20official (@tg20official) June 21, 2026


