మెదక్‌పై పాలమూరు గెలుపు | TG20 League 2026: Medak Falcons vs Palamuru Strikers match updates | Sakshi
Sakshi News home page

మెదక్‌పై పాలమూరు గెలుపు

Jun 25 2026 7:02 PM | Updated on Jun 25 2026 10:42 PM

TG20 League 2026: Medak Falcons vs Palamuru Strikers match updates

ఆదిలోనే పాలమూరుకు షాక్‌
165 పరుగుల లక్ష్య ఛేదనలో పాలమూరు స్ట్రయికర్స్‌కు ఆదిలోనే షాక్‌ తగిలింది. రెండో బంతికే కరణ్‌ యాదవ్‌ (0), మూడో ఓవర్‌ నాలుగో బంతికి ప్రజ్ఞయ్‌ రెడ్డి (15) ఔటయ్యారు. రెండు వికెట్లు యెర్రం​ వరుణ్‌కే దక్కాయి. 3 ఓవర్ల తర్వాత పాలమూరు స్కోర్‌ 18-2గా ఉంది. 

పాలమూరు టార్గెట్‌ 165
టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన మెదక్‌ ఫాల్కన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. విక్రమ్‌ నాయక్‌, వరుణ్‌ యెర్రం తలో 36 పరుగులు చేయడంతో మెదక్‌ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. 

మిగతా బ్యాటర్లలో శృంజిత్‌ రెడ్డి (19), నమన్‌ అగర్వాల్‌ (21), అశ్విన్‌ రామ్‌ (12 రిటైర్డ్‌ ఔట్‌), రవితేజ (13) రెండంకెల స్కోర్లు చేశారు. పాలమూరు బౌలర్లలో రవి కిరణ్‌, రిషబ్‌ చెరో 2 వికెట్లు తీయగా.. అఫ్రిది, తేజ, రోహిత్‌ రాయుడు తలో వికెట్‌ పడగొట్టారు. 

కష్టాల్లో మెదక్‌
మెదక్‌ జట్టు ఒకే ఓవర్‌లో 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అశ్విన్‌ రామ్‌ (12) రిటైర్డ్‌ ఔట్‌ కాగా.. శృంజిత్‌ రెడ్డి (19) తేజ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. 8 ఓవర్ల తర్వాత మెదక్‌ స్కోర్‌ 58-4గా ఉంది. 

రెండో వికెట్‌ ​కోల్పోయిన మెదక్‌
3.4వ ఓవర్‌- 36 పరుగుల వద్ద మెదక్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. రవి కిరణ్‌ బౌలింగ్‌లో నమన్‌ అగర్వాల్‌ (21) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. 

తొలి ఓవర్‌లోనే మెదక్‌కు షాక్‌
మెదక్‌ ఫాల్కన్స్‌కు తొలి ఓవర్‌లోనే షాక్‌ తగిలింది. రవి కిరణ్‌ బౌలింగ్‌లో పవార్‌కు క్యాచ్‌ ఇచ్చి సాయి కాకులమర్రి (1) ఔటయ్యాడు.

టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న పాలమూరు స్ట్రయికర్స్‌
టీజీ20 లీగ్‌ 2026లో భాగంగా ఇవాళ (జూన్‌ 25) జరుగుతున్న తొమ్మిదో మ్యాచ్‌లో పాలమూరు స్ట్రయికర్స్‌, మెదక్‌ ఫాల్కన్స్‌ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో పాలమూరు జట్టు టాస్‌ గెలిచి తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement