వ‌ర్షంతో వ‌రంగ‌ల్‌, పాల‌మూరు మ్యాచ్ ర‌ద్దు | Warangal Warriors Vs Palamuru Strikers Match Abandoned Due-To-Heavy Rain | Sakshi
Sakshi News home page

TG20 League: వ‌ర్షంతో వ‌రంగ‌ల్‌, పాల‌మూరు మ్యాచ్ ర‌ద్దు

Jul 3 2026 10:24 PM | Updated on Jul 3 2026 11:43 PM

Warangal Warriors Vs Palamuru Strikers Match Abandoned Due-To-Heavy Rain

టీజీ20 లీగ్‌లో శుక్ర‌వారం వ‌రంగ‌ల్ వారియ‌ర్స్‌, పాల‌మూరు స్ట్రైక‌ర్స్ మ‌ధ్య మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ర‌ద్ద‌యింది. టాస్ గెలిచిన పాల‌మూరు స్ట్రైక‌ర్స్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన వ‌రంగ‌ల్ వారియ‌ర్స్ 2.3 ఓవ‌ర్ల‌లో వికెట్ న‌ష్టానికి 23 ప‌రుగులు చేసింది. హ‌ర్షిత్ చౌద‌రీ (8), రిషికేత్ సిసోడియా (1) ప‌రుగుల‌తో ఆడుతున్నారు. 

ఈ ద‌శ‌లో వ‌ర్షం అంత‌రాయం క‌లిగించ‌డంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. ఆ త‌ర్వాత వ‌ర్షం ఎంత‌కీ తెరిపినివ్వ‌క‌పోవ‌డంతో మ్యాచ్ ర‌ద్దుకే అంపైర్లు మొగ్గు చూపారు. దీంతో ఇరుజ‌ట్ల‌కు చెరో పాయింట్ లభించింది. ఈ సిరీస్ లో ఇప్పటివరకు పాలమూరు స్ట్రైకర్స్, వరంగల్ వారియర్స్ ఆరు చొప్పున మ్యాచ్లు ఆడగా.. ఒక్కో మ్యాచ్లో విజయం సాధించాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement